Rs 439 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 20 Jan 2023 15:18:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 BSNL రూ.439 ప్లాన్: ఎక్కువ వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్ కోసం ఇదే బెస్ట్! https://www.91mobiles.com/telugu/bsnl-rs-439-prepaid-plan-benefits/ Fri, 20 Jan 2023 15:18:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=4590 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో BSNL కూడా ఒకటి. ప్రభుత్వంచే నడపబడుతోన్న ఈ సంస్థ తన యూజర్ల కోసం ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోంది. దీంతో యూజర్లలో BSNL పట్ల మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలను అందించే టెలీకామ్ సంస్థగా BSNL కి మంచి పేరుంది. అయితే నెట్వర్క్ అప్‌గ్రేడ్ విషయంలో మిగతా ప్రయివేటు సంస్థల కంటే వెనకాలే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అందించిన ప్యాకేజీతో రెట్టించిన ఉత్సాహంతో […]

The post BSNL రూ.439 ప్లాన్: ఎక్కువ వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్ కోసం ఇదే బెస్ట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • BSNL తీసుకొచ్చిన అద్భుతమైన వాల్యూ ఫర్ మనీ ప్లాన్ STV 439
  • ఈ ప్లాన్ ద్వారా లభించనున్న అత్యధిక వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు
  • రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా లభించనున్న 90 రోజుల వ్యాలిడిటీ

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో BSNL కూడా ఒకటి. ప్రభుత్వంచే నడపబడుతోన్న ఈ సంస్థ తన యూజర్ల కోసం ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోంది. దీంతో యూజర్లలో BSNL పట్ల మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలను అందించే టెలీకామ్ సంస్థగా BSNL కి మంచి పేరుంది. అయితే నెట్వర్క్ అప్‌గ్రేడ్ విషయంలో మిగతా ప్రయివేటు సంస్థల కంటే వెనకాలే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అందించిన ప్యాకేజీతో రెట్టించిన ఉత్సాహంతో BSNL దూసుకొస్తోంది.

ప్రస్తుతం BSNL తన 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది. అలాగే 4జీ నెట్వర్క్ ని పూర్తి స్థాయిలో విస్తరింపజేయడంతో పాటు, వచ్చే ఏడాదికి 5జీని కూడా లాంచ్ చేయాలనే లక్ష్యంతో BSNL ముందుకు వెళ్తోంది. దీంతో BSNL కస్టమర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక BSNL కి మంచి రోజులు రాబోతున్నాయని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.

4జీ మరియు 5జీ సేవలను అందించేందుకు ప్రస్తుతం BSNL సంస్థ, TCS తో కలిసి పని చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 4జీ సేవలను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. కాగా, అన్ని రాష్ట్రాలకు 4జీని ఇంకా విస్తరించాల్సి ఉంది. మరోవైపు ప్రయివేటు టెలీకామ్ సంస్థలైన ఎయిర్టెల్, జియో ఇప్పటికే 5జీ సేవలను లాంచ్ చేశాయి. అవి 2023 పూర్తయ్యేకల్లా దేశం మొత్తం 5జీని విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ కూడా త్వరలోనే 4జీ, 5జీ సేవలను పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని ఆశిద్దాం.

సరే, ఇప్పుడు మనం BSNL అందిస్తోన్న 3 నెలల వ్యాలిడిటీ ప్లాన్ అయిన రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అత్యధిక వ్యాలిడిటీ కావాలని కోరుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ ప్లాన్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

BSNL రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL అందిస్తోన్న ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్ రూ.439. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ తో అపరిమిత కాల్స్ లభిస్తాయి. అంటే కస్టమర్లు ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అంతేకాదండోయ్, ఇంకా 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ఎస్ఎంఎస్ లను 90 రోజుల వ్యాలిడిటీ పూర్తయ్యేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు.

BSNL రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

  • 90 రోజుల వ్యాలిడిటీ
  • అపరిమిత కాలింగ్
  • 300 ఎస్ఎంఎస్

Note: రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ తో డేటా ప్రయోజనాలు ఏమీ లభించడం లేదు. కాబట్టి, యూజర్లు ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గమనించాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BSNL రూ.439 ప్లాన్: ఎక్కువ వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్ కోసం ఇదే బెస్ట్! first appeared on 91Mobiles Telugu.

]]>