Samsung Galaxy A24 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Apr 2023 06:06:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో లాంచైన Samsung Galaxy A24 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a24-launched-vietnam-specs-variants/ Wed, 19 Apr 2023 12:53:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=5950 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఏ-సిరీస్ లో Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుందని వార్తలు వినిపించాయి. నేడు, ఈ ఫోన్ అఫీషియల్ గా జనాల ముందుకు వచ్చింది. శాంసంగ్ సంస్థ Galaxy A24 డివైజ్ ని వియత్నాంలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Galaxy A24 డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో లాంచైన Samsung Galaxy A24 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో లాంచైన Samsung Galaxy A24
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చిన డివైజ్
  • 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేయనున్న Samsung Galaxy A24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఏ-సిరీస్ లో Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుందని వార్తలు వినిపించాయి. నేడు, ఈ ఫోన్ అఫీషియల్ గా జనాల ముందుకు వచ్చింది. శాంసంగ్ సంస్థ Galaxy A24 డివైజ్ ని వియత్నాంలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Galaxy A24 డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • సూపర్ అమోలెడ్ ప్యానెల్

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ సూపర్ అమోలెడ్ ప్యానెల్ పై తయారైంది. డిస్ప్లే బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో చిన్ కనిపిస్తోంది. యు షేప్ లో ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంది.

  • 8జిబి ర్యామ్ + 128జిబి మెమొరీ
  • 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఈ ఫోన్ లో 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. కచ్చితమైన చిప్సెట్ వివరాలు ఇంకా అందలేదు. Samsung Galaxy A24 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా

Samsung Galaxy A24 లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

  • 3.5ఎంఎం ఆడియో జాక్
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A24 ఫోన్ ఒక 4జీ డివైజ్. డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 3.5ఎంఎం ఆడియోజాక్ ఉంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

Samsung Galaxy A24 వేరియంట్స్ మరియు ధర

Samsung Galaxy A24 డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో వచ్చింది. ఇందులో బేస్ మోడల్ 6జిబి ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. ప్రస్తుతానికి Samsung Galaxy A24 ధర ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో లాంచైన Samsung Galaxy A24 first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Samsung Galaxy A24 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a24-google-play-console-listing-key-specs/ Tue, 18 Apr 2023 09:52:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=5924 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ తొలుత టర్కీలో లాంచ్ కానుంది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని శాంసంగ్ వెల్లడించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని అప్పుడు కంపెనీ వెల్లడించలేదు. ఇప్పుడు ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ డివైజ్ SM-A245F అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. టెక్ వెబ్ సైట్ Pricebaba […]

The post గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Samsung Galaxy A24 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A24
  • కంపెనీ వెబ్ సైట్ లో కనిపించిన Samsung Galaxy A24 సపోర్ట్ పేజీ
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ తొలుత టర్కీలో లాంచ్ కానుంది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని శాంసంగ్ వెల్లడించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని అప్పుడు కంపెనీ వెల్లడించలేదు. ఇప్పుడు ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ డివైజ్ SM-A245F అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. టెక్ వెబ్ సైట్ Pricebaba ఈ విషయాన్ని ముందుగా గుర్తించింది. ఇక లిస్టింగ్ ద్వారా ఫోన్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లిస్టింగ్ ద్వారా తెలిసిన వివరాలు

Samsung Galaxy A24 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ తెలిసాయి. లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ57 జీపీయూ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

కొన్ని రోజుల క్రితం 91మొబైల్స్ శాంసంగ్ వెబ్ సైట్ లో Samsung Galaxy A24 డివైజ్ సపోర్ట్ పేజీని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్ లో లాంచ్ కానుందని తెలిసింది. ఎన్నో రిపోర్ట్స్ ద్వారా కూడా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ లీక్ అయ్యాయి.

Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ లో 1080*2408 పిక్సెల్ రెజుల్యూషన్ కలిగిన 6.5-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్ ఉంటుంది. అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఎల్సీడీ ప్యానెల్ పై డిస్ప్లే తయారైంది.

చిప్సెట్, ఓఎస్, స్టోరేజీ

Samsung Galaxy A24 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ తో వస్తోంది.

కెమెరా

Samsung Galaxy A24 డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ

Samsung Galaxy A24 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

Samsung Galaxy A24 ధర, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

ఒక రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A24 డివైజ్ ధర 190 యూఎస్ డాలర్లు (సుమారు రూ.16,000) గా ఉంటుందని తెలుస్తోంది. లీక్స్ ని బట్టి, Samsung Galaxy A24 హ్యాండ్సెట్ ఏప్రిల్ నెలలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Samsung Galaxy A24 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy A24 ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a24-price-specs-leaked-before-launch/ Thu, 06 Apr 2023 14:23:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=5784 శాంసంగ్ సంస్థ త్వరలోనే Samsung Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుందని ఇటీవల మార్కెట్ లో చర్చలు జరుగుతున్నాయి. 4జీ కనెక్టివిటీతో రానున్న ఈ డివైజ్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ కానుంది. ఇక Samsung Galaxy A24 కి సంబంధించిన అధికార ప్రకటన వస్తుందనుకుంటోన్న తరుణంలో, ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A24 ధర Samsung Galaxy A24 డివైజ్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy A24 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A24 ధర రూ.16,000 వద్ద ఉండే అవకాశం
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో రానున్న డివైజ్
  • ఏప్రిల్ నెలలోనే Samsung Galaxy A24 లాంచ్ అయ్యే చాన్స్

