Redmi Note 12 Pro 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 04 Apr 2023 12:07:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 108ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో ఇండోనేషియాలో లాంచైన Redmi Note 12 Pro 4G https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-4g-launched-indonesia-108mp-camera-8gb-ram/ Tue, 04 Apr 2023 12:07:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5736 Redmi Note 12 సిరీస్ లో షావోమి సంస్థ కొత్త ఫోన్ Redmi Note 12 Pro 4G ని ఇండోనేషియాలో లాంచ్ చేసింది. Redmi Note 12 Pro 4G స్మార్ట్ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 108 ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 732జి ప్రాసెసర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైంది. సరే, ఓసారి Redmi Note 12 Pro 4G డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి. […]

The post 108ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో ఇండోనేషియాలో లాంచైన Redmi Note 12 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్ డ్రాగన్ 732జి ప్రాసెసర్ తో లాంచైన Redmi Note 12 Pro 4G
  • అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్
  • డాల్బి అట్మాస్, డాల్బి విజన్ సపోర్ట్ కలిగి ఉన్న Redmi Note 12 Pro 4G

Redmi Note 12 సిరీస్ లో షావోమి సంస్థ కొత్త ఫోన్ Redmi Note 12 Pro 4G ని ఇండోనేషియాలో లాంచ్ చేసింది. Redmi Note 12 Pro 4G స్మార్ట్ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 108 ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 732జి ప్రాసెసర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైంది. సరే, ఓసారి Redmi Note 12 Pro 4G డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 Pro 4G ధర, లభ్యత

Redmi Note 12 Pro 4G స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ దర, లభ్యతకి సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాలేదు. కానీ, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫోన్ సేల్ మే నెలలో మొదలయ్యే అవకాశం ఉంటుందని అంచనా.

Redmi Note 12 Pro 4G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro 4G డివైజ్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఇతర రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్ల మాదిరి స్క్రీన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 732జి చిప్సెట్ వాడారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకునే వీలుంది.

ఇప్పుడు Redmi Note 12 Pro 4G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. 4కే వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi Note 12 Pro 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్, 4జీ వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్ స్టీరియో స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Redmi Note 12 Pro 4G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 108ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో ఇండోనేషియాలో లాంచైన Redmi Note 12 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>