Rs 549 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 24 Apr 2023 14:47:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.549 ప్లాన్ ని లాంచ్ చేసిన Vodafone Idea https://www.91mobiles.com/telugu/vodafone-idea-launched-rs-549-plan-1gb-daily-data-180-days-validity/ Mon, 24 Apr 2023 14:47:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=6013 వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు సదరు సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. ఈ టెలీకామ్ సంస్థ ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. కాంబో/వ్యాలిడిటీ కేటగిరీలో ఈ రీచార్జ్ ప్లాన్ ని పరిచయం చేసింది. వ్యాలిడిటీతో కూడిన డేటా కావాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ పని చేస్తుంది. అయితే, ఉచిత కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభించవు. సరే, ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. వొడాఫోన్ […]

The post రూ.549 ప్లాన్ ని లాంచ్ చేసిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 180 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన వొడాఫోన్ ఐడియా ప్లాన్
  • కాంబో/వ్యాలిడిటీ ప్లాన్ లో అందుబాటులో లేని ఎస్ఎంఎస్ బెనిఫిట్
  • వెబ్ సైట్ పై లిస్ట్ అయి ఉన్న కొత్త రీచార్జ్ ప్లాన్

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు సదరు సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. ఈ టెలీకామ్ సంస్థ ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. కాంబో/వ్యాలిడిటీ కేటగిరీలో ఈ రీచార్జ్ ప్లాన్ ని పరిచయం చేసింది. వ్యాలిడిటీతో కూడిన డేటా కావాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ పని చేస్తుంది. అయితే, ఉచిత కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభించవు. సరే, ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

వొడాఫోన్ ఐడియా రూ.549 ప్లాన్

  • వొడాఫోన్ ఐడియా సంస్థ తీసుకొచ్చిన రూ.549 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • అలాగే ఈ ప్లాన్ ద్వారా వినియోగదారుకి 1జిబి డెయిలీ డేటా లభిస్తుంది. కానీ, కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభించవు.
  • ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే వారికి సెకనుకి 2.5 పైసలు వసూలు చేయబడతాయి.

నోట్: పరిమిత డేటా మరియు అధిక వ్యాలిడిటీ కావాలని భావించే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

సరే, ఒక విషయం ఏటంటే, వొడాఫోన్ ఐడియా రీసెంట్ గా రూ.368 మరియు రూ.369 ప్లాన్స్ ని పరిచయం చేసింది. ఈ రెండు ప్లాన్స్ 30 రోజుల వ్యాలిడిటీ తో పాటు ఉచిత కాలింగ్, డెయిలీ 2జిబి డేటా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్, ఎస్ఎంఎస్ బెనిఫిట్ తో వచ్చాయి. ఈ రెండు ప్లాన్స్ యొక్క పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Vodafone Idea ఎదురీత

ఇంకా 5జీ సేవలను లాంచ్ చేయకపోవడంతో, వొడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లను కోల్పోతూ వస్తోంది. ఎందుకంటే ఇతర టెలీకామ్ సంస్థలు ఇప్పటికే తమ 5జీ సేవలను చాలా రాష్ట్రాల్లో లాంచ్ చేసాయి. 2022 డిసెంబర్ 31 నాటికి వొడాఫోన్ ఐడియా సంస్థ రూ.7,990 కోట్ల నష్టాలను చవిచూసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో వీఐ సంస్థ రూ.7,595.5 కోట్ల నష్టాలను నమోదు చేసింది. మళ్ళీ వొడాఫోన్ ఐడియాకి మంచి రోజులు రావాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.549 ప్లాన్ ని లాంచ్ చేసిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel రూ.549 ప్లాన్; SonyLiv యాక్సెస్, ఇంకా మరెన్నో బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/airtel-rs-549-prepaid-plan-benefits/ Wed, 21 Dec 2022 09:36:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=4111 హైలైట్స్ వివిధ ప్రీపెయిడ్ ప్లాన్స్ ని అందిస్తోన్న టెలీకామ్ కంపెనీ Airtel రూ.549 ప్లాన్ తో ఎయిర్టెల్ అందిస్తోన్న బెనిఫిట్స్: 2జిబి డెయిలీ డేటా, అపరిమిత కాల్స్, 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్ Xtream యాప్ పై సోనిలివ్, లయన్స్‌గేట్‌ప్లే, ఇరోజ్‌నౌ, హొయ్‌చొయ్, మనోరమ‌మ్యాక్స్, చౌపల్, కాంచాలంకా.. వీటిలో ఏదైనా ఒకదానికి ఉచిత యాక్సెస్ భారతదేశంలో ఉన్న ఉత్తమ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ కూడా ఒకటి. ప్రస్తుతం రిలయన్స్ జియో తో ఎయిర్టెల్ కి […]

