Redmi Note 12R Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 01 May 2023 05:15:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌తో లాంచైన Redmi Note 12R Pro https://www.91mobiles.com/telugu/redmi-note-12r-pro-launched-china-price-specs-availability/ Mon, 01 May 2023 05:15:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=6096 షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ చైనాలో Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ లో ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ53 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ […]

The post ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌తో లాంచైన Redmi Note 12R Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచ్ అయిన Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చిన డివైజ్
  • 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయనున్న ఫోన్

షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ చైనాలో Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ లో ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ53 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Redmi Note 12R Pro ధర, లభ్యత

Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్ ధర చైనాలో CNY 1,999 (సుమారు రూ.23,649) గా ఉంది. ఈ డివైజ్ బ్లాక్, వైట్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. చైనాలో త్వరలోనే ఈ ఫోన్ సేల్ మొదలుకానుంది. ఇప్పటికైతే, రెడ్మీ బ్రాండ్ Redmi Note 12R Pro ఫోన్ గ్లోబల్ లాంచ్ గురించి సమాచారం ఇవ్వలేదు.

Redmi Note 12R Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే

Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సన్నని బెజెల్స్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్, స్టోరేజీ

Redmi Note 12R Pro డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్

Redmi Note 12R Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

Redmi Note 12R Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

Redmi Note 12R Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ హ్యాండ్సెట్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇది పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంటుంది.

కనెక్టివిటీ, డైమెన్షన్స్

Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్ లో 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, డ్యూయల్-సిమ్ సపోర్ట్, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఐపీ53 వాటర్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. ఈ డివైజ్ 165.88 మిల్లీ మీటర్ల పొడవు, 76.21 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.98 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌తో లాంచైన Redmi Note 12R Pro first appeared on 91Mobiles Telugu.

]]>