Rs 528 broadband plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 15 Dec 2022 13:59:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 BSNL రూ.528 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఒక్క ప్లాన్ తో 3 బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/bsnl-introduces-rs-528-broadband-plan/ Thu, 15 Dec 2022 13:58:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4006 హైలైట్స్ రూ.528 లో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ని తీసుకొచ్చిన BSNL ఇదొక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉచిత డేటా, ఉచిత టీవీ చానల్స్ తో పాటు కాలింగ్ సౌకర్యంతో వచ్చిన ప్లాన్ 18 స్పోర్ట్స్ చానల్స్ ఉచితం, ఫిఫా వరల్డ్ కప్ 2022 ని చూసే అవకాశం తన కస్టమర్లను ఆకర్షించడంలో BSNL ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. టెలీకామ్ అయినా బ్రాడ్‌బ్యాండ్ సేవలైన తనదైన శైలి ప్లాన్స్ ని తీసుకొస్తుంటుంది BSNL. ప్రభుత్వరంగ సంస్థ అయిన […]

The post BSNL రూ.528 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఒక్క ప్లాన్ తో 3 బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రూ.528 లో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ని తీసుకొచ్చిన BSNL
  • ఇదొక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్
  • ఉచిత డేటా, ఉచిత టీవీ చానల్స్ తో పాటు కాలింగ్ సౌకర్యంతో వచ్చిన ప్లాన్
  • 18 స్పోర్ట్స్ చానల్స్ ఉచితం, ఫిఫా వరల్డ్ కప్ 2022 ని చూసే అవకాశం

తన కస్టమర్లను ఆకర్షించడంలో BSNL ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. టెలీకామ్ అయినా బ్రాడ్‌బ్యాండ్ సేవలైన తనదైన శైలి ప్లాన్స్ ని తీసుకొస్తుంటుంది BSNL. ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNL ఇప్పుడిప్పుడే తన అడుగుల్ని 4జీ, 5జీ వైపు వేస్తోంది. ఈ క్రమంలో తన దగ్గరున్న కస్టమర్ల కోసం చక్కటి ప్లాన్స్ అందిస్తూ వారిని అట్టిపెట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.

ఈ క్రమంలో BSNL సంస్థ ఒక అద్భుతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.528 విలువజేసే ఈ ప్లాన్ ద్వారా 211 టీవీ చానల్స్, 300జిబి డేటా, ఉచిత కాలింగ్ వంటి మరెన్నో బెనిఫిట్స్ లభించనున్నాయి. ఓసారి రూ.528 ప్లాన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

BSNL రూ.528 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL సంస్థ తాను తీసుకొచ్చిన రూ.528 ప్లాన్ కి ట్రిపుల్ ప్లే సర్వీస్ ప్లాన్ అని పేరు పెట్టింది. ఎందుకంటే, ఈ ప్లాన్ ఇంటర్నెట్, టెలీఫోన్, ఐపీటీవీ వంటి మూడు ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ఆ పేరు పెట్టారు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 300జిబి డేటా పొందుతారు. ఇంటర్నెట్ వేగం 10ఎంబీపీఎస్. అలాగే భారతదేశ వ్యాప్తంగా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచెస్ చూసే అవకాశం

రూ.528 ప్లాన్ తో 211 చానల్స్ ఉచితంగా లభిస్తాయి. ఇందులో 18 స్పోర్ట్స్ చానల్స్ ఉన్నాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతోన్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచెస్ ని యూజర్లు చూసేందుకు వీలుంది. ఫుల్ బాల్ లవర్స్ ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచెస్ ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంతే కాకుండా, న్యూస్, ఎంటర్టెయిన్మెంట్ చానల్స్ ని కూడా వీక్షించవచ్చు.

BSNL Rs.528 Broadband Plan Benefits

  • 300జిబి డేటా
  • ఐపీటీవీ
  • ఇంటర్నెట్
  • టెలీఫోన్
  • అపరిమిత కాల్స్
  • 30 రోజుల వ్యాలిడిటీ
  • 211 ఉచిత చానల్స్ (18 స్పోర్ట్స్ చానల్స్)

BSNL రూ.528 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

BSNL అందిస్తోన్న రూ.528 ప్లాన్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఈ ప్లాన్ BSNL వెబ్ సైట్ లో లిస్ట్ కాలేదు. కానీ, మీరు మీకు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ స్టోర్ కి వెళ్ళి లేదా కంపెనీ యొక్క టోల్-ఫ్రీ నంబర్ కి కాల్ చేసి ఈ ప్లాన్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఖరీదు రూ.528. అయితే దీనికి 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.528 పరిమితకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తో ఐపీటీవీ, ఇంటర్నెట్, టెలీఫోన్.. ఇలా మూడు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఈ తరహా కాంబో ప్లాన్ కోసం చూసే వారు రూ.528 ప్లాన్ ప్రయత్నించవచ్చు. ఇది పరిమితకాల ప్లాన్ మాత్రమే కావున, ఎక్కువ రోజులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి మీకు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ స్టోర్ కి వెళ్ళి ప్లాన్ గురించి ఎంక్వైరీ చేసి యాక్టివేట్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BSNL రూ.528 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఒక్క ప్లాన్ తో 3 బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>