Samsung Galaxy M05 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 12 Sep 2024 12:25:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy M05: 50ఎంపి కెమెరాతో లాంచైన గెలాక్సీ ఎమ్05 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m05-launched-in-india-with-50mp-camera/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m05-launched-in-india-with-50mp-camera/#respond Thu, 12 Sep 2024 12:25:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13461 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M05 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్ వంటి ఫీచర్లు అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Samsung Galaxy M05 […]

The post Samsung Galaxy M05: 50ఎంపి కెమెరాతో లాంచైన గెలాక్సీ ఎమ్05 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Samsung Galaxy M05 విడుదల
  • 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M05 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్ వంటి ఫీచర్లు అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy M05 ధర, లభ్యత

Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.7,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మింట్ గ్రీన్ కలర్ లో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. అలాగే శాంసంగ్.కామ్ మరియు ఎంపిక చేయబడిన రిటైల్ స్టోర్స్ లో కూడా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:0 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.

చిప్సెట్: Samsung Galaxy M05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా ఇదే చిప్సెట్ వాడతారు. పెర్ఫామెన్స్ కూడా స్మూథ్ గా ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M05 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy M05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M05 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M05 లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.

The post Samsung Galaxy M05: 50ఎంపి కెమెరాతో లాంచైన గెలాక్సీ ఎమ్05 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m05-launched-in-india-with-50mp-camera/feed/ 0
Samsung Galaxy M05: త్వరలో గెలాక్సీ ఎమ్05 లాంచ్, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m05-support-page-listed-on-samsung-official-website-could-launch-soon/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m05-support-page-listed-on-samsung-official-website-could-launch-soon/#respond Tue, 03 Sep 2024 06:08:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=13310 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M05 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ, శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. అయితే స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు. Samsung Galaxy M05 ఇండియా సపోర్ట్ పేజీ Samsung Galaxy M05 సపోర్ట్ […]

The post Samsung Galaxy M05: త్వరలో గెలాక్సీ ఎమ్05 లాంచ్, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M05 విడుదల
  • ఇంకా వెల్లడి కానీ లాంచ్ తేదీ వివరాలు
  • ఇప్పటికే బీఐఎస్ పై లిస్టైన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M05 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ, శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. అయితే స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

Samsung Galaxy M05 ఇండియా సపోర్ట్ పేజీ

Samsung Galaxy M05 సపోర్ట్ పేజీ ద్వారా మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ SM-M055F/DS అనే మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. అయితే, స్పెసిఫికేషన్స్ ఏమీ బయటకు రాలేదు. కానీ, త్వరలోనే అఫీషియల్ లాంచ్ ఉంటుందని ఈ సపోర్ట్ పేజీతో అర్థమవుతోంది. గెలాక్సీ ఎమ్04 కి సక్సెసర్ గా Samsung Galaxy M05 ఎంట్రీ ఇవ్వబోతోంది.

Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. ఇంకా వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది.

బీఐఎస్ ద్వారా డ్యూయల్ సిమ్ సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యింది. వై-ఫై అలయన్స్ ద్వారా 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై సపోర్ట్ ఫీచర్స్ రివీల్ అయ్యాయి. రెండు లిస్టింగ్స్ ద్వారా తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. శాంసంగ్ నుంచి త్వరలో లాంచ్ మరియు స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన అధికార ప్రకటన రావొచ్చు.

The post Samsung Galaxy M05: త్వరలో గెలాక్సీ ఎమ్05 లాంచ్, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m05-support-page-listed-on-samsung-official-website-could-launch-soon/feed/ 0
Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/#respond Thu, 11 Jul 2024 17:58:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12475 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎఫ్, ఎమ్ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, Galaxy F05, Galaxy M05, Galaxy M55s స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ మూడు ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy F05, M05, M55s వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వివరాలు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై SM-E055F అనే మోడల్ […]

The post Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గెలాక్సీ F05, M05, M55s లాంచ్
  • వై-ఫై అలయన్స్‌పై లిస్టైన డివైజెస్
  • త్వరలో వెల్లడి కానున్న లాంచ్ తేదీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎఫ్, ఎమ్ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, Galaxy F05, Galaxy M05, Galaxy M55s స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ మూడు ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F05, M05, M55s వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వివరాలు

వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై SM-E055F అనే మోడల్ నంబర్ తో శాంసంగ్ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీన్ని గెలాక్సీ ఎఫ్05 అని భావిస్తున్నారు.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉన్నాయి.

మరో రెండు ఫోన్లు SM-M055F/DS, SM-M558B/DS అనే మోడల్ నంబర్లతో వై-ఫై అలయన్స్ ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్లు గెలాక్సీ ఎమ్05 మరియు గెలాక్సీ ఎమ్55ఎస్ అని సమాచారం.

రానున్న రోజుల్లో ఈ మూడు ఫోన్లకు సంబంధించిన మరింత సమాచారం రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/feed/ 0