Samsung Galaxy Watch Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jul 2024 18:02:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung: భారత్‌లో లాంచైన Galaxy Watch 7, Watch Ultra, Buds 3, 3 Pro https://www.91mobiles.com/telugu/samsung-watch-7-watch-ultra-buds-3-buds-3-pro-galaxy-ring-launched-india/ https://www.91mobiles.com/telugu/samsung-watch-7-watch-ultra-buds-3-buds-3-pro-galaxy-ring-launched-india/#respond Wed, 10 Jul 2024 18:02:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=12454 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్ లో గెలాక్సీ ఫోల్డ్ 6, ఫ్లిప్ 6, వాచ్ 7, వాచ్ అల్ట్రా, బడ్స్ 3, బడ్స్ 3 ప్రో డివైజెస్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ వాచ్ అల్ట్రా టైటానియమ్ గ్రేడ్ 4 ఫ్రేమ్, 10ఏటీఎమ్ వాటర్ రెసిస్టన్స్ తో వచ్చింది. ఓసారి ఈ వాచ్ 7, వాచ్ 7 అల్ట్రా, బడ్స్ 3, బడ్స్ 3 ప్రో డివైజెస్ యొక్క ఫీచర్స్, […]

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy Watch 7, Watch Ultra, Buds 3, 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్ లో గెలాక్సీ ఫోల్డ్ 6, ఫ్లిప్ 6, వాచ్ 7, వాచ్ అల్ట్రా, బడ్స్ 3, బడ్స్ 3 ప్రో డివైజెస్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ వాచ్ అల్ట్రా టైటానియమ్ గ్రేడ్ 4 ఫ్రేమ్, 10ఏటీఎమ్ వాటర్ రెసిస్టన్స్ తో వచ్చింది. ఓసారి ఈ వాచ్ 7, వాచ్ 7 అల్ట్రా, బడ్స్ 3, బడ్స్ 3 ప్రో డివైజెస్ యొక్క ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy Buds 3, Buds 3 Pro ఫీచర్స్, ధరలు

Samsung Galaxy Buds 3, Buds 3 Pro మెరుగైన టూ-వే సౌండ్ ఫీచర్ తో వచ్చాయి. 1-వే సౌండ్ కోసం 1ఎంఎం డైనమిక్ డ్రైవర్స్, 2-వే సౌండ్ కోసం 10.5ఎంఎం + 6.1ఎంఎం ప్లానర్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇవి 24-బిట్ హైఫై ఆడియో, డైరెక్ట్ మల్టీ చానల్స్ తో కూడిన 360 ఆడియో వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ కోసం 3 మైక్రోఫోన్ సెటప్ ఉంది. సౌండ్‌ని కనిపెట్టేందుకు వాయిస్ పికప్ యూనిట్ కూడా ఉంది.

గెలాక్సీ బడ్స్ 3, బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్.. బ్లూటూత్ 5.4, ఎస్ఎస్‌సీ, ఎస్ఎస్‌సీ యూహెచ్‌క్యూ, ఎస్‌బీసీ, ఏఏషీ కొడెక్స్ మరియు ఐపీ57 రేటింగ్ తో వచ్చాయి.

Samsung Galaxy Buds 3 ధరను రూ.14,999 గా నిర్ణయించారు. Buds 3 Pro ధర రూ.19,999 గా ఉంది.

Samsung Galaxy Watch 7, Galaxy Watch Ultra ఫీచర్స్

శాంసంగ్ సంస్థ తీసుకొచ్చిన గెలాక్సీ వాచ్ అల్ట్రా, ఆపిల్ వాచ్ అల్ట్రా తో పోటీ పడనుంది. ఈ గెలాక్సీ వాచ్ సిరీస్ ఈసారి సరికొత్త కుషన్ డిజైన్ తో వచ్చింది. దీని వల్లన భద్రత మెరుగవుతుంది.

గెలాక్సీ వాచ్ అల్ట్రా లో టైటానియమ్ గ్రేడ్ 4 ఫ్రేమ్, 10ఏటీఎమ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి. వాచ్ అల్ట్రాలో డెడికేటెడ్ క్విక్ బటన్ ఉంది. దీని ద్వారా వర్కవుట్స్, మ్యాప్స్ తదితర వాటిని కంట్రోల్ చేయవచ్చు. సేఫ్టీ కోసం ఇది ఎమర్జెన్సీ సైరన్ తో వచ్చింది.

వాచ్ అల్ట్రా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. పవర్ సేవింగ్ మోడ్ పై 100 గంటలు, ఎక్సర్‌సైజ్ పవర్ సేవింగ్ మోడ్ లో 48 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. గెలాక్సీ వాచ్ అల్ట్రా 47ఎంఎం సైజ్ లో లభిస్తుంది. టైటానియమ్ గ్రే, టైటానియమ్ వైట్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో గెలాక్సీ వాచ్ అల్ట్రా లభిస్తుంది.

Samsung Galaxy Watch 7 40ఎంఎం మరియు 44 ఎంఎం స్ట్రాప్ సైజెస్ లో లభిస్తుంది. సర్క్యులర్ డిజైన్, 100 వర్కవుట్ మోడ్స్, బాడీ కంపోజిషన్ వంటి ఫీచర్లు ఈ వాచ్ లో ఉన్నాయి.

గెలాక్సీ వాచ్ 7 లో స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, ఈసీజీ, బీపీ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

గెలాక్సీ వాచ్ 7 లో డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా లొకేషన్‌ను మరింత కచ్చితంగా ట్రాక్ చేసే వీలుంటుంది.

గెలాక్సీ వాచ్ 7 40ఎంఎం మోడల్ గ్రీన్ మరియు క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. గెలాక్సీ వాచ్ 7 44ఎంఎం మోడల్ గ్రీన్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy Watch 7, Watch Ultra ధరలు

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 40ఎంఎం బ్లూటూత్ మోడల్ ధర రూ.29,999 గా ఉంది. 40ఎంఎం ఎల్టీఈ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. 44ఎంఎం బ్లూటూత్ మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 44ఎంఎం ఎల్టీఈ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 47ఎంఎం మోడల్ ధరను రూ.59,999 గా నిర్ణయించారు.

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy Watch 7, Watch Ultra, Buds 3, 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-watch-7-watch-ultra-buds-3-buds-3-pro-galaxy-ring-launched-india/feed/ 0