Redmi K50 Extreme - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 08 Aug 2022 14:42:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గీక్‌బెంచ్ పై కనిపించిన Redmi K50 Extreme ఎడిషన్ https://www.91mobiles.com/telugu/redmi-k50-extreme-edition-spotted-on-geekbench-specs/ Mon, 08 Aug 2022 14:42:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=1549 హైలైట్స్: ఈ ఫోన్లో 108 ఎంపి కెమెరా, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటాయని అంచనా 22081212సీ అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ పై కనిపించిన హ్యాండ్సెట్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1339, మల్టీ స్కోర్ టెస్ట్ లో 4389 పాయింట్లు సాధించిన రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ చైనాలో త్వరలోనే లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయిన కే50 సిరీస్ ఫోన్స్ లైనప్ లో చేరనుంది. […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Redmi K50 Extreme ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఈ ఫోన్లో 108 ఎంపి కెమెరా, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటాయని అంచనా
  • 22081212సీ అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ పై కనిపించిన హ్యాండ్సెట్
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 1339, మల్టీ స్కోర్ టెస్ట్ లో 4389 పాయింట్లు సాధించిన రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్

రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ చైనాలో త్వరలోనే లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయిన కే50 సిరీస్ ఫోన్స్ లైనప్ లో చేరనుంది. ప్రకటన కోసం వేచి చూస్తున్న తరుణంలో, చైనాకు చెందిన టిప్ స్టర్ పండల్స్‌బాల్డ్ రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ను రివీల్ చేశాడు. అలాగే ఈ ఫోన్ గీక్‌బెంచ్ పై కూడా కనిపించింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే, మార్కెట్లో శక్తివంతమైన ఫోన్లలో ఒకటిగా ఈ ఫోన్ నిలవడం ఖాయం.

రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. అలాగే కే50 సిరీస్ లో అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగిన తొలి ఫోన్ గా రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ నిలవనుంది. ఇక ఈ ఫోన్లో 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉండనుంది.

గీక్‌బెంచ్ పై కనిపించిన Redmi K50 Extreme ఎడిషన్

22081212సీ అనే మోడల్ నంబర్ తో రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఈ విషయాన్ని మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింది. ఈ ఫోన్ యొక్క క్లాక్ స్పీడ్ 3.19 గిగాహెర్ట్జ్ అని, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ని కలిగి ఉందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. గీక్ బెంచ్ పై 12జిబి ర్యామ్ వేరియంట్ కనిపించింది. అయితే ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశముంది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1339 పాయింట్లు, మల్టీ కోర్ట్ టెస్ట్ లో 4389 పాయింట్లు సాధించింది.

Redmi K50 Extreme Edition స్పెసిఫికేషన్స్ (అంచనా)

రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్ అమోలెడ్ ప్యానెల్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక భద్రత కొరకు ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందిస్తున్నట్లు సమాచారం. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తుందని రెడ్మీ ఇదివరకే స్పష్టం చేసింది. 8జిబి+128జిబి, 12జిబి+256జిబి వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. భారత్ తో సహా, గ్లోబల్ గా ఈ ఫోన్ ని షావోమీ 12టీ అనే పేరుతో లాంచ్ చేసే అవకాశముంది.

రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ 200ఎంపి కెమెరాతో వస్తుందని ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్డేట్ ని బట్టి ఈ ఫోన్ 108ఎంపి కెమెరాతో వస్తున్నట్లు స్పష్టమైంది. ఇది శాంసంగ్ తయారు చేసిన ఐసోసెల్ హెచ్ఎం6 లెన్స్. ఇక ఇందులో 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ లెన్స్, 2ఎంపి మ్యాక్రో/డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపున ఈ ఫోన్లో 20ఎంపి కెమెరాను అమర్చారు.

