Samsung Galaxy F04s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Oct 2022 10:41:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F04s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f04s-is-expected-to-launch-soon/ Wed, 26 Oct 2022 10:41:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=3072 హైలైట్స్ ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న శాంసంగ్ త్వరలో మార్కెట్ లోకి Samsung Galaxy F04s ఎంట్రీ ఇచ్చే అవకాశం లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న Samsung Galaxy F04s ఎఫ్-సిరీస్ లో త్వరలో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని శాంసంగ్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ ఫోన్ పేరు Samsung Galaxy F04s. ఈ తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లో […]

The post త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F04s first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న శాంసంగ్
  • త్వరలో మార్కెట్ లోకి Samsung Galaxy F04s ఎంట్రీ ఇచ్చే అవకాశం
  • లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న Samsung Galaxy F04s

ఎఫ్-సిరీస్ లో త్వరలో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని శాంసంగ్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ ఫోన్ పేరు Samsung Galaxy F04s. ఈ తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లో లాంచ్ కానుంది. అయితే కొత్త ఫోన్ లాంచ్ కి సంబంధించిన అధికార సమాచారాన్ని శాంసంగ్ వెల్లడించలేదు. కానీ, లేటెస్ట్ లీక్ ద్వారా Samsung Galaxy F04s యొక్క ముఖ్యమైన వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

వై-ఫై అలయన్స్ వెబ్ సైట్ పై తొలిసారిగా Samsung Galaxy F04s స్మార్ట్ ఫోన్ కనిపించింది. ఈ విషయాన్ని తొలుత PriceBaba గుర్తించింది. ఈ సమాచారం ప్రకారం, Samsung Galaxy F04s డివైజ్ SM-E045F/DS అనే మోడల్ నంబర్ తో WiFi alliance సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో కనిపించింది. Samsung Galaxy F04s స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 2.4 గిగాహెర్ట్జ్ వైఫై సపోర్ట్ తో లాంచ్ అవుతుందని సమాచారం.

Samsung Galaxy F04s కి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ గెలాక్సీ ఎఫ్04ఎస్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి అది నిజమో కాదో తెలియదు. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Samsung Galaxy A04s

ఇటీవలె ఫిన్‌ల్యాండ్ లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A04s గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. Samsung Galaxy A04s స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కోర్ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. Samsung Galaxy A04s స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. Samsung Galaxy A04s ఒక డ్యూయల్ సిమ్ ఫోన్ మరియు ఇది 4జీ ఎల్టీఈ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Samsung Galaxy A04s కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F04s first appeared on 91Mobiles Telugu.

]]>