Samsung Galaxy S25 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 11 Sep 2024 05:44:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy S25 Ultra: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s25-ultra-renders-leaked/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s25-ultra-renders-leaked/#respond Wed, 11 Sep 2024 05:44:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=13429 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ గెలాక్సీ ఎస్25 ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా, Samsung Galaxy S25 Ultra యొక్క రెండర్స్ లీక్ అయ్యాయి. దీంతో డివైజ్ యొక్క డిజైన్ తీరుతెన్నులు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy S25 Ultra రెండర్స్ (లీక్) ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ మరియు టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ సంయుక్తంగా Samsung […]

The post Samsung Galaxy S25 Ultra: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గెలాక్సీ ఎస్25 సిరీస్ విడుదల
  • తాజాగా లీకైన ఎస్25 అల్ట్రా రెండర్స్
  • 5 కెమెరాలతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ గెలాక్సీ ఎస్25 ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా, Samsung Galaxy S25 Ultra యొక్క రెండర్స్ లీక్ అయ్యాయి. దీంతో డివైజ్ యొక్క డిజైన్ తీరుతెన్నులు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S25 Ultra రెండర్స్ (లీక్)

ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ మరియు టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ సంయుక్తంగా Samsung Galaxy S25 Ultra యొక్క ఫస్ట్ డిజైన్ రెండర్స్ ను రివీల్ చేశఆరు.

రెండర్ ఫోటోలను గమనిస్తే, డిజైన్ విషయంలో భారీ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ డిజైన్ ను మీరు రెండర్స్ లో గమనించవచ్చు. అదే ఎస్24 అల్ట్రాలో రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి.

Samsung Galaxy S25 Ultra 162.8 మి.మీ పొడవు, 77.6 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం ఉంటుందని సమాచారం. బరువు విషయానికి వస్తే, 219 గ్రాములు ఉంటుందని తెలుస్తోంది. అంటే ఎస్24 అల్ట్రాతో పోల్చితే ఇది 13 గ్రాములు తక్కువ.

Samsung Galaxy S25 Ultra బ్యాక్ ప్యానెల్ పై 5 కెమెరాలు, ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటాయి. బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ ఉంది.

Samsung Galaxy S25 Ultra డివైజ్ గతంలో లాగే 6.8-ఇంచ్ డిస్ప్లే, పంచ్ హోల్ నాచ్ తో వస్తోంది.

Samsung Galaxy S25 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy S25 Ultra లో 6.8-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది.

ప్రాసెసర్: Samsung Galaxy S25 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. అక్టోబర్ నెలలో ఈ చిప్సెట్ లాంచ్ అవుతోంది.

కెమెరా: Samsung Galaxy S25 Ultra లో 200ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి 3ఎక్స్ లెన్స్, 50ఎంపి 5ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S25 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S25 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 7 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S25 Ultra డివైజ్ ఎన్నో ఏఐ ఫీచర్లతో లాంచ్ అవుతుందని సమాచారం.

The post Samsung Galaxy S25 Ultra: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s25-ultra-renders-leaked/feed/ 0