Redmi Note 11T Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 14 Sep 2022 10:05:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 చైనాలో పేలిన Redmi Note 11T Pro (Redmi K50i) ఫోన్ https://www.91mobiles.com/telugu/redmi-note-11t-pro-explosion-china-video-surfaced/ Wed, 14 Sep 2022 10:05:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2330 హైలైట్స్: చైనాలో బ్లాస్ట్ అయిన Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్ టిక్ టాక్ లో పోస్ట్ కాబడిన పేలిన ఫోన్ వీడియో క్లిప్ భారత్ లో Redmi K50i గా రీబ్రాండ్ అయిన Redmi Note 11T Pro షావోమీ ఫోన్లు పేలిన ఉదంతాలు గతంలో భారత్ లో ఎన్నింటినో మనం చూశాం. తాజాగా Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్ చైనాలో పేలింది. ఈ ఫోన్ భారత్ లో Redmi K50i […]

The post చైనాలో పేలిన Redmi Note 11T Pro (Redmi K50i) ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనాలో బ్లాస్ట్ అయిన Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్
  • టిక్ టాక్ లో పోస్ట్ కాబడిన పేలిన ఫోన్ వీడియో క్లిప్
  • భారత్ లో Redmi K50i గా రీబ్రాండ్ అయిన Redmi Note 11T Pro

షావోమీ ఫోన్లు పేలిన ఉదంతాలు గతంలో భారత్ లో ఎన్నింటినో మనం చూశాం. తాజాగా Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్ చైనాలో పేలింది. ఈ ఫోన్ భారత్ లో Redmi K50i అనే పేరుతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎవ్వరికీ హాని కలగలేదు. కానీ, ఫోన్ మాత్రం రిపేర్ కి కూడా పనికి రాకుండా పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. చైనా ట్విట్టర్ మాధ్యమంలో పోస్ట్ అయిన ఈ వీడియో ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. Redmi Note 11T Pro ఏ విధంగా కాలిపోయిందో ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు.

డిస్ప్లే మొత్తం పగిలిపోయింది. బ్యాక్ ప్యానెల్ పై బ్యాటరీ వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ స్క్రీన్ నుంచి విడిపోవడం, బ్యాటరీ బయటకు రావడం మనం చూడవచ్చు. ప్రస్తుతానికి Redmi Note 11T Pro పేలడానికి గల కారణాలు తెలియలేదు. ఘటనపై షావోమీ ఇంకా స్పందించలేదు.

పేలిన మరో Xiaomi ఫోన్

చైనాలో Redmi Note 11T Pro పేలినట్లు సమాచారం. వీడియో క్లిప్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై బ్యాటరీ వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ స్క్రీన్ నుంచి విడిపోయి, బ్యాటరీ బయటకు వచ్చింది. చూస్తుంటే ఫోన్ రిపేర్ చేయడానికి వీలు లేనట్లుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. ప్రస్తుతానికి ఈ వీడియో కి సంబంధించిన సోర్స్ గురించి వివరాలు తెలియదు. కానీ ట్విట్టర్ లో పీయుష్ భాసర్కార్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు.

Redmi Note 11T Pro స్పెసిఫికేషన్స్

Redmi Note 11T Pro లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్, డీసీ డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, ఏఆర్ఎం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Redmi Note 11T Pro లో 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇప్పుడు బ్యాటరీ విభాగంపై ఓ కన్నేద్దాం పదండి. Redmi Note 11T Pro లో 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫోన్ భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్, హై-రెజుల్యూషన్ ఆడియో, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి.

The post చైనాలో పేలిన Redmi Note 11T Pro (Redmi K50i) ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>