Redmi Note 11 SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Sep 2022 15:59:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi Note 11 SE పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/redmi-note-11-se-discount-flipkart/ Thu, 08 Sep 2022 15:59:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=2212 హైలైట్స్: Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు మీడియాటెక్ హీలియో జీ95 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ఫ్లిప్ కార్ట్ ద్వారా Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసే అవకాశం షావోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi Note 11 SE ని ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే కొనుగోలు చేసే చాన్స్ […]

The post Redmi Note 11 SE పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు
  • మీడియాటెక్ హీలియో జీ95 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా Redmi Note 11 SE స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసే అవకాశం

షావోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi Note 11 SE ని ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే కొనుగోలు చేసే చాన్స్ వచ్చింది. భారత్ లో ఈ ఫోన్ కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో పంచ్-హోల్ కటౌట్ ని ఇచ్చారు. క్వాడ్ రియర్ కెమెరాస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. FHD+ డిస్ప్లే, Mediatek Helio G95 ప్రాసెసర్, 64MP ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు. Redmi Note 11 SE యొక్క డీల్స్, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం పదండి.

Redmi Note 11 SE ఆఫర్లు

Redmi Note 11 SE ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.13,999 గా ఉంది. చాలా బ్యాంక్స్ ఫోన్ పై రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా రూ.1000 డిస్కౌంట్, ఫెడరల్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పై రూ.1000 డిస్కౌంట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. వీటితో పాటు ఫ్లిప్ కార్ట్ అదనంగా రూ.500 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఏ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసినా వర్తిస్తుంది. ఈ విధంగా చూస్తే మొత్తం రూ.1500 డిస్కౌంట్ కలిపి Redmi Note 11 SE ఫోన్ ని రూ.12,499 కి సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 11 SE స్పెసిఫికేషన్స్

Redmi Note 11 SE 6.43 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 700 నిట్స్ బ్రైట్నెస్, Mediatek Helio G95 చిప్, Mali-G76 MC4 గ్రాఫిక్స్, MiUi 12.5 కస్టమ్ స్కిన్, Android 11 OS వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 13MP కెమెరాను అమర్చారు.

Redmi Note 11 SE 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఇందులో 4G LTE, VOLTE, VOWIFI, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi AC, Bluetooth 5.0, GPS, NFC, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, 3.5mm ఆడియో జాక్, USB TYPE-C పోర్ట్ ఉన్నాయి. Redmi Note 11 SE లో స్టీరియో స్పీకర్లు, IP53 రేటింగ్, సైడ్ మౌంటెడ్-ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

The post Redmi Note 11 SE పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>