Redmi Note 12 Turbo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 28 Mar 2023 14:19:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Redmi Note 12 Turbo https://www.91mobiles.com/telugu/redmi-note-12-turbo-launched-china-price-specs-availability/ Tue, 28 Mar 2023 14:19:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=5622 Redmi Note 12 Turbo స్మార్ట్ ఫోన్ అధికారికంగా చైనాలో లాంచైంది. ఇప్పటికే ఉన్న Redmi Note 12 సిరీస్ లైనప్ కి లేటెస్ట్ ఫోన్ జతచేరింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ Redmi Note 12 Turbo కావడం విశేషం. Redmi Note 12 Turbo ఫోన్ బాక్సీ ప్యానెల్, ఫ్లాట్ ఎడ్జెస్, రెక్టాంగ్యులర్ ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ తో ఇతర రెడ్మీ 12 సిరీస్ […]

The post స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Redmi Note 12 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Redmi Note 12 Turbo స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Turbo
  • Redmi Note 12 Turbo ప్రారంభ ధర ఆర్ఎంబి 1999 (సుమారు రూ.23,900)

Redmi Note 12 Turbo స్మార్ట్ ఫోన్ అధికారికంగా చైనాలో లాంచైంది. ఇప్పటికే ఉన్న Redmi Note 12 సిరీస్ లైనప్ కి లేటెస్ట్ ఫోన్ జతచేరింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ Redmi Note 12 Turbo కావడం విశేషం. Redmi Note 12 Turbo ఫోన్ బాక్సీ ప్యానెల్, ఫ్లాట్ ఎడ్జెస్, రెక్టాంగ్యులర్ ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ తో ఇతర రెడ్మీ 12 సిరీస్ ఫోన్లను పోలి ఉంది. ఇకపోతే పోన్ బ్యాక్ ప్యానెల్ మెరుస్తూ యూనిక్ గా కనిపిస్తోంది. Redmi Note 12 Turbo లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Redmi Note 12 Turbo ధర

Redmi Note 12 Turbo 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఆర్ఎంబి 1999 (సుమారు రూ.23,900) గా నిర్ణయించారు. 12జిబి + 256జిబి మోడల్ ధర ఆర్ఎంబి 2199 (సుమారు రూ.26,300) గా ఉంది. 12జిబి + 512జిబి వేరియంట్ ధర ఆర్ఎంబి 2399 (సుమారు రూ.28,700) గా ఉంది. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంది. దీని ధర ఆర్ఎంబి 2799 (సుమారు రూ.33,400) గా ఉంది. Redmi Note 12 Turbo డివైజ్ బ్లూ, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Redmi Note 12 Turbo డివైజ్ స్పెషల్ హ్యారీ పోటర్ ఎడిషన్ లో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ రియర్ కెమెరా కటౌట్స్ హ్యారీ యొక్క సిగ్నేచర్ గ్లాసెస్ మరియు లైట్నింగ్ స్కార్స్ ని పోలి ఉంటాయి. హ్యారీ పోటర్ ఎడిషన్ డివైజ్ కస్టమైజ్డ్ బూట్ యానిమేషన్, వాల్ పేపర్స్, థీమ్ తదితర వాటితో వస్తుంది.

Redmi Note 12 Turbo స్పెసిఫికేషన్స్

  • స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్
  • 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 16జిబి ర్యామ్
  • 1టిబి స్టోరేజీ
  • 64ఎంపి మెయిన్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Redmi Note 12 Turbo లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వినియోగించారు. 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. ఈ డివైజ్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అడాప్టివ్ హెచ్డీఆర్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 1000 నిట్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ ఉన్నాయి.

Redmi Note 12 Turbo లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ హ్యాండ్సెట్ 161.11 ఎంఎం పొడవు, 74.95 ఎంఎం వెడల్పు, 7.99 ఎంఎం మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, Redmi Note 12 Turbo లో డాల్బి అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ మోటర్, ఐఆర్ బ్లాస్టర్, హై-రెస్ ఆడియో ఉన్నాయి. Redmi Note 12 Turbo లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Redmi Note 12 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 6 న భారత్‌లో లాంచ్ కానున్న POCO F5 5G? https://www.91mobiles.com/telugu/poco-f5-5g-india-expected-launch-date-april-6-could-be-rebrand-of-redmi-note-12-turbo/ Sat, 18 Mar 2023 15:47:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=5566 పోకో సంస్థ నుంచి త్వరలో రాబోవు POCO F5 5G మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది. 91మొబైల్స్ కి POCO F5 5G లాంచ్ తేదీకి సంబంధించిన సమాచారం తెలిసింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. POCO F5 5G ఇండియన్ వేరియంట్ 23013PC75I అనే మోడల్ నంబర్ ని కలిగి ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫోన్ స్నాప్ […]

