Rs 399 plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 03 May 2023 11:29:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-brought-rs-199-rs-399-broadband-standby-plans/ Wed, 03 May 2023 11:29:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=6148 ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్ ని తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ధరలు రూ.199 మరియు రూ.399 గా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం ఈ ప్లాన్స్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో ఈ ప్లాన్స్ వచ్చాయి. ఈ ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాల వివరాలు తెలుసుకుందాం పదండి. ఎయిర్టెల్ రూ.199 బ్రాడ్ బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.199 బ్రాడ్‌బ్యాండ్ […]

The post బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం కొత్త ప్లాన్లను తెచ్చిన ఎయిర్టెల్
  • బ్రాండ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో వచ్చిన కొత్త ప్లాన్స్
  • కొత్త ప్లాన్ల ధరలు రూ.199 మరియు రూ.399

ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్ ని తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ధరలు రూ.199 మరియు రూ.399 గా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం ఈ ప్లాన్స్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో ఈ ప్లాన్స్ వచ్చాయి. ఈ ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాల వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎయిర్టెల్ రూ.199 బ్రాడ్ బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.199 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటాతో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. అంతేకాదు, ఉచిత రూటర్ ని కూడా కంపెనీ అందిస్తోంది. మరి ఈ ప్లాన్ తీరుతెన్నులు, ఇతర చార్జీలు, ప్రయోజనాలు ఎలా ఉన్నాయో క్రింద వివరంగా ఇచ్చాం. ఓసారి చదివేయండి.

  • రూ.199 ప్లాన్ ద్వారా అపరిమిత డేటా లభిస్తుంది. ఇంకా 10ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.
  • కస్టమర్లు ఈ ఎంట్రీ లెవెల్ ప్లాన్ ని 5 నెలల కాలపరిమితితో తీసుకోవాల్సి ఉంటుంది. దానికి యూజర్లు జీఎస్టీ తో కలుపుకుని మొత్తం రూ.1174 చెల్లించాల్సి ఉంటుంది.
  • దీంతో పాటు కస్టమర్లు ఈ ప్లాన్ కోసం రూ.500 ఇన్‌స్టలేషన్ చార్జ్ మరియు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.
  • ఈ ప్లాన్ ని కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ ఉచితంగా రూటర్ ని అందించనుంది.

ఎయిర్టెల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటా తో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలేంటో క్రింద అందిస్తున్నాం. ఓ కన్నేయండి.

  • ఎయిర్టెల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ 10ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తుంది.
  • ఎక్స్‌ట్రిమ్ బాక్స్, ఉచిత వై-ఫై రూటర్ మరియు 350 కి పైగా టీవీ చానల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.
  • ఈ ప్లాన్ ని కూడా కస్టమర్లు కనీసం 5 నెలల కాలపరిమితితో తీసుకోవాల్సి ఉంటుంది.
  • వన్‌ టైమ్ ఇన్‌స్టలేషన్ చార్జ్ మరియు జీఎస్టీ కలుపుకుని ఈ ప్లాన్ ధర రూ.3,000 అవుతుంది.

రెండు ప్లాన్లలో కాలింగ్ ఉచితం

కంపెనీ అందించే డేటాతో పాటు, ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్లు బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంతేకాదు, ప్లాన్ లో అందుబాటులో ఉన్న ఇతర స్పీడ్స్ కి ఎప్పుడైనా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. అంటే మీ ప్లాన్ ని మీకు నచ్చినప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చన్నమాట. ఎయిర్టెల్ తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా? మరొకసారి ప్లాన్ల ప్రయోజనాలను చదివి తెలుసుకుని, మీకు సరిపోయే ప్లాన్ ఏదో దానిని ప్రయత్నించండి.

