Samsung Galaxy A56 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Oct 2024 12:07:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A56: గీక్‌బెంచ్‌పై లిస్టైన గెలాక్సీ ఏ56, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-listed-on-geekbench-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-listed-on-geekbench-know-full-details/#respond Thu, 03 Oct 2024 12:07:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13893 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A56 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Samsung Galaxy A56 గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై […]

The post Samsung Galaxy A56: గీక్‌బెంచ్‌పై లిస్టైన గెలాక్సీ ఏ56, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A56 విడుదల
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ SM-A566B

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A56 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy A56 గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై SM-A566B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A56 డివైజ్ ఎగ్జినోస్ 1580 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది. సింగిల్-కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1341 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,836 పాయింట్లు స్కోర్ నమోదు చేసింది.

Samsung Galaxy A55 మోడల్ లో వాడిన ఎగ్జినోస్ 1480 చిప్సెట్ కంటే ఎగ్జినోస్ 1580 ప్రాసెసర్ ఎంతో శక్తివంతమైంది. ఈ చిప్సెట్ S5E8855 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.91 గిగాహెర్ట్జ్.

ఎగ్జినోస్ 1580 చిప్సెట్‌కి జతగా ఎక్స్‌క్లిప్స్ 540 గ్రాఫిక్స్ జత చేసినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A56 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Samsung Galaxy A56 డివైజ్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 7.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2340 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

ఇతర ఫీచర్లు: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ 2.0 ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung Galaxy A56: గీక్‌బెంచ్‌పై లిస్టైన గెలాక్సీ ఏ56, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-listed-on-geekbench-know-full-details/feed/ 0
Samsung Galaxy A56: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఏ56 వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-5g-details-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-5g-details-leaked-before-launch/#respond Wed, 18 Sep 2024 11:26:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=13581 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A56 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇంకా ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించిన ప్రకటనను శాంసంగ్ వెల్లడించాల్సి ఉంది. ఈలోపు, ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, మోడల్ నంబర్, చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Samsung Galaxy A56 వివరాలు (లీక్) Samsung Galaxy […]

The post Samsung Galaxy A56: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఏ56 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A56 విడుదల
  • ఇంకా వెల్లడి కాని అధికార ప్రకటన
  • మోడల్ నంబర్ SM-A566B/DS

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A56 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇంకా ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించిన ప్రకటనను శాంసంగ్ వెల్లడించాల్సి ఉంది. ఈలోపు, ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, మోడల్ నంబర్, చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy A56 వివరాలు (లీక్)

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను Smartprix వెబ్‌సైట్ తన కథనం ద్వారా రివీల్ చేసింది.

Samsung Galaxy A56 డివైజ్ ఇప్పటికే టెస్టింగ్‌ను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది లాంచ్ కి సిద్ధంగా ఉన్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ యొక్క మోడల్ నంబర్ SM-A566B/DS అని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

గత మోడల్ Samsung Galaxy A55 మోడల్ నంబర్ SM-A556B/DS గా ఉంది. ఏ55 కంటే మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో ఏ56 విడుదలయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy A56 లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం నెట్వర్క్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి, 2025 మొదటి త్రైమాసికంలో గెలాక్సీ ఏ56 లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు. అంటే, మార్చిలో విడుదల ఉంటుందని భావించవచ్చు.

Samsung Galaxy A56 స్పెసిఫికేషన్స్ (లీక్)

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ ఎగ్జినోస్ 1580 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాసెసర్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఈ చిప్సెట్, స్నాప్‌డ్రాగన్ 888 కి సమానమైన స్కోర్ చేసింది. గ్రాఫిక్స్ విషయానికి వస్తే, ఎక్స్‌క్లిప్స్ 540 జీపీయూని ఈ చిప్సెట్ తో జత చేయనున్నారు. ఇప్పటికి స్పెసిఫికేషన్స్ గురించి తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చు.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A56: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఏ56 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-5g-details-leaked-before-launch/feed/ 0