Redmi Note 12R - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Jul 2023 09:11:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/poco-new-phone-launch-teaser-could-be-m6-pro-5g/ Thu, 20 Jul 2023 09:11:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7259 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారతీయ మార్కెట్ లో POCO C50, POCO C51, POCO C55, POCO X5, POCO X5 Pro, POCO F5 అనే ఫోన్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. పోకో ఇండియా హెడ్, హిమాన్శు టాండన్ తాజాగా 5-నంబర్డ్ సిరీస్ ఫోన్ల లాంచ్ ముగిసిందని తెలిపారు. అలాగే ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా 6-నంబర్డ్ ఫోన్ గురించి హింట్ ఇచ్చారు. Redmi Note 12R కి రీబ్రాండ్ […]

The post త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేసిన పోకో సంస్థ
  • ఈ హ్యాండ్సెట్ POCO M6 Pro 5G అని అంచనా
  • Redmi Note 12R కి రీబ్రాండ్ గా వస్తోన్న POCO M6 Pro 5G?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారతీయ మార్కెట్ లో POCO C50, POCO C51, POCO C55, POCO X5, POCO X5 Pro, POCO F5 అనే ఫోన్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. పోకో ఇండియా హెడ్, హిమాన్శు టాండన్ తాజాగా 5-నంబర్డ్ సిరీస్ ఫోన్ల లాంచ్ ముగిసిందని తెలిపారు. అలాగే ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా 6-నంబర్డ్ ఫోన్ గురించి హింట్ ఇచ్చారు.

Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Pro 5G భారత్ లోకి రానుందని రీసెంట్ గా టిప్‌స్టర్ Kacper Skrzypek వెల్లడించారు. POCO M6 Pro 5G హ్యాండ్సెట్ ఐఎంఈఐ డేటాబేస్ పై 23076PC4B1 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. మరోవైపు టిప్‌స్టర్ హిమాన్శు టాండన్ ఫోన్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. డివైజ్ Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే కంపెనీ నుంచి అధికార ప్రకటన వస్తే గాని ఏమీ తెలియదు. కానీ, రానున్న రోజుల్లో రివీల్ అయ్యే స్పెసిఫికేషన్స్ తో ఈ విషయం పై క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు. సరే ఇప్పుడు ఓసారి Redmi Note 12R స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

Redmi Note 12R స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 12R లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 12R లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 12R లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది.
  • ఓఎస్: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 12R డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Redmi Note 12R డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 12R లో 5జీ, డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Redmi Note 12R డివైజ్ మిడ్నైట్ బ్లాక్, టైమ్ బ్లూ, స్కై ఇల్యూషన్ రంగుల్లో లభిస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 4 Gen 2 చిప్‌తో లాంచైన Redmi Note 12R https://www.91mobiles.com/telugu/redmi-note-12r-launched-china-price-specs-availability/ Thu, 29 Jun 2023 06:37:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=6980 షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ Redmi Note 12R ని హోమ్ మార్కెట్ చైనాలో లాంచ్ చేసింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ తో వచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్. క్వాల్కమ్ సంస్థ ఇటీవలె స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ ని లాంచ్ చేసింది. ఇకపోతే Redmi Note 12R డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, […]

The post Snapdragon 4 Gen 2 చిప్‌తో లాంచైన Redmi Note 12R first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Redmi Note 12R
  • 4 మెమొరీ వేరియంట్స్ లో లభించనున్న డివైజ్
  • Redmi Note 12R ప్రారంభ ధర CNY 999 (సుమారు రూ.11,300)

షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ Redmi Note 12R ని హోమ్ మార్కెట్ చైనాలో లాంచ్ చేసింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ తో వచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్. క్వాల్కమ్ సంస్థ ఇటీవలె స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ ని లాంచ్ చేసింది. ఇకపోతే Redmi Note 12R డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సరే, ఓసారి Redmi Note 12R స్మార్ట్ ఫోన్ విశేషాలేంటో తెలుసుకుందాం.