The post Airtel రూ.549 ప్లాన్; SonyLiv యాక్సెస్, ఇంకా మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • వివిధ ప్రీపెయిడ్ ప్లాన్స్ ని అందిస్తోన్న టెలీకామ్ కంపెనీ Airtel
  • రూ.549 ప్లాన్ తో ఎయిర్టెల్ అందిస్తోన్న బెనిఫిట్స్: 2జిబి డెయిలీ డేటా, అపరిమిత కాల్స్, 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • Xtream యాప్ పై సోనిలివ్, లయన్స్‌గేట్‌ప్లే, ఇరోజ్‌నౌ, హొయ్‌చొయ్, మనోరమ‌మ్యాక్స్, చౌపల్, కాంచాలంకా.. వీటిలో ఏదైనా ఒకదానికి ఉచిత యాక్సెస్

భారతదేశంలో ఉన్న ఉత్తమ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ కూడా ఒకటి. ప్రస్తుతం రిలయన్స్ జియో తో ఎయిర్టెల్ కి గట్టిపోటీ నెలకొంది. రెండు సంస్థలు కూడా పోటీపోటీగా తలపడుతున్నాయి. అయితే 5జీ స్పెక్ట్రమ్ లో జియో పైచేయి సాధించగా, నానాటికీ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ ఎయిర్టెల్ కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను లాంచ్ చేసి, దేశమంతటా 5జీ నెట్వర్క్ ని విస్తరించే పనిలో ఉన్నాయి.

ఎయిర్టెల్ కంపెనీ ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ ని అందిస్తోంది. వాటిలో ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు వివిధ రకాల బెనిఫిట్స్ అందుతాయి. వాటిలో అపరిమిత కాల్స్ తో పాటు, ఎస్ఎంఎస్ లు, ఇంటర్నెట్ డేటా, ఉత్తమమైన వ్యాలిడిటీ వంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఈ ప్లాన్ తో ఎన్నో అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సరే, రూ.549 ప్లాన్ అందిస్తోన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Airtel రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

ఎయిర్టెల్ రూ.549 రీచార్జ్ ప్లాన్ తో ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానంగా డేటా ఎక్కువగా ఉపయోగించే వారి కోసం ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. రోజువారీ లిమిట్ ముగిసాక డేటా స్పీడ్ 64కేబీపీఎస్ కి పడిపోతుంది. ఇక కాల్స్ ఎక్కువగా మాట్లాడే వారి కోసం అపరిమిత కాలింగ్ సౌకర్యం ఉంది. ఎక్కువ వ్యాలిడిటీ కోసం చూసే వారి కోసం 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

మీరు ఎక్కువగా ఎస్ఎంఎస్ లు చేసే వారైతే మీకు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ప్యాక్ వ్యాలిడిటీ ముగిసే వరకు ఈ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి. డెయిలీ 100 ఎస్ఎంఎస్ లిమిట్ దాటితో మీరు చేసే ప్రతీ లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.50 చార్జ్ చేయబడుతుంది. ఇప్పుడు రూ.549 రీచార్జ్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

రూ.549 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.549 ప్లాన్ తో ఎన్నో ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అపోలో 24/7 సర్కిల్ సేవలు 3 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

Xtream App బెనిఫిట్

Xtream App లో ఏదేనీ ఒక ఎంపిక చేసుకున్న చానల్ కి 56 రోజుల పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. సోనిలివ్, లయన్స్‌గేట్, ఇరోజ్‌నౌ, హొయ్‌చొయ్, మనోరమమ్యాక్స్, చౌపల్, కాంచాలంకా.. వీటిలో నుంచి ఏదైనా ఒక దానికి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. వీటిలో మీకు కావాల్సిన ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel రూ.549 ప్లాన్; SonyLiv యాక్సెస్, ఇంకా మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>