Samsung Black Friday Sale - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 25 Nov 2022 11:45:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Black Friday Sale: Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/black-friday-sale-price-cut-on-samsung-galaxy-z-flip-3-discount-value-rs-36000/ Fri, 25 Nov 2022 11:36:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=3676 హైలైట్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా పలు ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్ Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న బ్లాక్ ఫ్రైడే వచ్చేసింది. ఈ షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా, శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, […]

The post Black Friday Sale: Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా పలు ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్
  • గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్
  • Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న బ్లాక్ ఫ్రైడే వచ్చేసింది. ఈ షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా, శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్ పై శాంసంగ్ భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. ప్రీమియమ్ గెలాక్సీ ఎస్22 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లపై మాంచి డీల్స్ వచ్చేశాయి. ఈ డీల్స్ లో Samsung Galaxy Z Flip 3 డీల్ ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ డివైజ్ పై శాంసంగ్ ఏకంగా రూ.36,000 డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో మరింత డిస్కౌంట్ ని పొందే అవకాశం ఉంది.

మరి ఈ ఫోన్ ని కొనచ్చంటారా? లాంచ్ అయి ఏడాది కావస్తున్నా ఈ ఫోన్ కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఆఫర్ లో అందుబాటు ధరలో లభ్యమవుతోంది. దీంతో జనాల కన్ను ఈ ఫోన్ పై పడింది. డిస్కౌంట్ పై మీరు ఈ ఫోన్ ని హ్యాపీగా కొనేయచ్చు. ఓసారి Samsung Galaxy Z Flip 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Samsung Galaxy Z Flip 3 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Z Flip 3 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ వాడారు. కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్ లో 12 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 12ఎంపి ప్రైమరీ కెమెరా, మరొకటి 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy Z Flip 3 లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. అయితే బ్యాటరీ సెగ్మెంట్ మైనస్ అనే చెప్పాలి. ఇంత తక్కువ కెపాసిటీ బ్యాటరీతో రోజంతా గడవడం కష్టమే. అయితే సాధారణ వాడుక పై సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు ఫోన్ పని చేసే అవకాశం ఉంది. ఏదేమైనా చార్జింగ్ పట్ల ఓ కన్నేసి ఉంచాల్సిందే.

Samsung Galaxy Z Flip 3 ధర తగ్గింపు

Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇదివరకు ఈ ఫోన్ ధర రూ.95,999 గా ఉంది. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా మీరు ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ని రూ.59,999 కే కొనుగోలు చేయవచ్చు.

అంతేకాదండోయ్, ఈ ఫోన్ ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎలా అంటే, మీరు ప్రస్తుతం వాడుతోన్న పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.25,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. మీ ఫోన్ యొక్క కండీషన్ ని బట్టి ఈ ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ నిర్ణయించబడుతుంది. ఒకవేళ మీరు పూర్తి ఎక్స్‌చేంజ్ మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో పొందితే అప్పుడు, Samsung Galaxy Z Flip 3 ఫోన్ ని కేవలం రూ.34,999 కే సొంతం చేసుకోవచ్చు. డీల్ అదిరిపోయింది కదూ.

బ్లాక్ ఫ్రైడే (Black Friday) అంటే ఏంటి?

అసలు ఈ బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది 1869 లో వచ్చిన కాన్సెప్ట్. ఆ సమయంలో ఉన్నట్లుండి ఒకేసారి బంగారం ధరలు అనూహ్యంగా పడిపోయాయి. దీంతో సెక్యూరిటీ మార్కెట్స్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిణామం యొక్క ప్రభావం అమెరికా (యూఎస్ఏ) పై తీవ్రంగా పడింది. అప్పుడు ఈ బ్లాక్ ఫ్రైడే అనే మాట వాడుకలోకి వచ్చింది. అయితే, ఆధునిక బ్లాక్ ఫ్రైడే సెలబ్రేషన్ అనేది దాదాపు 100 ఏళ్ళ క్రితం అమెరికా లోని ఫిలడెల్ఫియాలో మొదలైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Black Friday Sale: Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Black Friday సేల్ లో భాగంగా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోన్న Samsung https://www.91mobiles.com/telugu/samsung-black-friday-sale-begins-from-november-24/ Tue, 22 Nov 2022 08:24:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3578 హైలైట్స్ నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ గెలాక్సీ ఎస్22 సిరీస్, గెలాక్సీ జెడ్ సిరీస్, గెలాక్సీ ఎమ్ సిరీస్ మరియు ఇతర డివైజెస్ పై డిస్కౌంట్స్ పలు డీల్స్ ని టీజ్ చేసిన శాంసంగ్ సంస్థ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ త్వరలో Black Friday Sale తో కస్టమర్ల ముందుకు రాబోతోంది. ఈ సేల్ నవంబర్ 24 నుంచి మొదలై 28 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా […]