Redmi Note 12R స్పెసిఫికేషన్స్

  • 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి రియర్ కెమెరా
  • 18వాట్ చార్జింగ్
  • 5000mAh బ్యాటరీ

డిస్ప్లే: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ లో 6.79-ఇంచ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.

మెమొరీ: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇందులో 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ మోడల్స్ ఉన్నాయి. ఈ మూడు ఫోన్లు కూడా 128జిబి మరియు 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటాయి.

కెమెరా: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా అందించారు.

బ్యాటరీ: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 12R ధర

Redmi Note 12R స్మార్ట్ ఫోన్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ అయిన 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 999 (సుమారు రూ.11,300) గా ఉంది. 6జిబి+128జిబి వేరియంట్ ధర CNY 1099 (సుమారు రూ.12,400), 8జిబి + 256జిబి వేరియంట్ ధర CNY 1799 (సుమారు రూ.20,300) గా ఉంది.

The post Snapdragon 4 Gen 2 చిప్‌తో లాంచైన Redmi Note 12R first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 4 Gen 2 చిప్‌తో వస్తోన్న Redmi Note 12R; జూన్ 30న లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-note-12r-pro-to-feature-snapdragon-4-gen-2-chipset/ Wed, 21 Jun 2023 08:39:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=6873 Xiaomi సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ కంపెనీ కొన్ని నెలల క్రితం చైనాలో Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీని ధర సుమారు రూ. 20,500 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, కంపెనీ ఈ మొబైల్ యొక్క బేస్ మోడల్ Redmi Note 12R ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి, ఇది జూన్ 30 న విడుదల చేయబడుతుంది. ఈ Redmi ఫోన్ Snapdragon 4 […]

The post Snapdragon 4 Gen 2 చిప్‌తో వస్తోన్న Redmi Note 12R; జూన్ 30న లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Redmi Note 12R
  • భారత మార్కెట్ లాంచ్ పై ఇంకా రాని క్లారిటీ
  • 50ఎంపి+2ఎంపి డ్యూయల్ కెమెరాతో వస్తోన్న డివైజ్

Xiaomi సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ కంపెనీ కొన్ని నెలల క్రితం చైనాలో Redmi Note 12R Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీని ధర సుమారు రూ. 20,500 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, కంపెనీ ఈ మొబైల్ యొక్క బేస్ మోడల్ Redmi Note 12R ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి, ఇది జూన్ 30 న విడుదల చేయబడుతుంది. ఈ Redmi ఫోన్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు.

ప్రపంచపు తొలి Snapdragon 4 Gen 2 ఫోన్

Redmi Note 12Rకి సంబంధించిన సమాచారం చైనా టెలికాం వెబ్‌సైట్ ద్వారా వెల్లడైంది, ఇక్కడ ఫోన్ మోడల్ నంబర్ 23076RA4BCతో జాబితా చేయబడింది. ఇక్కడ ఫోన్ ‘SM4450’ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని చెప్పబడింది, ఇది Qualcomm Snapdragon 4 Gen 2 కావచ్చు. ఈ ప్రాసెసర్ ఇప్పటివరకు ఏ ఫోన్‌లోనూ ఇవ్వలేదని మరియు Redmi Note 12R మొదటి ఫోన్ కావచ్చని మీకు తెలియజేద్దాం. ఈ చిప్‌సెట్‌లో ప్రారంభించబడుతుంది.

Redmi Note 12R లాంచ్ వివరాలు

టెక్ రిపోర్ట్స్ ప్రకారం, షావోమి సబ్-బ్రాండ్ ఓ కొత్త ఫోన్ ని ఈ నెలలోనే మార్కెట్ లో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. జూన్ 30 న Redmi Note 12R డివైజ్ అఫీషియల్ గా లాంచ్ అవుతుందని ఓ నివేదిక ద్వారా తెలిసింది. తొలుత ఈ డివైజ్ చైనాలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు.

Redmi Note 12R స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Redmi Note 12R డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ ఉంటుందని సమాచారం.
  • మెమొరీ: రిపోర్ట్ ప్రకారం, Redmi Note 12R డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • కెమెరా: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

The post Snapdragon 4 Gen 2 చిప్‌తో వస్తోన్న Redmi Note 12R; జూన్ 30న లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>