Rs 149 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 16 Feb 2023 12:02:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 చవకైన DATA+OTT ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-rs-149-plan-1-gb-data-xtream-premium-subscription/ Thu, 16 Feb 2023 11:57:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4968 దేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ కూడా ఒకటి. ప్రధానంగా జియోతో ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఎదురవుతుంటుంది. ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం జియోకి షాకిచ్చేలా ఒక ప్లాన్ ని తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. భారతి ఎయిర్టెల్ సంస్థ సీక్రెట్ గా ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. రూ.149 విలువజేసే ప్లాన్ ని […]

The post చవకైన DATA+OTT ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మెల్లగా రూ.149 ప్రీపెయిడ్ డేటా+ఓటీటీ ప్లాన్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్ సంస్థ
  • రూ.149 ప్లాన్ తో కస్టమర్లకు లభించనున్న 1జిబి డేటా మరియు ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ యాప్ ఒక నెల సబ్‌స్క్రిప్షన్
  • ఈ డేటా ప్యాక్ తో ఉచిత కాలింగ్, వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభించవు

దేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ కూడా ఒకటి. ప్రధానంగా జియోతో ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఎదురవుతుంటుంది. ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం జియోకి షాకిచ్చేలా ఒక ప్లాన్ ని తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారతి ఎయిర్టెల్ సంస్థ సీక్రెట్ గా ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. రూ.149 విలువజేసే ప్లాన్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ఇంటర్నెట్ డేటా, ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయి. చవకైన ఎయిర్టెల్ డేటా ప్లాన్ కోసం మీరు చూస్తుంటే, ఈ ప్లాన్ మీకు ఉత్తమమైనది. సరే, ఓసారి ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు తెలుసుకుందాం పదండి.

Airtel రూ.149 ప్రీపెయిడ్ డేటా+ఓటీటీ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 1జిబి డేటా లభిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్రీమియమ్ కి ఒక నెల సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఎక్స్‌ట్రిమ్ యాప్ ద్వారా 15 కి పైగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ లభించనుంది. 15 ఓటీటీ సేవలు కేవలం ఎక్స్‌ట్రిమ్ యాప్ ద్వారా పొందే వీలుంది. మీ యొక్క ట్యాబ్లెట్, స్మార్ట్ ఫోన్ లేదా డెస్క్‌టాప్ లలో Airtel Xstream Premium యాప్ అందించే కంటెంట్ ని చూడవచ్చు. ఈ యాప్ వ్యాలిడిటీ 30 రోజులు.

అయితే ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.149 ప్లాన్ ద్వారా 1జిబి డేటా ఒకేసారి లభిస్తుంది. మరి డేటా అధికంగా కావాలంటే ఈ ప్లాన్ తో పాటు అదనపు డేటా కోసం రూ.148 ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అధిక డేటా వస్తుంది. లేదంటే మరేదైనా డేటా వోచర్ ని రీచార్జ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన డేటాను బట్టి రీచార్జ్ ని ఎంచుకోండి. ఇప్పుడు రూ.148 డేటా ప్రయోజనాలు తెలుసుకుందాం.

Airtel రూ.148 ప్లాన్ తో మరింత డేటా

ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.148 ప్లాన్ తో అధిక డేటా ప్రయోజనం పొందవచ్చు. ఓటీటీ బెనిఫిట్స్ వద్దనుకుంటే గనుక, రూ.148 ప్లాన్ ని రీచార్జ్ చేసుకుంటే 15జిబి డేటా వస్తుంది. యూజర్ ప్రస్తుతం వాడుతోన్న ప్లాన్ వ్యాలిడిటీ ఈ డేటా ప్లాన్ కి వర్తిస్తుంది.

ఈ ఆర్టికల్ లో మీకు ఎయిర్టెల్ తీసుకొచ్చిన కొత్త డేటా కమ్ ఎక్స్‌ట్రిమ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ రూ.149 ప్లాన్ మరియు అధిక డేటా కోసం రూ.148 ప్లాన్ల యొక్క ప్రయోజనాలను అందించడం జరిగింది. మరొక్కసారి ఈ ప్లాన్స్ అందించే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుని, మీకు సరిపోయేవైతే గనుక, రీచార్జ్ చేసుకోండి.