టీఈఎన్ఏఏ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ నెలలో ఎప్పుడైనా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే చాన్సెస్ ఉన్నట్లు సమాచారం.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Redmi K50 Extreme ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి రెడీగా ఉన్న Redmi K50 Extreme https://www.91mobiles.com/telugu/redmi-confirms-redmi-k50-extreme-edition-launch-this-month/ Sat, 06 Aug 2022 09:08:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=1517 హైలైట్స్: ఈ నెలలో రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసిన షావోమీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత షావోమీ 12టీ ప్రో రూపంలో భారత్ మరియు ప్రపంచ దేశాలకు వెళ్ళనున్న రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ కలిగిన రెడ్మీ కే50 ఫోన్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు ఇంటర్నెట్ లో వార్తలు వస్తున్నాయి. రెడ్మీ […]

The post లాంచ్ కి రెడీగా ఉన్న Redmi K50 Extreme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఈ నెలలో రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసిన షావోమీ
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత
  • షావోమీ 12టీ ప్రో రూపంలో భారత్ మరియు ప్రపంచ దేశాలకు వెళ్ళనున్న రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ కలిగిన రెడ్మీ కే50 ఫోన్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు ఇంటర్నెట్ లో వార్తలు వస్తున్నాయి. రెడ్మీ కే50 అల్ట్రా లేదా రెడ్మీ కే50ఎస్ ప్రో అనే పేర్లతో ఈ ఫోన్ రానుందని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా రెడ్మీ సంస్థ తన వీబో పోస్ట్ ద్వారా ఫోన్ గురించి స్పష్టతనిచ్చింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లాంచ్ కాబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

అయితే, షావోమీ ఈ ఫోన్ ని రెడ్మీ కే50 అల్ట్రా అని మార్కెట్ చేసే అవకాశముంది. రెడ్మీ కే30 అల్ట్రాని రెడ్మీ కే30ఎస్ ఎక్స్‌ట్రిమ్ అని మార్కెట్ చేసింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశముంది. షావోమీ 12టీ ప్రో అనే పేరుతో రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ భారత్ తో పాటు, ఇతర దేశాల్లో లాంచ్ కానున్నట్లు సమాచారం.

గతంలో ఈ హ్యాండ్సెట్ 3సీ సర్టిఫికేషన్ పై కనిపించింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ గ్లోబల్ మార్కెట్ లో షావోమీ 12టీ ప్రో గా రానున్నట్లు ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. ఈ సర్టిఫికేషన్ ని బట్టి, రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 67/120 వాట్ ర్యాపిడ్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇక కెమెరాపై కూడా ఒక ఆసక్తికర రూమర్ బయటకు వచ్చింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లో 200 మెగాపిక్సెల్ హెచ్‌పీ1 ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఇకపోతే బేసిక్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉండనుంది.

రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ యొక్క ప్రాసెసర్ వివరాలను వెల్లడించిన రెడ్మీ, ఈ నెలలో లాంచ్ ఉండనున్నట్లు తెలిపింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ రిడిజైన్, అప్‌గ్రేడ్ చేయబడిందని, కే50 యూనివర్స్ లో అల్టిమేట్ మాస్టర్ పీస్ గా నిలుస్తుందని కంపెనీ తెలిపింది.

ఇప్పటి వరకు రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. కానీ, రానున్న రోజుల్లో ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. తొలుత రెడ్మీ కే50ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ చైనాలాలో అమ్ముడవ్వనుంది. తర్వాత, గ్లోబల్ మార్కెట్స్ లో షావోమీ 12టీ ప్రో అనే పేరుతో ఎంట్రీ ఇస్తుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో పాటు ఈ ఫోన్లో 200ఎంపి కెమెరాని కూడా జతచేరిస్తే, పేరుకి తగినట్లే ఎక్స్‌ట్రిమ్ ఫోన్ అనిపించుకుంటుంది.

The post లాంచ్ కి రెడీగా ఉన్న Redmi K50 Extreme first appeared on 91Mobiles Telugu.

]]>