The post ఏప్రిల్ 6 న భారత్‌లో లాంచ్ కానున్న POCO F5 5G? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 ఏప్రిల్ 6 న భారత్ లో లాంచ్ కానున్న POCO F5 5G స్మార్ట్ ఫోన్
  • గతేడాది లాంచైన POCO F4 5G కి సక్సెసర్ గా వస్తోన్న POCO F5 5G
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్, 12జిబి ర్యామ్ తో వస్తోన్న POCO F5 5G

పోకో సంస్థ నుంచి త్వరలో రాబోవు POCO F5 5G మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది. 91మొబైల్స్ కి POCO F5 5G లాంచ్ తేదీకి సంబంధించిన సమాచారం తెలిసింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. POCO F5 5G ఇండియన్ వేరియంట్ 23013PC75I అనే మోడల్ నంబర్ ని కలిగి ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7XX సిరీస్ ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు అంచనా.

భారత్ లో POCO F5 5G ఎప్పుడు లాంచ్ కానుంది?

ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం, POCO F5 5G ఏప్రిల్ 6 న లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంకా లాంచ్ తేదీని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. పోకో సంస్థ POCO F5 5G డివైజ్ ని ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు POCO F5 5G మిడ్ రేంజ్ ఫోన్ యొక్క ధరకు సంబంధించిన సమాచారం ఏమీ తెలియలేదు. అయితే, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం, పోకో సంస్థ ఫోన్ ధరను కాంపెటీటివ్ గానే పెట్టే అవకాశం ఉంది. POCO F4 5G డివైజ్ భారత్ లో రూ.27,999 ధరతో లాంచ్ అయ్యింది.

POCO F5 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

POCO F5 5G స్మార్ట్ ఫోన్ త్వరలో చైనాలో లాంచ్ కాబోయే Redmi Note 12 Turbo కి రీబ్రాండెడ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. POCO F5 5G డివైజ్ 6.67-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉండే అవకాశం ఉంది.

Redmi Note 12 Turbo డివైజ్ సరికొత్త స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు ఇటీవలె ఖరారైంది. అంటే, POCO F5 5G కూడా ఇదే చిప్సెట్ తో వచ్చే చాన్స్ ఉంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని POCO F5 5G లో అందించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేయనుందని అంచనా.

POCO F5 5G డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని అంచనా. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి సెకండరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయని సమాచారం. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉండే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం POCO F5 5G లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే చాన్స్ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 6 న భారత్‌లో లాంచ్ కానున్న POCO F5 5G? first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 7 Gen 2 చిప్‌తో వస్తోన్న Redmi Note 12 Turbo https://www.91mobiles.com/telugu/redmi-note-12-turbo-key-specs-leaked-before-launch/ Thu, 12 Jan 2023 08:20:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=4448 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Redmi Note 12 Turbo స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 12 సిరీస్ లో వస్తోన్న ఆరో ఫోన్ Redmi Note 12 Turbo క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తోన్న Redmi Note 12 Turbo రెడ్మీ సంస్థ రీసెంట్ గా చైనా, భారత్ లో Redmi Note 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఈ లైనప్ లో Redmi Note […]

The post Snapdragon 7 Gen 2 చిప్‌తో వస్తోన్న Redmi Note 12 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 12 Turbo స్మార్ట్ ఫోన్
  • రెడ్మీ నోట్ 12 సిరీస్ లో వస్తోన్న ఆరో ఫోన్ Redmi Note 12 Turbo
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తోన్న Redmi Note 12 Turbo

రెడ్మీ సంస్థ రీసెంట్ గా చైనా, భారత్ లో Redmi Note 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఈ లైనప్ లో Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 Speed Edition మరియు Redmi Note 12 Extreme Edition ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ లైనప్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడ్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

రెడ్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ 12 సిరీస్ లో ఆరో ఫోన్ రాబోతోంది. ఆ ఫోన్ పేరు Redmi Note 12 Turbo. తాజాగా Redmi Note 12 Turbo యొక్క స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోన్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది.

Redmi Note 12 Turbo లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో ఏయే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 Turbo స్పెసిఫికేషన్స్

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, చైనీస్ సోషల్ మీడియా వీబో పై Redmi Note 12 Turbo యొక్క స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం, ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఇంకా 6.67-ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది. ర్యామ్ మరియు స్టోరేజీ టెక్నాలజీ వివరాలు ఇంకా బయటకు రాలేదు.

Redmi Note 12 Turbo స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

గతంలో ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek షేర్ చేసిన లీక్ తో తాజాగా బయటకు వచ్చిన లీక్ కి పోలికలున్నాయి. దీంతో స్పెసిఫికేషన్స్ లో మార్పేమీ కనిపించడం లేదు. అయితే Redmi Note 12 Turbo డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. లేదంటే, మరొక పేరుతో భారత్ కి వస్తుందేమో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 7 Gen 2 చిప్‌తో వస్తోన్న Redmi Note 12 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>