Samsung Galaxy Unpacked - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Jun 2024 10:56:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Galaxy Unpacked: వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-july-2024/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-july-2024/#respond Wed, 26 Jun 2024 10:46:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=12228 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన Galaxy Unpacked ఈవెంట్‌ని వచ్చే నెలలో నిర్వహించనుంది. ఈవెంట్ లో పలు ఉత్పత్తులను శాంసంగ్ లాంచ్ చేయనుంది. లాంచ్ అయ్యే వాటిలో Galaxy Z Fold 6, Galaxy Z Flip 6, Galaxy Ring, Galaxy Watch Ultra, Galaxy Watch 7 సిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈవెంట్ లో Galaxy AI కూడా ఆకర్షణగా నిలవనుంది. కొత్త ఏఐ ఫీచర్లను శాంసంగ్ సంస్థ ప్రవేశపెట్టనుందని సమాచారం. […]

The post Galaxy Unpacked: వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులైలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
  • లాంచ్ కానున్న ఫోల్డబుల్ ఫోన్స్
  • ఎంట్రీ ఇవ్వనున్న Z Fold 6, Flip 6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన Galaxy Unpacked ఈవెంట్‌ని వచ్చే నెలలో నిర్వహించనుంది. ఈవెంట్ లో పలు ఉత్పత్తులను శాంసంగ్ లాంచ్ చేయనుంది. లాంచ్ అయ్యే వాటిలో Galaxy Z Fold 6, Galaxy Z Flip 6, Galaxy Ring, Galaxy Watch Ultra, Galaxy Watch 7 సిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈవెంట్ లో Galaxy AI కూడా ఆకర్షణగా నిలవనుంది. కొత్త ఏఐ ఫీచర్లను శాంసంగ్ సంస్థ ప్రవేశపెట్టనుందని సమాచారం.

Samsung Galaxy Unpacked ఈవెంట్ వివరాలు

Samsung Galaxy Unpacked ఈవెంట్ జులై 10వ తేదీన ప్యారిస్ నగరంలో జరుగుతుంది. ఈవెంట్ లో గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. Galaxy Z Fold 6, Z Flip 6 డివైజెస్ జులై 10న లాంచ్ కానున్నాయని కంపెనీ వెల్లడించింది.

Samsung Galaxy Unpacked ఈవెంట్‌ ప్రత్యక్షప్రసారాన్ని చూడాలనుకునే వారు జులై 10 సాయంత్రం 6.30 గంటలకు శాంసంగ్.కామ్, శాంసంగ్ న్యూస్‌రూమ్ మరియు శాంసంగ్ యొక్క యూట్యూబ్ చానల్ ద్వారా చూడవచ్చు.

Samsung Galaxy Z Flip 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy Z Flip 6 డివైజ్ భారీ కవర్ డిస్ప్లే, ఇన్నర్ స్క్రీన్ తో రానున్నట్లు సమాచారం. కవర్ స్క్రీన్ సైజ్ 3.9-ఇంచెస్ గా ఉంటుందని అంచనా.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 6 డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 128జిబి/256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy Z Flip 6 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy Z Flip 6 లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

ఓఎస్: Samsung Galaxy Z Flip 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని కూడా అందించనున్నారు.

The post Galaxy Unpacked: వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-july-2024/feed/ 0
జులై 26 న జరగనున్న Samsung Galaxy Unpacked ఈవెంట్; లాంచ్ కానున్న Galaxy Z Fold 5, Flip 5 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-launch-date-july-26th-fold-5-flip-5-might-launch/ Thu, 06 Jul 2023 16:09:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=7103 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తన తదుపరి Galaxy Unpacked ఈవెంట్ లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ ఈవెంట్ లో శాంసంగ్ సంస్థ Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. సరే, ఓసారి శాంసంగ్ నిర్వహించబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy Unpacked ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్ జులై […]

The post జులై 26 న జరగనున్న Samsung Galaxy Unpacked ఈవెంట్; లాంచ్ కానున్న Galaxy Z Fold 5, Flip 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తొలిసారిగా సియోల్ లో జరుగుతోన్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
  • ఈవెంట్ లో Galaxy Z Fold 5, Flip 5 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • భారత్ లో అందుబాటులోకి వచ్చిన ప్రీ-రిజర్వ్ పోర్టల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తన తదుపరి Galaxy Unpacked ఈవెంట్ లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ ఈవెంట్ లో శాంసంగ్ సంస్థ Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. సరే, ఓసారి శాంసంగ్ నిర్వహించబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Unpacked ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్

జులై 26 వ తేదీన రాత్రి 7 గంటలకు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరగనుంది. శాంసంగ్ వెబ్ సైట్ మరియు యూట్యూబ్ చానల్ ద్వారా ఈ ఈవెంట్ ని చూడవచ్చు. ప్రత్యక్షప్రసారం కానున్న ఈవెంట్ లో శాంసంగ్ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. కంపెనీ ఇప్పటికే భారత్ లో ప్రీ-రిజర్వ్ సెషన్ ని ప్రారంభించింది.

జులైలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుందని శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఏడాది శాంసంగ్ నుంచి ఇది రెండవ అన్‌ప్యాక్డ్ ఈవెంట్. ఫిబ్రవరిలో శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన మొదటి ఈవెంట్ లో Galaxy S23, Book 3 సిరీస్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. కానీ, ఈసారి కంపెనీ స్వదేశంలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది.

Samsung India వెబ్‌సైట్ లో మొదలైన ప్రీ-రిజర్వ్ సెషన్

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇతర ప్రొడక్ట్స్ విషయానికి వస్తే, Galaxy Tab S9, Tab S9 Plus, Tab S9 Ultra ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ సంస్థ భారత్ లో ప్రీ-రిజర్వేషన్స్ ప్రారంభించింది. రూ.1,999 విలువగల రిఫండబుల్ ప్రీ-రిజర్వ్ పాస్ ని కొనుగోలు చేయవచ్చు. దీని వల్లన మొదటగా కొత్త గెలాక్సీ డివైజెస్ ని దక్కించుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాదు, రూ.5,000 ఈ-వోచర్ ని శాంసంగ్ ఆన్‌లైన్ షాప్ లో ఉపయోగించుకోవచ్చు.

The post జులై 26 న జరగనున్న Samsung Galaxy Unpacked ఈవెంట్; లాంచ్ కానున్న Galaxy Z Fold 5, Flip 5 first appeared on 91Mobiles Telugu.

]]>