Rs 401 Postpaid Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 03 Mar 2023 11:40:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.401 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea https://www.91mobiles.com/telugu/vodafone-idea-rs-401-postpaid-plan-sun-nxt-subscription-for-1-year-other-benefits/ Fri, 03 Mar 2023 11:40:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=5209 Vodafone Idea సంస్థ తాజాగా రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి Sun NXT యాప్ కి ప్రీమియమ్ హెచ్డీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. Atrangii యాప్ తో Vodafone Idea జట్టుకట్టిన వెనువెంటనే తాజాగా రూ.401 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రకటన వచ్చింది. Vodafone Idea ప్లాన్స్ ఎప్పుడు కూడా మిగతా సంస్థలతో పోల్చితే తక్కువ ధర కలిగి […]

The post రూ.401 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తన యూజర్ల కోసం కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Vodafone Idea సంస్థ
  • 50జిబి డేటా, వివిధ ఓటీటీ యాప్స్ కి యాక్సెస్ అందించనున్న Vodafone Idea రూ.401 పోస్ట్ పెయిడ్ ప్లాన్
  • ఇప్పటికే Vodafone Idea అధికార వెబ్‌సైట్ పై కనిపిస్తోన్న Vodafone Idea రూ.401 పోస్ట్ పెయిడ్ ప్లాన్

Vodafone Idea సంస్థ తాజాగా రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి Sun NXT యాప్ కి ప్రీమియమ్ హెచ్డీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. Atrangii యాప్ తో Vodafone Idea జట్టుకట్టిన వెనువెంటనే తాజాగా రూ.401 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రకటన వచ్చింది.

Vodafone Idea ప్లాన్స్ ఎప్పుడు కూడా మిగతా సంస్థలతో పోల్చితే తక్కువ ధర కలిగి అధిక లాభాలను యూజర్ కి అందించేలా ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా Vodafone Idea సంస్థ రూ.401 విలువజేసే ఒక పోస్ట్ పెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ఇప్పటికే Vodafone Idea అధికార వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. రూ.401 Postpaid Plan ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vodafone Idea Rs.401 Postpaid Plan ప్రయోజనాలు

Vodafone Idea తీసుకొచ్చిన రూ.401 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి 50జిబి 4జీ డేటా లభిస్తుంది. అలాగే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా కస్టమర్ కి లభిస్తుంది. ఇంకా రూ.401 పోస్ట్ పెయిడ్ ప్లాన్ 200జిబి డేటా రోలోవర్ ఫెసిలిటీతో వస్తోంది. ఇంకా ఒక నెలకు 3000 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.

అలాగే SunNXT యాప్ కి ఒక ఏడాది పాటు ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా వివిధ ఓటీటీ యాప్స్ కి యాక్సెస్ లభిస్తుంది. వీటి విలువ రూ.799. కంపెనీ అప్లికేషన్ కి వీఐపీ యాక్సెస్, ZEE5 ప్రీమియమ్ మూవీస్, యాడ్-ఫ్రీ హంగామా మ్యూజిక్ (6 నెలల పాటు అపరిమిత డౌన్‌లోడ్స్) వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదండోయ్, Vi యాప్ పై 1000+ ఉచిత గేమ్స్ కి యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ ని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్ కి 50జిబి అదనపు డేటా లభిస్తుంది.

భారత దేశంలో ఉన్న టాప్-3 టెలీకామ్ సంస్థల్లో Vodafone Idea కూడా ఒకటి. జియో, ఎయిర్టెల్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, Vodafone Idea మూడో స్థానంలో ఉంది. జియో, ఎయిర్టెల్ సంస్థలు ఇప్పటికే తమ 5జీ నెట్వర్క్ ని ప్రారంభించాయి. ప్రస్తుతం సదరు సంస్థలు 5జీ కవరేజీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నాయి.

మరోపక్క Vodafone Idea 4జీ సేవలను విజయవంతంగా అందిస్తోంది. కానీ, 5జీ లాంచ్ ని ఇంకా చేయలేకపోయింది. రానున్న కొన్నేళ్ళలో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేస్తామని కంపెనీ చెబుతోంది. అయితే కచ్చితమైన సమయాన్ని వెల్లడించడం లేదు. ఏదేమైనా త్వరలోనే Vodafone Idea 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయాలని కోరుకుందాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.401 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>