Samsung Galaxy M54 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 17 Oct 2022 11:35:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 888 తో రానున్న Samsung Galaxy M54: లీకైన ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m54-specs-leaked-before-launch/ Mon, 17 Oct 2022 11:35:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2923 హైలైట్స్ కొత్త గెలాక్సీ ఎమ్-సిరీస్ మిడ్ రేంజ్ ఫోన్ పై శాంసంగ్ పని చేస్తుందని వినిపిస్తోన్న రూమర్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy M54 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్న Samsung Galaxy M54 ఓ కొత్త మిండ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ పై ప్రస్తుతం శాంసంగ్ పని చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ ఫోనే Samsung Galaxy M54. ఈ ఏడాది మొదట్లో విడుదలైన Samsung […]

The post Snapdragon 888 తో రానున్న Samsung Galaxy M54: లీకైన ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • కొత్త గెలాక్సీ ఎమ్-సిరీస్ మిడ్ రేంజ్ ఫోన్ పై శాంసంగ్ పని చేస్తుందని వినిపిస్తోన్న రూమర్లు
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy M54
  • 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్న Samsung Galaxy M54

ఓ కొత్త మిండ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ పై ప్రస్తుతం శాంసంగ్ పని చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ ఫోనే Samsung Galaxy M54. ఈ ఏడాది మొదట్లో విడుదలైన Samsung Galaxy M53 కి సక్సెసర్ గా వస్తోంది Samsung Galaxy M54. లేటెస్ట్ గా ఓ రిపోర్ట్ ద్వారా Samsung Galaxy M54 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలిసింది. దీంతో ఎమ్54 పై ఓ ఐడియా వచ్చినట్లైంది.

The Pixel అనే పేరుతో నడుస్తున్న ఓ యూట్యూబ్ చానల్ చెబుతున్న దాన్ని బట్టి, Samsung Galaxy M54 ఫ్లాగ్షిప్ లెవెల్ స్నాప్ డ్రాగన్ 800-సిరీస్ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే, ఎమ్53 మాదిరే ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇంటర్నల్ చేంజెస్ ఉంటాయి. Samsung Galaxy M54 5జీ డివైజ్ 2023 ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy M54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy M54 5జీ డివైజ్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఎమ్53 మాదిరిగా, Samsung Galaxy M54 కూడా హోల్-పంచ్ డిస్ప్లే ని కలిగి ఉండనుంది. Samsung Galaxy M54 స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తున్నట్లు సమాచారం. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉండనుంది.

Samsung Galaxy M54 స్మార్ట్ ఫోన్ 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చే అవకాశం ఉందని టిప్‌స్టర్ అంచనా వేశాడు. అలాగే ఇందులో 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Samsung Galaxy M54 లో 32 మెగా పిక్సెల్ సెన్సర్ ఉండనుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది.

Samsung Galaxy M54 5G ధర, లభ్యత

లీక్ ద్వారా Samsung Galaxy M54 యొక్క వియత్నాం ప్రైస్ బయటకు వచ్చింది. 10 మిలియన్ వియత్నామీస్ డాలర్స్ తో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. అంటే భారత కరెన్సీలో రూ.33,900. అయితే ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ పై ఇంకా ఏ విషయం తెలియదు. భారత మార్కెట్ శాంసంగ్ కి ఎంతో కీలకమన్న సంగతి తెలిసిందే. అలాగే భారత్ లో Samsung Galaxy M54 ధర కూడా మారే అవకాశం ఉంది.

భారత్ లో గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంది. దీంతో శాంసంగ్ తన అన్ని ఎమ్-సిరీస్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో Samsung Galaxy M53 స్మార్ట్ ఫోన్ ని రూ.26,999 ధరతో భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. కంపెనీ విధానాలను బట్టి, Samsung Galaxy M54 ని భారత్ లో లాంచ్ చేసే చాన్స్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 888 తో రానున్న Samsung Galaxy M54: లీకైన ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>