Redmi Note 11 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 23 Sep 2022 10:17:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Google Play Console పై కనిపించిన Redmi Note 11 Pro 2023 మోడల్ https://www.91mobiles.com/telugu/redmi-note-11-pro-2023-edition-spotted-on-google-play-console-specs-leaked/ Fri, 23 Sep 2022 10:17:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=2535 హైలైట్స్: 2023 లో కొత్త అవతారంలో రాబోతున్న Redmi Note 11 Pro Snapdragon 712 చిప్ తో రానున్న Redmi Note 11 Pro ప్రస్తుతం ఉన్న మోడల్ మాదిరే ఉండనున్న Redmi Note 11 Pro 2023 ఎడిషన్ షావోమీ కంపెనీ 2022 మొదట్లో భారత మార్కెట్ లో Redmi Note 11 సిరీస్ ని లాంచ్ చేసింది. అయితే వచ్చే ఏడాది Redmi Note 11 Pro 2023 ఎడిషన్ లాంచ్ అవుతోంది. […]

The post Google Play Console పై కనిపించిన Redmi Note 11 Pro 2023 మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2023 లో కొత్త అవతారంలో రాబోతున్న Redmi Note 11 Pro
  • Snapdragon 712 చిప్ తో రానున్న Redmi Note 11 Pro
  • ప్రస్తుతం ఉన్న మోడల్ మాదిరే ఉండనున్న Redmi Note 11 Pro 2023 ఎడిషన్

షావోమీ కంపెనీ 2022 మొదట్లో భారత మార్కెట్ లో Redmi Note 11 సిరీస్ ని లాంచ్ చేసింది. అయితే వచ్చే ఏడాది Redmi Note 11 Pro 2023 ఎడిషన్ లాంచ్ అవుతోంది. లీకైన గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ తొలుత గీక్‌బండ్ అనే వెబ్ సైట్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ పై Redmi Note 11 Pro 2023 మోడల్ రెడ్మీ స్వీట్ అనే కోడ్ నేమ్ తో కనిపించింది. దీంతో ఫోన్ యొక్క ప్రాసెసర్, డిస్ప్లే రెజుల్యూషన్, జీపీయూ, తదితర కీలక స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. మరి Redmi Note 11 Pro 2023 ఎడిషన్ నుంచి ఏమి ఆశించవచ్చో తెలుసుకుందాం పదండి.

Redmi Note 11 Pro 2023 ఎడిషన్ క్వాల్కమ్ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 712 చిప్సెట్ తో వస్తున్నట్లు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇక స్నాప్ డ్రాగన్ 712 చిప్ విషయానికి వస్తే, ఇది 10 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన పాతతరం చిప్సెట్. ఆక్టాకోర్ ఆర్కిటెక్చర్ కలిగిన ఈ చిప్ 2 పెర్ఫామెన్స్ కోర్స్, 6 ఎఫిషియన్సీ కోర్స్ ని కలిగి ఉంటుంది. అలాగే Redmi Note 11 Pro 2023 ఎడిషన్ అడ్రెనో 610 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

చిప్సెట్ కాకుండా, ఇతర డిస్ప్లే స్పెసిఫికేషన్స్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలిశాయి. Redmi Note 11 Pro 2023 ఎడిషన్ లో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2400*1080 రెజుల్యూషన్, 440 పీపీఐ డెన్సిటీ ఉంటాయి. Redmi Note 11 Pro 2022 మోడల్ మాదిరిగానే Redmi Note 11 Pro 2023 ఎడిషన్ స్క్రీన్ సైజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Redmi Note 11 Pro స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. మైనర్ అప్‌గ్రేడ్స్ తో ఓ ఫోన్ ని రీ-లాంచ్ చేయడం షావోమీ కంపెనీకి కొత్త విషయం కాదు. గతేడాది రెడ్మీ 8 ఫోన్ ని కూడా 2021 లో కొత్త చిప్సెట్ తో ఫ్రెష్ గా రీ-లాంచ్ చేసింది. అలాగే పలు సాఫ్ట్ వేర్ మార్పులను కూడా చేసింది.

Redmi Note 11 Pro ధర, స్పెసిఫికేషన్స్

ఈ ఏడాది ప్రథమార్థంలో Redmi Note 11 Pro స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.18,990 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత వర్షన్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.

Redmi Note 11 Pro లో వెనకాల మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. Redmi Note 11 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Google Play Console పై కనిపించిన Redmi Note 11 Pro 2023 మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>