Redmi Pad Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 21 May 2024 14:08:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi Pad Pro: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ ట్యాబ్లెట్ https://www.91mobiles.com/telugu/redmi-pad-pro-globally-launched-with-snapdragon-7s-gen-2-chip/ Tue, 21 May 2024 14:08:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=11646 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి కొత్త ట్యాబ్లెట్ కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. Redmi Pad Pro పేరుతో ఈ ట్యాబ్లెట్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ గా ఈ ట్యాబ్లెట్ POCO Pad గా లాంచ్ అవుతుందని అందరూ భావిస్తోన్న సమయంలో యూరోపియన్ మార్కెట్ లోకి Redmi Pad Pro ని లాంచ్ చేసి షావోమి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. […]

The post Redmi Pad Pro: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ ట్యాబ్లెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Redmi Pad Pro లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్
  • 12.1 ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి కొత్త ట్యాబ్లెట్ కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. Redmi Pad Pro పేరుతో ఈ ట్యాబ్లెట్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ గా ఈ ట్యాబ్లెట్ POCO Pad గా లాంచ్ అవుతుందని అందరూ భావిస్తోన్న సమయంలో యూరోపియన్ మార్కెట్ లోకి Redmi Pad Pro ని లాంచ్ చేసి షావోమి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఓసారి రెడ్మీ ప్యాడ్ ప్రో ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi Pad Pro ట్యాబ్లెట్ షావోమి యొక్క యూరోపియన్ యూనియన్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ అధికార వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

Redmi Pad Pro ధర

Redmi Pad Pro 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర యూరోజోన్ లో 299.90 యూరోలుగా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 349.90 యూరోలుగా ఉంది.

Redmi Pad Pro 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర యూకే మార్కెట్ లో 269.00 పౌండ్లుగా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 349.90 పౌండ్లుగా ఉంది.

యూకే మార్కెట్ లో Redmi Pad Pro పై ఎర్లీబర్డ్ సేల్ లో భాగంగా 20 పౌండ్ల డిస్కౌంట్ లభిస్తుంది. యూరోజోన్ కస్టమర్లకు కూడా మే 21 నుంచి జూన్ 4 వరకు వివిధ రకాల ప్రయోజనాలు లభించనున్నాయి.

Redmi Pad Pro డివైజ్ గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్ మరియు ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Pad Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Pad Pro లో 12.1-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 2560*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 249 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 83.6% స్క్రీన్-టు-బాడీ రేషియో, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, డీసీ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Pad Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi Pad Pro డివైజ్ 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.

బ్యాటరీ, చార్జింగ్: Redmi Pad Pro లో పవర్ బ్యాకప్ కోసం 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Pad Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi Pad Pro లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi Pad Pro లో వై-ఫై 6, బ్లూటూత్ 5.2, 3.5ఎంఎం ఆడియో జాక్, క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. ట్యాబ్లెట్ మెటల్ యూనిబాడీతో వచ్చింది. దీని బరువు 571 గ్రాములు. సెల్యులర్ కనెక్టివిటీ వివరాలు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

The post Redmi Pad Pro: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ ట్యాబ్లెట్ first appeared on 91Mobiles Telugu.

]]>