Samsung Galaxy A13 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Aug 2022 12:56:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A13 5G, Galaxy A23 5G ధరలు, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a23-galaxy-a13-price-specifications-taiwan-launch/ Tue, 23 Aug 2022 12:56:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=1838 హైలైట్స్: శాంసంగ్ గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ23 ధరలు, స్పెసిఫికేషన్స్ ప్రకటన మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తున్న గెలాక్సీ ఏ23 శాంసంగ్ గెలాక్సీ ఏ13 ధర NTD 6990 (దాదాపు రూ.18,500) నుంచి ప్రారంభం. గెలాక్సీ ఏ23 5జీ ధర NTD 8990 (దాదాపు రూ.23,800) శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ని మిడ్-రేంజ్ 5జీ ఫోన్ గా […]

The post Samsung Galaxy A13 5G, Galaxy A23 5G ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • శాంసంగ్ గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ23 ధరలు, స్పెసిఫికేషన్స్ ప్రకటన
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తున్న గెలాక్సీ ఏ23
  • శాంసంగ్ గెలాక్సీ ఏ13 ధర NTD 6990 (దాదాపు రూ.18,500) నుంచి ప్రారంభం. గెలాక్సీ ఏ23 5జీ ధర NTD 8990 (దాదాపు రూ.23,800)

శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ని మిడ్-రేంజ్ 5జీ ఫోన్ గా ఈ నెల మొదట్లో పరిచయం చేశారు. అయితే, స్పెసిఫికేషన్స్ ని మాత్రమే రివీల్ చేసిన కంపెనీ, ధరను రహస్యంగానే ఉంచింది. తాజాగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ యొక్క తైవాన్ మార్కెట్ ధర, విడుదల తేదీని రివీల్ చేసింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ13 ని కూడా కంపెనీ ఇంట్రడ్యూస్ చేయనుంది. ఈ రెండు ఫోన్లు కూడా మిడ్-రేంజ్ 5జీ ఫోన్స్. అయితే ఈ ఫోన్స్ భారత్ లో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నాయ్నన విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Samsung Galaxy A13, Galaxy A23 ధరలు, అమ్మకాలు మొదలయ్యే రోజు

తైవాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ13 4జిబి + 64జిబి వేరియంట్ ధర NTD 6990 (దాదాపు రూ.18,500) గా ఉంది. 4జిబి + 128జిబి వేరియంట్ ధర NTD 7990 (దాదాపు రూ.21,200) గా ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫోన్ యొక్క అమ్మకాలు మొదలు కానున్నాయి. కాగా, ఈ ఫోన్ నలుపు, నీలం, తెలుపు రంగుల్లో లభించనుంది.

గెలాక్సీ ఏ23 5జీ యొక్క 4జిబి + 64జిబి మోడల్ ధర NTD 8990 (దాదాపు రూ.23,800) గా ఉంది. 6జిబి + 128జిబి మోడల్ ధర NTD 9990 (దాదాపు రూ.26,500) గా ఉంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ ఫోన్ యొక్క సేల్స్ మొదలవ్వనున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ బ్లాక్, పీచ్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Samsung Galaxy A13 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ13 లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెల్ఫీ కోసం వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

5జీ కనెక్టివిటీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ 164.5 ఎంఎం పొడవు, 76.5 ఎంఎం వెడల్పు, 8.8 ఎంఎం మందం ఉంటుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. గెలాక్సీ ఏ13 ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 5ఎంపి కెమెరా ఉంది.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

గెలాక్సీ ఏ23 5జీ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 165.4 ఎంఎం పొడవు, 76.9 ఎంఎం వెడల్పు, 8.4 ఎంఎం మందం ఉంటుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. గెలాక్సీ ఏ23 లో క్వాడ్ కెమెరాస్ ఉంటాయి. వీటిలో ఓఐఎస్ తో కూడిన 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరాను అమర్చారు.

The post Samsung Galaxy A13 5G, Galaxy A23 5G ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>