Redmi Pad SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 13 Aug 2023 17:21:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్‌కి ముందు లీకైన Redmi Pad SE రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర! https://www.91mobiles.com/telugu/redmi-pad-se-price-specs-renders-leaked-before-launch/ Sun, 13 Aug 2023 17:21:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=7579 షావోమి సంస్థ భారతీయ మార్కెట్ తో పాటు, యూరప్ లో గతేడాది అక్టోబర్ నెలలో Redmi Pad ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. భారత్ లో రూ.14,999 ధరతో Redmi Pad లాంచ్ అయ్యింది. Redmi Pad లో 10.61-ఇంచ్ డిస్ప్లే, ఆక్టా-కోర్ హీలియో జీ99 చిప్, 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు రెడ్మీ బ్రాండ్ తన రెండో ట్యాబ్లెట్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. […]

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi Pad SE రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Pad SE
  • 8ఎంపి రియర్, 5ఎంపి ఫ్రంట్ కెమెరాలతో వస్తోన్న డివైజ్
  • 8000 ఎంఏహెచ్ బ్యాటరీ Redmi Pad SE లో ఉండే అవకాశం

షావోమి సంస్థ భారతీయ మార్కెట్ తో పాటు, యూరప్ లో గతేడాది అక్టోబర్ నెలలో Redmi Pad ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. భారత్ లో రూ.14,999 ధరతో Redmi Pad లాంచ్ అయ్యింది. Redmi Pad లో 10.61-ఇంచ్ డిస్ప్లే, ఆక్టా-కోర్ హీలియో జీ99 చిప్, 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు రెడ్మీ బ్రాండ్ తన రెండో ట్యాబ్లెట్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Redmi Pad SE అనే పేరుతో ఈ ట్యాబ్లెట్ మార్కెట్ లోకి రానుంది. Appuals ద్వారా రెండర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Redmi Pad SE స్పెసిఫికేషన్స్

లీకైన రెండర్స్ ద్వారా Redmi Pad SE గ్రే, పర్పుల్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ మందపాటి బెజెల్స్ ని కలిగి ఉంది. ఇంకా వాల్యూమ్ బటన్స్ డివైజ్ కి కుడివైపున ఉన్నాయి. అలాగే ట్యాబ్లెట్ కి బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

  • స్క్రీన్: Redmi Pad SE లో 11-ఇంచ్ డిస్ప్లే, 1920*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 207 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 70 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కవరేజీ, 84.4% స్క్రీన్-టు-బాడీ రేషియో ఉంటాయి.
  • చిప్సెట్: Redmi Pad SE ట్యాబ్లెట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వస్తోంది. ఇది 4జీ సపోర్ట్ గల చిప్.
  • కెమెరా: Redmi Pad SE ట్యాబ్లెట్ లో 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • ఆడియో: Redmi Pad SE ట్యాబ్లెట్ లో క్వాడ్ స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉంటాయి.
  • కనెక్టివిటీ: Redmi Pad SE ట్యాబ్లెట్ లో యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi Pad SE లో పవర్ బ్యాకప్ కోసం 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi Pad SE ధర

Redmi Pad SE ట్యాబ్లెట్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 190 యూరోలు (సుమారు రూ.17,294) గా ఉంటుంది. ఇది యురోపియన్ మార్కెట్ ధర. భారత్ లో లాంచ్ అనంతరం ఈ ట్యాబ్లెట్ ధర రివీల్ కానుంది. ఇక భారత మార్కెట్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రెడ్మీ కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే 4జిబి ర్యామ్ వేరియంట్ కాకుండా, మరేదైనా వేరియంట్ ని రెడ్మీ సంస్థ తీసుకొస్తుందో లేదో ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi Pad SE రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>