Rs 429 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 16 Mar 2023 15:09:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea https://www.91mobiles.com/telugu/vodafone-idea-rs-289-rs-429-prepaid-plans-benefits/ Thu, 16 Mar 2023 15:09:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=5551 Vodafone-idea సంస్థ తన యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటు ధరలో లభించనున్నాయి. ఈ ప్లాన్స్ ధరలు రూ.289 మరియు రూ.429 గా ఉన్నాయి. వీఐ స్టోర్స్ ద్వారా ఈ రీచార్జ్ లను చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు ప్లాన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి. రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న ఉచిత కాలింగ్ మరియు 6జిబి వరకు డేటా […]

The post రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.289, రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తీసుకొచ్చిన Vodafone-idea
  • రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న అపరిమిత కాలింగ్, ఇంటర్నెట్ డేటా
  • రెండు రీచార్జ్ ప్లాన్స్ ద్వారా లభించనున్న 78 రోజుల వ్యాలిడిటీ, 1,000 ఎస్ఎంఎస్

Vodafone-idea సంస్థ తన యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటు ధరలో లభించనున్నాయి. ఈ ప్లాన్స్ ధరలు రూ.289 మరియు రూ.429 గా ఉన్నాయి. వీఐ స్టోర్స్ ద్వారా ఈ రీచార్జ్ లను చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు ప్లాన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.

రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న ఉచిత కాలింగ్ మరియు 6జిబి వరకు డేటా ప్రయోజనం

Vodafone-idea సంస్థ లాంచ్ చేసిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే, ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్ కి అపరిమిత వాయిస్ కాలింగ్, 6జిబి వరకు డేటా, 1000 వరకు ఎస్ఎంఎస్ మరియు 78 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి. ఈ ప్లాన్స్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందా పదండి.

Vodafone-idea రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 48 రోజుల వ్యాలిడిటీ
  • 4జిబి డేటా
  • 600 ఎస్ఎంఎస్
  • అపరిమిత వాయిస్ కాలింగ్

Vodafone-idea తీసుకొచ్చిన రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇతర బెనిఫిట్స్ చూస్తే, ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 48 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటా అలాగే మొత్తం 600 ఎస్ఎంఎస్ లభిస్తాయి. డేటా వినియోగంపై రోజువారీ పరిమితులు లేవు. అంటే, మీకు నచ్చినంత డేటాను వాడుకోవచ్చన్నమాట.

Vodafone-idea రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 78 రోజుల వ్యాలిడిటీ
  • 6జిబి డేటా
  • 1000 ఎస్ఎంఎస్
  • అపరిమిత వాయిస్ కాలింగ్

Vodafone-idea సంస్థ తీసుకొచ్చిన రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్స్ కి అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో పాటు, 6జిబి డేటా, 1000 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 78 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో కూడా రోజువారీ డేటా వినియోగ పరిమితి లేదు. దీనర్థం మీకు కావాల్సినంత డేటాను వాడుకునే వెసులుబాటు ఉంటుంది.

Vodafone-idea సంస్థ కొత్తగా తీసుకొచ్చిన రూ.429 మరియు రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా? మరొక్కసారి ఈ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను చదివి తెలుసుకుని, మీకు సరిపడేవైతే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఆనందించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea first appeared on 91Mobiles Telugu.

]]>