The post Black Friday సేల్ లో భాగంగా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోన్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్
  • గెలాక్సీ ఎస్22 సిరీస్, గెలాక్సీ జెడ్ సిరీస్, గెలాక్సీ ఎమ్ సిరీస్ మరియు ఇతర డివైజెస్ పై డిస్కౌంట్స్
  • పలు డీల్స్ ని టీజ్ చేసిన శాంసంగ్ సంస్థ

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ త్వరలో Black Friday Sale తో కస్టమర్ల ముందుకు రాబోతోంది. ఈ సేల్ నవంబర్ 24 నుంచి మొదలై 28 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా ఎన్నో డివైజెస్ పై శాంసంగ్ డిస్కౌంట్స్ అందించనుంది. కస్టమర్లు శాంసంగ్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్స్ మరియు ఆఫర్లను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలు, మానిటర్లు, రిఫ్రిజిరేటర్స్ తదితర ఉత్పత్తులపై డిస్కౌంట్స్ లభించన్నాయి.

Samsung Black Friday సేల్ ఆఫర్స్

శాంసంగ్ సంస్థ బ్లాక్ ఫ్రైడే సేల్ ని తీసుకొస్తోంది. ఈ సేల్ నవంబర్ 24 నుంచి మొదలవుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్ లభిస్తాయి. ప్రధానంగా గెలాక్సీ ఎస్22 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 పై డిస్కౌంట్స్ లభించనున్నాయి. సేల్ సందర్భంగా ఎవరైతే ప్రీమియమ్ ఫోల్డబుల్ ఫోన్ ని కొనుగోలు చేస్తారో వారికి గెలాక్సీ వాచ్ 4 ని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చని శాంసంగ్ తెలిపింది.

Galaxy Z Flip 4 పైన కొంత డిస్కౌంట్ లభించనుంది. దీని లాంచ్ ప్రైస్ రూ.89,999 గా ఉంది. ఇకపోతే 2021 లో లాంచ్ అయిన ఫ్లిప్ ఫోన్ Galaxy Z Flip 3 ఫోన్ సేల్ సమయంలో రూ.60,000 లోపు ధరలో లభించనుంది.

గతేడాది లాంచ్ అయిన Samsung Galaxy S21 FE 5G రూ.40,000 ధర వద్ద లభించనుంది. గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ కొనే కస్టమర్లకు రూ.20,000 కి పైగా బెనిఫిట్స్ లభిస్తాయని శఆంసంగ్ వెల్లడించింది.

Galaxy Watch 5, Galaxy Watch 5 Pro వంటి వేరబుల్స్ పై కూడా శాంసంగ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా వీటిని కొనే కస్టమర్లకు మంచి డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్ యొక్క లేటెస్ట్ TWS బడ్స్ Galaxy Buds 2 Pro కూడా డిస్కౌంట్ ధరతో లభించనుంది.

Samsung M-Series ఫోన్లపై డిస్కౌంట్

పైన పేర్కొన్న ఆఫర్లు కాకుండా శాంసంగ్ ఎమ్-సిరీస్ ఫోన్లపై కూడా శాంసంగ్ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తోంది. బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్స్ స్మార్ట్ ఫోన్స్ కే పరిమితం కాలేదు. ఈ సేల్ సందర్భంగా ల్యాప్‌టాప్స్, మానిటర్స్, యాక్ససరీలు, టీవీలు, సౌండ్ బార్స్, వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్‌లు, ట్యాబ్లెట్స్, ఏసీలు మరియు కిచెన్ అప్లయన్సెస్ పై డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. సేల్ సందర్భంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. మరింకేంటి, బ్లాక్ ఫ్రైడే సేల్ కి సిద్ధమైపోండి. అద్భుతమైన ఆఫర్లను మీ సొంతం చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Black Friday సేల్ లో భాగంగా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోన్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>