Redmi Note 12 Pro Speed Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:47:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 108ఎంపి కెమెరా, ఓఎల్ఈడీ డిస్ప్లేతో లాంచైన Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-speed-edition-launched-china-price-specs/ Wed, 28 Dec 2022 04:29:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=4206 హైలైట్స్ చైనాలో లాంచైన Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో POCO X5 పేరుతో లాంచ్ కానున్న Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Redmi Note 12 Pro డివైజ్ షావోమి సంస్థ నిన్ననే Redmi K60 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో k60, k60e, k60 […]

The post 108ఎంపి కెమెరా, ఓఎల్ఈడీ డిస్ప్లేతో లాంచైన Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్
  • భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో POCO X5 పేరుతో లాంచ్ కానున్న Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్
  • గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Redmi Note 12 Pro డివైజ్

షావోమి సంస్థ నిన్ననే Redmi K60 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో k60, k60e, k60 pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. తాజాగా షావోమి తన Note 12 సిరీస్ కి ఒక కొత్త ఫోన్ ని జత చేసింది. Redmi Note 12 Pro Speed Edition ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ నోట్ 12 ప్రో తో పోల్చితే వేరే ప్రాసెసర్ మరియు కెమెరా తో వచ్చింది. 108ఎంపి కెమెరా, ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది.

Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ గ్లోబల్ మార్కెట్స్ లో POCO X5 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై షావోమి ఇంకా ఏ విషయాన్ని స్పష్టం చేయలేదు. సరే, ఈలోపు మనం ఓసారి Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ ధర, స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ చైనాలో 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ (ధర: 1699 యువాన్లు – సుమారు రూ.20,200), 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ (ధర: 1799 యువాన్లు – సుమారు రూ.21,400), 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ (ధర: 1999 యువాన్లు – సుమారు రూ.23,800). ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Note 12 Pro స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో వచ్చింది. ఇందులో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీ వాడారు. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉన్నాయి.

Redmi Note 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ ఐపీ53 రేటింగ్ తో వస్తోంది. ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, 5.2, వై-ఫై 6, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Redmi Note 12 Pro యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 108ఎంపి కెమెరా, ఓఎల్ఈడీ డిస్ప్లేతో లాంచైన Redmi Note 12 Pro స్పీడ్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>