Rs 902 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Jun 2023 07:29:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.902 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea; బెనిఫిట్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vodafone-idea-rs-902-prepaid-plan-benefits/ Fri, 09 Jun 2023 06:16:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=6696 ప్రముఖ టెలీకామ్ సంస్థ వొడాఫోన్ ఐడియా గత కొన్ని రోజులుగా కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ మరొక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.902 విలువజేసే ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి డేటా, వ్యాలిడిటీ ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి ీ ప్లాన్ బాగా సరిపోతుంది. సరే, ఓసారి రూ.902 ప్లాన్ వివరాలు తెలుసుకుందాం పదండి. రూ.902 ప్లాన్ పూర్తి వివరాలు కొత్త Vi అన్‌లిమిటెడ్ రీఛార్జ్ […]

The post రూ.902 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea; బెనిఫిట్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త డేటా, వ్యాలిడిటీ ప్లాన్ లాంచ్ చేసిన వొడాఫోన్ ఐడియా
  • కంపెనీ వెబ్ సైట్ లో అన్‌లిమిటెడ్ ట్యాబ్ క్రింద లిస్ట్ ఐన ప్లాన్
  • ప్లాన్ ద్వారా యూజర్లకు లభించనున్న 90 రోజుల వ్యాలిడిటీ

ప్రముఖ టెలీకామ్ సంస్థ వొడాఫోన్ ఐడియా గత కొన్ని రోజులుగా కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ మరొక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.902 విలువజేసే ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి డేటా, వ్యాలిడిటీ ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి ీ ప్లాన్ బాగా సరిపోతుంది. సరే, ఓసారి రూ.902 ప్లాన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

రూ.902 ప్లాన్ పూర్తి వివరాలు

  • కొత్త Vi అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 902 మరియు 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
  • ఇది “అపరిమిత” ట్యాబ్ క్రింద కంపెనీ సైట్‌లో జాబితా చేయబడింది.
  • ఇందులో, అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
  • రోజువారీ 2GB డేటా అంటే మొత్తం 180GB డేటా ప్లాన్‌లో ఉపయోగించడానికి అందుబాటులో ఉంటుంది. రోజువారీ డేటా కోటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గించబడుతుంది.
  • రీఛార్జ్ వినియోగదారులకు రోజుకు 100 SMSలను అందిస్తుంది, మీకు ఇష్టమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా ఇంటర్నెట్ కనెక్షన్‌లో సమస్య ఉన్నప్పుడు మీరు ఉపయోగించవచ్చు.

OTT సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్

ఉచిత కాలింగ్, డేటా మరియు ఎస్ఎంఎస్ తో పాటు, ఉచిత SunNXT సబ్‌స్క్రిప్షన్ యూజర్లకు లభిస్తుంది. నిజానికి సన్‌నెక్ట్స్ స్ట్రీమింగ్ సేవల చందా రూ.480 నుంచి మొదలవుతుంది. ఇది బేస్ ప్రైస్. ఇక ప్రీమియమ్ చందా ధర రూ.799 వరకు ఉంటుంది.

వీకెండ్ డేటా రోలోవర్, నైట్ డేటా బెనిఫిట్స్

వీకెండ్ డేటా రోలోవర్ మరియు నైట్ డేటా బెనిఫిట్స్ కూడా ఈ రీచార్జ్ ప్లాన్ తో లభిస్తాయి. వీకెండ్ డేటా రోలోవర్ లో కస్టమర్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను శనివారం మరియు ఆదివారం నాడు పొందుతారు.

ఇక నైట్ డేటా బెనిఫిట్ గురించి మాట్లాడితే, ఈ ప్లాన్ వల్లన అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లభిస్తుంది.

The post రూ.902 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea; బెనిఫిట్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>