Redmi K60e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 11:56:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఇటీవలె లాంచైన Redmi K60e విశేషాలు https://www.91mobiles.com/telugu/redmi-k60e-launched-china-price-specs/ Thu, 29 Dec 2022 07:07:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4231 హైలైట్స్ చైనాలో ఈమధ్యే లాంచైన Redmi K60e స్మార్ట్ ఫోన్ Redmi K60e తో పాటు లాంచైన Redmi K60, Redmi K60 Pro డివైజెస్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Redmi K60 సిరీస్ రెడ్మీ కే-సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమధ్య రెడ్మీ కే50 సిరీస్ ఫోన్లను షావోమి భారత్ లో లాంచ్ చేసింది. కొన్ని రోజుల క్రితం షావోమి చైనాలో […]

The post ఇటీవలె లాంచైన Redmi K60e విశేషాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో ఈమధ్యే లాంచైన Redmi K60e స్మార్ట్ ఫోన్
  • Redmi K60e తో పాటు లాంచైన Redmi K60, Redmi K60 Pro డివైజెస్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Redmi K60 సిరీస్

రెడ్మీ కే-సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమధ్య రెడ్మీ కే50 సిరీస్ ఫోన్లను షావోమి భారత్ లో లాంచ్ చేసింది. కొన్ని రోజుల క్రితం షావోమి చైనాలో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో ఈ సిరీస్ భారత్ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్టికల్ లో మనం Redmi K60e గురించి తెలుసుకుందాం.

Redmi K60e లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి: 6.7-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్. ఇలా ఇంకా ఎన్నో సూపర్బ్ ఫీచర్స్ ఉన్నాయి. సరే, ఇంకా ఏమేమున్నాయో తెలుసుకుందాం పదండి మరి.

Redmi K60e స్పెసిఫికేషన్స్

Redmi K60e స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో లాంచైంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi K60e లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఉన్నాయి. 5జీ, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం Redmi K60e లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60e యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi K60E ధర

8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర RMB 2,199 (సుమారు రూ.26,200). 8జిబి+256జిబి వేరియంట్ ధర RMB 2,399 (సుమారు రూ.28,600). 12జిబి+256జిబి మోడల్ ధర RMB 2599 (సుమారు రూ.31,000). 12జిబి + 512జిబి యూనిట్ ధర RMB 2,799 (సుమారు రూ.33,400).

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇటీవలె లాంచైన Redmi K60e విశేషాలు first appeared on 91Mobiles Telugu.

]]>
67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచైన Redmi K60 https://www.91mobiles.com/telugu/redmi-k60-launched-china-price-specs/ Tue, 27 Dec 2022 14:37:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4201 హైలైట్స్ నేడు చైనాలో లాంచైన Redmi K60 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Redmi K60 డివైజ్ చైనా లో Redmi K60 ధర రూ.29,700 నుంచి ప్రారంభం చైనాలో నేడు Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60e డివైజెస్ ఉన్నాయి. రెడ్మీ కే-సిరీస్ కి భారత్ […]

The post 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచైన Redmi K60 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు చైనాలో లాంచైన Redmi K60 సిరీస్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Redmi K60 డివైజ్
  • చైనా లో Redmi K60 ధర రూ.29,700 నుంచి ప్రారంభం

చైనాలో నేడు Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60e డివైజెస్ ఉన్నాయి. రెడ్మీ కే-సిరీస్ కి భారత్ లో ఎంతోమంది అభిమానులున్నారు. వారంతా కే60 సిరీస్ లాంచ్ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది.

ప్రస్తుతం మనం Redmi K60 మోడల్ గురించి తెలుసుకుందాం. Redmi K60 డివైజ్ 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో లాంచైంది. సరే, ఓసారి Redmi K60 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Redmi K60 ధర

Redmi K60 5G ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB. ఈ వేరియంట్స్ ధరలు వరుసగా 2499 యువాన్లు (సుమారు రూ.29,700), 2,699 యువాన్లు (సుమారు రూ.32,200), 2,999 యువాన్లు (సుమారు రూ.35,700), 3,299 యువాన్లు (సుమారు రూ.39,300), 3599 యువాన్లు (సుమారు రూ.42,900).

Redmi K60 స్పెసిఫికేషన్స్

Redmi K60 లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. Redmi K60 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi K60e స్పెసిఫికేషన్స్

ఇక Redmi K60e విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చింది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

Redmi K60e లో 6.67-ఇంచ్ అమోలెడ్ 2కే రెజుల్యూషన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే హోల్-పంచ్ కటౌట్ తో వచ్చింది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 5జీ, 4జీ వొల్టీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచైన Redmi K60 first appeared on 91Mobiles Telugu.

]]>