శాంసంగ్ సంస్థ త్వరలోనే Samsung Galaxy A24 డివైజ్ ని లాంచ్ చేయనుందని ఇటీవల మార్కెట్ లో చర్చలు జరుగుతున్నాయి. 4జీ కనెక్టివిటీతో రానున్న ఈ డివైజ్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ కానుంది. ఇక Samsung Galaxy A24 కి సంబంధించిన అధికార ప్రకటన వస్తుందనుకుంటోన్న తరుణంలో, ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A24 ధర

Samsung Galaxy A24 డివైజ్ లేటెస్ట్ లీక్ ని The Tech Outlook వెబ్ సైట్ షేర్ చేసింది. రిపోర్ట్ ప్రకారం, ఈ శాంసంగ్ ఫోన్ 190 యూఎస్ డాలర్ల ధరతో లాంచ్ కానున్నట్లు సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.16 వేలుగా ఉండనుంది. లీక్ గనుక నిజమే అయితే, Samsung Galaxy A24 డివైజ్ మార్కెట్ లోకి ఏప్రిల్ నెలలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

  • 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ప్యానెల్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఆండ్రాయిడ్ 13ఓఎస్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్
  • 50ఎంపి రియర్ కెమెరా
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా
  • 15 వాట్ చార్జింగ్
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్, 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో లాంచ్ అవుతుందని రిపోర్ట్ లో పేర్కొనబడింది. అలాగే ఈ స్క్రీన్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైందని, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.

Samsung Galaxy A24 4G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వస్తున్నట్లు నివేదికలో పేర్కొనబడింది.

Samsung Galaxy A24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుందని లీకైన రిపోర్ట్ ని బట్టి అర్థమవుతోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A24 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఉండే అవకాశం ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఈ శాంసంగ్ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy A24 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Helio G99 చిప్, Android 13 ఓఎస్ తో వస్తోన్న Samsung Galaxy A24 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a24-4g-geekbench-specs-revealed/ Wed, 18 Jan 2023 14:55:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4546 Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ ని ఇటీవలె శాంసంగ్ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. తాజాగా Samsung Galaxy A24 4జీ వర్షన్ గీక్ బెంచ్ 5 బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ పై కనిపించింది. ఈ లిస్ట్ లో ఫోన్ SM-245F అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క ర్యామ్, ఆండ్రాయిడ్ ఓఎస్, చిప్సెట్ వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలిసాయి. Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ […]

The post Helio G99 చిప్, Android 13 ఓఎస్ తో వస్తోన్న Samsung Galaxy A24 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గీక్‌బెంచ్ పై SM-245F అనే మోడల్ నంబర్ తో కనిపించిన Samsung Galaxy A24
  • 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తోన్న Samsung Galaxy A24
  • Samsung Galaxy A23 కి సక్సెసర్ గా వస్తోన్న Samsung Galaxy A24

Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ ని ఇటీవలె శాంసంగ్ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. తాజాగా Samsung Galaxy A24 4జీ వర్షన్ గీక్ బెంచ్ 5 బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ పై కనిపించింది. ఈ లిస్ట్ లో ఫోన్ SM-245F అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క ర్యామ్, ఆండ్రాయిడ్ ఓఎస్, చిప్సెట్ వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలిసాయి.

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్టులో 561 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టులో 1943 పాయింట్లు సాధించింది. ఈ ఫోన్ లో శాంసంగ్ సంస్థ Exynos 7904 ప్రాసెసర్ ని వినియోగించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బయటకు వచ్చిన గీక్ బెంచ్ 5 లిస్ట్ దీనికి భిన్నంగా ఉంది.

Geekbench పై కనిపించిన Samsung Galaxy A24

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ని గీక్ బెంచ్ పై తొలుత MySmartPrice గుర్తించింది. ఈ లిస్ట్ లో Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ కస్టమ్ స్కిన్, 4జిబి ర్యామ్ తో రానున్నట్లు పేర్కొనబడి ఉంది. Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 2 + 6 కోర్ కన్ఫిగరేషన్ గల ఆక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు లిస్ట్ ద్వారా స్పష్టమైంది. 8 కోర్స్ లో, 2 కోర్స్ 2.20 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉన్నాయి. మిగతా 6 కోర్స్ 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని నమోదు చేశాయి. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీ57 జీపీయూ వాడారు.

గీక్ బెంచ్ లిస్టింగ్ ని బట్టి, Samsung Galaxy A24 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఈ చిప్సెట్ తో వస్తోన్న మొదటి శాంసంగ్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన వివరాలు ఇవేనండి. రానున్న రోజుల్లో మరింత సమాచారాన్ని మీకు అందిస్తాం.

Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్

  • MediaTek Helio G99 చిప్సెట్
  • 4GB ర్యామ్
  • 64GB/128GB స్టోరేజీ
  • Mali G57 గ్రాఫిక్స్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • వన్‌యూఐ కస్టమ్ స్కిన్

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉంటాయి. మిగతా ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై ఫోన్ పని చేస్తుంది. మాలి జీ57 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడారు. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్స్ తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Helio G99 చిప్, Android 13 ఓఎస్ తో వస్తోన్న Samsung Galaxy A24 4G first appeared on 91Mobiles Telugu.

]]>