The post బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
BSNL 399 vs Airtel 399: రెండింట్లో ఏ రీచార్జ్ ప్లాన్ బెస్ట్ https://www.91mobiles.com/telugu/airtel-399-vs-bsnl-399-which-is-the-best-plan/ Tue, 29 Nov 2022 08:33:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3728 హైలైట్స్ STV 399 రీచార్జ్ ప్లాన్ తో 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న BSNL రూ.399 ప్లాన్ తో 28 రోజులు వ్యాలిడిటీ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్ రూ.399 ప్లాన్ తో అదనపు ప్రయోజనాలను అందిస్తోన్న రెండు సంస్థలు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ తో తన ప్రయివేటు సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ వద్ద ఎన్నో చవకైన, ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్స్ ఉన్నాయి. ఇవే బీఎస్ఎన్ఎల్ ప్రధాన […]

The post BSNL 399 vs Airtel 399: రెండింట్లో ఏ రీచార్జ్ ప్లాన్ బెస్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • STV 399 రీచార్జ్ ప్లాన్ తో 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న BSNL
  • రూ.399 ప్లాన్ తో 28 రోజులు వ్యాలిడిటీ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్
  • రూ.399 ప్లాన్ తో అదనపు ప్రయోజనాలను అందిస్తోన్న రెండు సంస్థలు

ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ తో తన ప్రయివేటు సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ వద్ద ఎన్నో చవకైన, ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్స్ ఉన్నాయి. ఇవే బీఎస్ఎన్ఎల్ ప్రధాన బలం. అయితే బీఎస్ఎన్ఎల్ ఇంకా 3జీ సేవలనే అందిస్తోంది. అతి త్వరలో 4జీ ఆ వెనువెంటనే 5జీ సేవలను లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టకుంది.

దేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఒకటిగా ఎయిర్టెల్ కొనసాగుతోంది. కవరేజీ అంటే ఎయిర్టెల్ అనే అనేంతగా జనాల్లో పేరు సంపాదించింది ఎయిర్టెల్. జియో రాకతో ఎయిర్టెల్ తన కస్టమర్లను కోల్పోయినప్పటికీ తర్వాత మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు ఎయిర్టెల్ సంస్థ విభిన్న తరహా ప్లాన్స్ తో తన యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎయిర్టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది.

ఇప్పుడు ఎయిర్టెల్ మరియు బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.399 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఏ సంస్థ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం.

Airtel 399 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

Airtel 399 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లు ప్రతిరోజు 2.5జిబి డేటా పొందుతారు. అలాగే ఏ నెట్వర్క్ కి అయినా లోకల్ లేదా ఎస్టీడీ కాల్స్ ని ఉచితంగా చేసుకోవచ్చు. రోమింగ్ చార్జీలు కూడా పడవు. ఇంకా ఈ ప్లాన్ 28 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. అంతే కాదండోయ్, ఇంకా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వ్యాలిడిటీ ముగిసే లోపు ఈ ఎస్ఎంఎస్ లను ఏ నెట్వర్క్ కి అయినా పంపుకోవచ్చు.

ఎస్ఎంఎస్ పరిమితి పూర్తయ్యాక, లోకల్ మెసేజ్ కి రూ.1, ఎస్టీడీ మెసేజ్ కి రూ.1.50 చార్జ్ చేయబడుతుంది. అలాగే డెయిలీ డేటా లిమిట్ ముగిసాక డేటా వేగం 64కేబీపీఎస్ కి పడిపోతుంది.

అదనపు ప్రయోజనాలు

Airtel 399 ప్లాన్ ద్వారా 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్ట్‌ట్యాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సేవలు ఉచితంగా లభిస్తాయి.

BSNL 399 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL 399 ప్లాన్ రీచార్జ్ చేసే కస్టమర్లకు 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ప్రతిరోజు 1జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. ఇంకా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. 1జిబి డేయిలీ డేటా పరిధి ముగిశాక, ఇంటర్నెట్ వేగం 40కేబీపీఎస్ కి పడిపోతుంది. అప్పుడు ఉచితంగా ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

BSNL 399 ప్లాన్ తో పలు అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ ప్లాన్ ద్వారా ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లభిస్తాయి. ఇంకా లోక్‌దన్ కంటెంట్ ని ఉచితంగా పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BSNL 399 vs Airtel 399: రెండింట్లో ఏ రీచార్జ్ ప్లాన్ బెస్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>