Samsung Galaxy F05 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 18 Sep 2024 04:31:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy F05: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన శాంసంగ్ ఫోన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-launched-india-50mp-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-launched-india-50mp-camera-5000mah-battery/#respond Wed, 18 Sep 2024 04:31:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13560 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy F05 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung […]

The post Samsung Galaxy F05: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన శాంసంగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Samsung Galaxy F05 విడుదల
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 50ఎంపి కెమెరా, 5000mAh బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy F05 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy F05 ధర, సేల్ వివరాలు

Samsung Galaxy F05 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.7,999 గా నిర్ణయించారు.

ఈ ఫోన్ ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా సెప్టెంబర్ 20 నుంచి ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy F05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్ ఉంది. భారీ డిస్ప్లేను ఇష్టపడే వారికి ఇది బాగా సరిపోతుంది.

ప్రాసెసర్: Samsung Galaxy F05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఇచ్చారు. మల్టీ-టాస్కింగ్, యాప్ నేవిగేషన్ కి ఇది బాగా సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F05 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌ప్యాండ్ చేసుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy F05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy F05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy F05 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. రెండేళ్ళు ఓఎస్ అప్‌గ్రేడ్స్ మరియు 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Samsung Galaxy F05 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy F05 లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.

The post Samsung Galaxy F05: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన శాంసంగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-launched-india-50mp-camera-5000mah-battery/feed/ 0
Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/#respond Thu, 11 Jul 2024 17:58:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12475 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎఫ్, ఎమ్ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, Galaxy F05, Galaxy M05, Galaxy M55s స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ మూడు ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy F05, M05, M55s వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వివరాలు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై SM-E055F అనే మోడల్ […]

The post Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గెలాక్సీ F05, M05, M55s లాంచ్
  • వై-ఫై అలయన్స్‌పై లిస్టైన డివైజెస్
  • త్వరలో వెల్లడి కానున్న లాంచ్ తేదీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎఫ్, ఎమ్ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, Galaxy F05, Galaxy M05, Galaxy M55s స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ మూడు ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F05, M05, M55s వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వివరాలు

వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై SM-E055F అనే మోడల్ నంబర్ తో శాంసంగ్ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీన్ని గెలాక్సీ ఎఫ్05 అని భావిస్తున్నారు.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉన్నాయి.

మరో రెండు ఫోన్లు SM-M055F/DS, SM-M558B/DS అనే మోడల్ నంబర్లతో వై-ఫై అలయన్స్ ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్లు గెలాక్సీ ఎమ్05 మరియు గెలాక్సీ ఎమ్55ఎస్ అని సమాచారం.

రానున్న రోజుల్లో ఈ మూడు ఫోన్లకు సంబంధించిన మరింత సమాచారం రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/feed/ 0