Redmi Note 10 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 14 Sep 2022 14:57:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MIUI 13 అప్డేట్ తర్వాత Redmi Note 10 Pro, Pro Max ఫోన్లలో కెమెరా ఇష్యూస్: ఉచిత టెక్నికల్ సపోర్ట్ అందిస్తామన్న Xiaomi https://www.91mobiles.com/telugu/redmi-note-10-pro-10-pro-max-camera-issues-miui-13-roll-out/ Wed, 14 Sep 2022 14:54:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=2339 హైలైట్స్: MIUI 13 అప్డేట్ తర్వాత కెమెరా క్రాష్ అవుతోందని Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max కస్టమర్ల నుంచి ఫిర్యాదులు సమస్య ఎదురైన ఫోన్లకు ఉచితంగా టెక్నికల్ సపోర్ట్, రిపేరు అందిస్తామని తెలిపిన షావోమీ ఇటీవలె ఎంఐయూఐ 13 అప్డేట్ అందుకున్న Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max ఇటీవలె రెడ్మీ ఇండియా Redmi Note 10 Pro, Redmi Note 10 Pro […]

The post MIUI 13 అప్డేట్ తర్వాత Redmi Note 10 Pro, Pro Max ఫోన్లలో కెమెరా ఇష్యూస్: ఉచిత టెక్నికల్ సపోర్ట్ అందిస్తామన్న Xiaomi first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • MIUI 13 అప్డేట్ తర్వాత కెమెరా క్రాష్ అవుతోందని Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max కస్టమర్ల నుంచి ఫిర్యాదులు
  • సమస్య ఎదురైన ఫోన్లకు ఉచితంగా టెక్నికల్ సపోర్ట్, రిపేరు అందిస్తామని తెలిపిన షావోమీ
  • ఇటీవలె ఎంఐయూఐ 13 అప్డేట్ అందుకున్న Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max

ఇటీవలె రెడ్మీ ఇండియా Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max డివైజెస్ కి ఎంఐయూఐ 13 అప్డేట్ ని రోలౌట్ చేసింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, చాలా మంది యూజర్లు కెమెరా యాప్ క్రాష్ అవుతోందని ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ పై కూడా కెమెరా క్రాష్ అవుతోందని పలువురు తెలిపారు. చాలా మంది కెమెరాను అధికంగా వాడతారు కావున, ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యగా మారింది.

సమస్యను గుర్తించిన షావోమీ ఇండియా సమస్యను ఎదుర్కొంటోన్న యూజర్లకు ఉచితంగా టెక్నికల్ సపోర్ట్, రిపేర్లను చేసి పెడతామని హామీ ఇచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న షావోమీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ లో రూపాయి తీసుకోకుండా కస్టమర్ల ఫోన్లను రిపేరు చేస్తామని కంపెనీ తెలిపింది.

Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max కెమెరా ఇష్యూ

Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max కస్టమర్లు ఎంఐయూఐ13 అప్డేట్ రిసీవ్ చేసుకున్నాక, కెమెరా లోపాలను గుర్తించారు. కంపెనీ ఈ సమస్యపై స్పందించి ఉచితంగా యూజర్లకు టెక్నికల్ సపోర్ట్ అందిస్తామని భరోసా ఇచ్చింది. రెడ్మీ ఫోన్లకు ఈ చిక్కులు కొత్తవి కాదు. ఇదివరకు రెడ్మీ నోట్ 10 సిరీస్ లో హార్డ్‌వేర్ లోపాలు వెలుగు చూశాయి. 2021 ఏప్రిల్ లో రెడ్మీ నోట్ 10 సిరీస్ డిస్ప్లే సమస్యలను ఎదుర్కొంది. అయితే, ఈ చిక్కులు కేవలం 0.001 శాతం ఫోన్లలో మాత్రమే ఎదురైనట్లు షావోమీ తెలిపింది.

Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max స్పెసిఫికేషన్స్

Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max ఫోన్లలో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, పంచ్-హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జి చిప్సెట్, అడ్రెనో 618జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Redmi Note 10 Pro Max లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీడబ్ల్యూ3 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి టెలీమ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

మరోవైపు Redmi Note 10 Pro లో 64ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీడబ్ల్యూ3 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి టెలీ మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MIUI 13 అప్డేట్ తర్వాత Redmi Note 10 Pro, Pro Max ఫోన్లలో కెమెరా ఇష్యూస్: ఉచిత టెక్నికల్ సపోర్ట్ అందిస్తామన్న Xiaomi first appeared on 91Mobiles Telugu.

]]>