Rs 329 Broadband Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 25 May 2023 16:39:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.329 కే 1000జిబి డేటా; కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన BSNL https://www.91mobiles.com/telugu/bsnl-new-broadband-plan-rs-329-details/ Thu, 25 May 2023 16:39:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=6488 మీరు గనుక కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంటే మీకొక శుభవార్త. ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL చవకైన రూ.329 ప్లాన్ ని తీసుకొచ్చింది. తక్కువ ధరలో కనెక్షన్ తీసుకోవాలని భావించే యూజర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. అయితే, కంపెనీ ప్రకారం, జులై 30 వరకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి ఈ ప్లాన్ ద్వారా లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం పదండి. BSNL 329 ప్లాన్ వివరాలు ప్లాన్ […]

The post రూ.329 కే 1000జిబి డేటా; కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన BSNL first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ప్లాన్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్
  • ఈ ప్లాన్ తో యూజర్ కి లభించనున్న డేటా 1000జిబి
  • బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ.329

మీరు గనుక కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంటే మీకొక శుభవార్త. ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL చవకైన రూ.329 ప్లాన్ ని తీసుకొచ్చింది. తక్కువ ధరలో కనెక్షన్ తీసుకోవాలని భావించే యూజర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. అయితే, కంపెనీ ప్రకారం, జులై 30 వరకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి ఈ ప్లాన్ ద్వారా లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం పదండి.

BSNL 329 ప్లాన్ వివరాలు

  • ప్లాన్ ద్వారా లభించనున్న 1000జిబి డేటా, స్పీడ్ 20ఎంబీపీఎస్
  • కస్టమర్లకు లభించనున్న 20ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ స్పీడ్
  • 1టిబి డేటా పరిధి దాటాక, కస్టమర్లు పొందే వేగం 4 ఎంబీపీఎస్
  • దీంతోపాటు అన్ని నెట్వర్క్స్ కి అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం

నోట్: ఏలురు, గుంటూరు, రాజమండ్రి మరియు విశాఖపట్నం నగరాల్లోని కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనున్న ఫైబర్ ఎంట్రీ ప్లాన్.

ప్లాన్ తో పాటు జీఎస్టీ అదనం

వినియోగదారులకు తెలిపేదేంటంటే, ఈ ప్లాన్ లో జీఎస్టీ జతచేయబడలేదు. అంటే 18 శాతం జీఎస్టీ కలుపుకుంటే, ప్లాన్ ధర రూ.388.22 కి చేరుతుంది. అంటే ఈ ప్లాన్ రూ.400 లోపు ధరలోనే లభిస్తోంది. ఈ ప్లాన్ తో పాటు కస్టమర్ కి 1000జిబి డేటా, ఉచిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే యూజర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఆప్షన్

దేశంలో ఇంకా చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ తరుణంలో, ఈ BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ వారికి ఎంతో ఉపయోగపడనుంది. స్పీడ్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ సింగిల్ యూజర్లకు ఎంతో ఉత్తమం.

నవంబర్-డిసెంబర్ సమయంలో 4జీ నుంచి 5జీ కి మారనున్న BSNL

కేంద్ర ఐటీ శాఖ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య BSNL 4జీ నుంచి 5జీకి మారుతుందని తెలిపారు. 4జీ-5జీ టెలీకామ్ స్టాక్ ని దేశీయంగానే అభివృద్ధి చేసినట్లు వైష్ణవ్ చెప్పారు. BSNL తో ఈ స్టాక్స్ పంపిణీ మొదలైందని, ఛండీఘర్, డెహ్రాడున్ ప్రాంతాల్లో 200 సైట్స్ ఏర్పాటవుతాయన్నారు. ఈ సైట్స్ రెండు వారాల్లో విపణిలోకి వస్తాయని ఆయన చెప్పారు.

The post రూ.329 కే 1000జిబి డేటా; కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన BSNL first appeared on 91Mobiles Telugu.

]]>