Samsung Galaxy S23 FE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Jul 2023 04:37:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Samsung Galaxy S23 FE https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-spotted-3c-certification-website/ Mon, 03 Jul 2023 04:37:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=7022 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే శాంసంగ్ కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఈలోపు Samsung Galaxy S23 FE ఫస్ట్ లుక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. తాజాగా, Samsung Galaxy S23 FE డివైజ్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఈ […]

The post 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE
  • 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే శాంసంగ్ కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఈలోపు Samsung Galaxy S23 FE ఫస్ట్ లుక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. తాజాగా, Samsung Galaxy S23 FE డివైజ్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ పై కాస్త క్లారిటీ వచ్చినట్లైంది. సరే, ఓసారి Samsung Galaxy S23 FE డివైజ్ సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిన Samsung Galaxy S23 FE

చైనాలో లాంచ్ అవ్వబోయే ప్రతీ ఉత్పత్తి కూడా చైనా కంపల్సరీ సర్టిఫికెట్ లేదా 3సీ ని పొందాల్సి ఉంటుంది. తాజాగా ఈ 3సీ లిస్టింగ్ Samsung Galaxy S23 FE యొక్క మోడల్ నంబర్ SM-S7110 ని రివీల్ చేసింది. ఈ లిస్ట్ ద్వారా Samsung Galaxy S23 FE డివైజ్ 5జీ కనెక్టివిటీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని స్పష్టమైంది.

Samsung Galaxy S23 FE డిజైన్

Samsung Galaxy S23 FE డివైజ్ కి సంబంధించినవేనంటూ బయటకు వచ్చిన రెండర్స్ ద్వారా ఫోన్ ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. దాని ప్రకారం, Samsung Galaxy S23 FE లో పంచ్-హోల్ డిస్ప్లే టాప్ సెంటర్ లో కనిపించింది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ ట్రే సెక్షన్, ప్రైమరీ మైక్రోఫోన్ బాటమ్ ప్యానెల్ లో ఉన్నాయి.

Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెన్సర్స్ ని నిలువుగా ప్లేస్ చేశారు. Samsung Galaxy S23 FE డివైజ్ వైట్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉండవచ్చని అంతా భావిస్తున్నారు.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>