Redmi Note 14 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Sep 2024 13:40:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi: చైనాలో లాంచైన Redmi Note 14, Note 14 Pro, Note 14 Pro+ https://www.91mobiles.com/telugu/redmi-note-14-note-14-pro-note-14-pro-plus-launched-china/ https://www.91mobiles.com/telugu/redmi-note-14-note-14-pro-note-14-pro-plus-launched-china/#respond Thu, 26 Sep 2024 13:40:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=13768 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi తాజాగా తన హోమ్ మార్కెట్ చైనాలో Redmi Note 14 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Redmi Note 14, Redmi Note 14 Pro మరియు Redmi Note 14 Pro+ అనే మోడల్స్ విడుదలయ్యాయి. రెడ్మీ నోట్ 13 సిరీస్ కు సక్సెసర్ గా నోట్ 14 సిరీస్ వచ్చింది. ఈసారి ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రెడ్మీ […]

The post Redmi: చైనాలో లాంచైన Redmi Note 14, Note 14 Pro, Note 14 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో రెడ్మీ నోట్ 14 సిరీస్ విడుదల
  • 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • హైపర్ఓఎస్, టెలీఫోటో లెన్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi తాజాగా తన హోమ్ మార్కెట్ చైనాలో Redmi Note 14 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Redmi Note 14, Redmi Note 14 Pro మరియు Redmi Note 14 Pro+ అనే మోడల్స్ విడుదలయ్యాయి. రెడ్మీ నోట్ 13 సిరీస్ కు సక్సెసర్ గా నోట్ 14 సిరీస్ వచ్చింది. ఈసారి ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రెడ్మీ నోట్ 14 సిరీస్ రావడం విశేషం. సరే, ఓసారి ఈ మూడు ఫోన్ల యొక్క ధరలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi Note 14 సిరీస్ ధరలు

  • Redmi Note 14 Pro+ 12జిబి+256జిబి మోడల్ ధరను RMB 1,999 (సుమారు రూ.23,900) గా పెట్టారు. 12జిబి+512జిబి వేరియంట్ ధర RMB 2199 (సుమారు రూ.26,300) గా ఉంది. 16జిబి+512జిబి మోడల్ ధర RMB 2399 (సుమారు రూ.28,600) గా ఉంది.
  • Redmi Note 14 Pro 8జిబి+128జిబి మోడల్ ధర RMB 1499 (సుమారు రూ.17,900) గా ఉంది. 8జిబి+256జిబి మోడల్ ధర RMB 1,599 (సుమారు రూ.19,100) గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ ధర RMB 1,699 (సుమారు రూ.20,300) గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ ధరను RMB 1,899 (సుమారు రూ.22,700) గా నిర్ణయించారు.
  • Redmi Note 14 5జీ 6జిబి+128జిబి వేరియంట్ ధర RMB 1199 (సుమారు రూ.14,300) గా ఉంది. 8జిబి+128జిబి వేరియంట్ ధర RMB 1,299 (సుమారు రూ.15,500) గా ఉంది. 8జిబి+256జిబి మోడల్ ధర RMB 1,499 (సుమారు రూ.17,900) గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను RMB 1,699 (సుమారు రూ.20,300) గా నిర్ణయించారు.

మూడు మోడల్స్ పై ఫస్ట్ సేల్ లో భాగంగా RMB 100 డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Redmi Note 14 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 14 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, ఎస్జీఎస్ ఐ ప్రొటెక్షన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 14 స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్సెట్ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 14 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi Note 14 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Redmi Note 14 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 14 లో పవర్ బ్యాకప్ కోసం 5,110 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 14 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ64 రేటింగ్, స్టీరియ్ స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Redmi Note 14 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 14 Pro లో 6.67-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 2560 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ రెస్పాన్స్ రేట్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Redmi Note 14 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్సెట్ ఉంది.

సాఫ్ట్‌వేర్: Redmi Note 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 14 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 2ఎంపి మ్యాక్రో కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 14 Pro డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ69 + ఐపీ68 + ఐపీ66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Redmi Note 14 Pro+ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 14 Pro+ లో 6.67-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 2560 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ రెస్పాన్స్ రేట్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 14 Pro+ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో షావోమీ టీ1 సిగ్నల్ ఎన్హాస్మెంట్ చిప్సెట్ కూడా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 14 Pro+ డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi Note 14 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Redmi Note 14 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 14 Pro+ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 14 Pro+ లో ఐపీ69 + ఐపీ68 + ఐపీ66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 5జీ, 4జీ, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

రెడ్మీ నోట్ 14 సిరీస్ త్వరలో భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. అయితే భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. దీనికి సంబంధించి షావోమి (రెడ్మీ) నుంచి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post Redmi: చైనాలో లాంచైన Redmi Note 14, Note 14 Pro, Note 14 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-note-14-note-14-pro-note-14-pro-plus-launched-china/feed/ 0
Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-note-14-5g-3c-certification-details/ https://www.91mobiles.com/telugu/redmi-note-14-5g-3c-certification-details/#respond Wed, 07 Aug 2024 17:25:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=12873 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 14 5G సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా బేస్ మోడల్ Redmi Note 14 5G చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఈ సిరీస్ లాంచ్ కి సంబంధించిన ప్రకటన కంపెనీ నుంచి రావాల్సి ఉంది. సరే, ఓసారి Redmi Note 14 5G యొక్క 3సీ సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. […]

The post Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi Note 14 5G లాంచ్
  • మోడల్ నంబర్ 24090RA29C
  • 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 14 5G సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా బేస్ మోడల్ Redmi Note 14 5G చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఈ సిరీస్ లాంచ్ కి సంబంధించిన ప్రకటన కంపెనీ నుంచి రావాల్సి ఉంది. సరే, ఓసారి Redmi Note 14 5G యొక్క 3సీ సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు

Redmi Note 14 5G డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పై 24090RA29C మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గతంలో ఇదే మోడల్ నంబర్ తో ఐఎంఈఐ డేటాబేస్ పై Redmi Note 14 5G లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది.

గత మోడల్ Redmi Note 13 5G 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. త్వరలో రాబోవు Redmi Note 14 5G 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుండటం మంచి అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

Redmi Note 14 5G డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పై 5జీ కనెక్టివిటీ, హైపర్ఓఎస్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

3సీ సర్టిఫికేషన్

Redmi Note 14 5G స్మార్ట్‌ఫోన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, 1.5కే రెజుల్యూషన్ వంటి ఫీచర్లతో వస్తోందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ లైనప్ లో Redmi Note 14 Pro 5G మరియు Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ తో రానుంది. ప్రో ప్లస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్సెట్ తో వస్తోందని సమాచారం.

The post Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-note-14-5g-3c-certification-details/feed/ 0