Note: రూ.149 ప్యాక్ యాక్టివ్ బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ యూజర్లకు వర్తిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post చవకైన DATA+OTT ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.200 లోపు ధరలో Jio అందిస్తోన్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్! https://www.91mobiles.com/telugu/jio-rs-149-prepaid-plan-rs-179-prepaid-plan-benefits/ Fri, 10 Feb 2023 10:01:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=4868 భారతదేశంలో ఉన్న ఉత్తమ టెలీకామ్ సంస్థల్లో జియో ఒకటి. ప్రస్తుతం జియో దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉంది. ఇటీవలె ట్రాయ్ విడుదల చేసిన సబ్‌స్క్రైబర్ ట్యాలీ లో జియో లక్షల్లో కొత్త యూజర్లను రాబట్టినట్లు తెలిసింది. దీన్ని బట్టి జియో పట్ల జనాలు ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోంది. ఈ ఆర్టికల్ లో మనం జియో అందిస్తోన్న వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ రెండింటిని గురించి తెలుసుకుందాం. రూ.200 లోపు ధరలో లభిస్తోన్న డెయిలీ డేటా ప్లాన్స్ […]

The post రూ.200 లోపు ధరలో Jio అందిస్తోన్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోన్న జియో కంపెనీ
  • రూ.200 లోపు ధరలో లభిస్తోన్న ప్లాన్స్: రూ.149 ప్లాన్ మరియు రూ.179 ప్లాన్
  • డెయిలీ 1జిబి డేటా, 20 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న రూ.149 ప్లాన్, 1జిబి డెయిలీ డేటా, 24 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న రూ.179 ప్లాన్

భారతదేశంలో ఉన్న ఉత్తమ టెలీకామ్ సంస్థల్లో జియో ఒకటి. ప్రస్తుతం జియో దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉంది. ఇటీవలె ట్రాయ్ విడుదల చేసిన సబ్‌స్క్రైబర్ ట్యాలీ లో జియో లక్షల్లో కొత్త యూజర్లను రాబట్టినట్లు తెలిసింది. దీన్ని బట్టి జియో పట్ల జనాలు ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోంది.

ఈ ఆర్టికల్ లో మనం జియో అందిస్తోన్న వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ రెండింటిని గురించి తెలుసుకుందాం. రూ.200 లోపు ధరలో లభిస్తోన్న డెయిలీ డేటా ప్లాన్స్ రూ.149 మరియు రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

రూ.149 మరియు రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా డెయిలీ డేటాతో పాటు, వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, డెయిలీ ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదండోయ్, ఈ ప్లాన్స్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 20 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 1జిబి డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత కాలింగ్

జియో అందిస్తోన్న రూ.149 ప్లాన్ 20 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. మొత్తంగా 20 జిబి డేటా లభిస్తుంది. అంటే డెయిలీ 1 జిబి డేటా అన్నమాట. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే, ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో టీవీ
  • జియో సినిమా
  • జియో సెక్యూరిటీ
  • జియో క్లౌడ్

జియో తీసుకొచ్చిన రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అవేంటో చూద్దాం. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Jio రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 24 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 1జిబి డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత కాలింగ్

జియో అందిస్తోన్న రూ.179 ప్లాన్ ద్వారా 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే మొత్తం 24జిబి డేటా లభిస్తుంది. అంటే డెయిలీ 1జిబి డేటా లభిస్తుందన్న మాట. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో టీవీ
  • జియో సినిమా
  • జియో సెక్యూరిటీ
  • జియో క్లౌడ్

జియో తీసుకొచ్చిన రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలను యూజర్ పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి సర్వీసెస్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

జియో అందిస్తోన్న రూ.149 మరియు రూ.179 ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా, మరొక్కసారి రెండు ప్లాన్స్ బెనిఫిట్స్ ని చదివి మీకు సరిపడే ప్లాన్ ని ఎంచుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.200 లోపు ధరలో Jio అందిస్తోన్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>