Samsung Galaxy Z Flip 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 25 Nov 2022 11:45:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Black Friday Sale: Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/black-friday-sale-price-cut-on-samsung-galaxy-z-flip-3-discount-value-rs-36000/ Fri, 25 Nov 2022 11:36:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=3676 హైలైట్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా పలు ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్ Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న బ్లాక్ ఫ్రైడే వచ్చేసింది. ఈ షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా, శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, […]

The post Black Friday Sale: Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా పలు ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్
  • గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్
  • Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న బ్లాక్ ఫ్రైడే వచ్చేసింది. ఈ షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా, శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్ పై శాంసంగ్ భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. ప్రీమియమ్ గెలాక్సీ ఎస్22 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లపై మాంచి డీల్స్ వచ్చేశాయి. ఈ డీల్స్ లో Samsung Galaxy Z Flip 3 డీల్ ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ డివైజ్ పై శాంసంగ్ ఏకంగా రూ.36,000 డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో మరింత డిస్కౌంట్ ని పొందే అవకాశం ఉంది.

మరి ఈ ఫోన్ ని కొనచ్చంటారా? లాంచ్ అయి ఏడాది కావస్తున్నా ఈ ఫోన్ కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఆఫర్ లో అందుబాటు ధరలో లభ్యమవుతోంది. దీంతో జనాల కన్ను ఈ ఫోన్ పై పడింది. డిస్కౌంట్ పై మీరు ఈ ఫోన్ ని హ్యాపీగా కొనేయచ్చు. ఓసారి Samsung Galaxy Z Flip 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Samsung Galaxy Z Flip 3 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Z Flip 3 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ వాడారు. కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్ లో 12 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 12ఎంపి ప్రైమరీ కెమెరా, మరొకటి 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy Z Flip 3 లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. అయితే బ్యాటరీ సెగ్మెంట్ మైనస్ అనే చెప్పాలి. ఇంత తక్కువ కెపాసిటీ బ్యాటరీతో రోజంతా గడవడం కష్టమే. అయితే సాధారణ వాడుక పై సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు ఫోన్ పని చేసే అవకాశం ఉంది. ఏదేమైనా చార్జింగ్ పట్ల ఓ కన్నేసి ఉంచాల్సిందే.

Samsung Galaxy Z Flip 3 ధర తగ్గింపు

Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇదివరకు ఈ ఫోన్ ధర రూ.95,999 గా ఉంది. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా మీరు ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ని రూ.59,999 కే కొనుగోలు చేయవచ్చు.

అంతేకాదండోయ్, ఈ ఫోన్ ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎలా అంటే, మీరు ప్రస్తుతం వాడుతోన్న పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.25,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. మీ ఫోన్ యొక్క కండీషన్ ని బట్టి ఈ ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ నిర్ణయించబడుతుంది. ఒకవేళ మీరు పూర్తి ఎక్స్‌చేంజ్ మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో పొందితే అప్పుడు, Samsung Galaxy Z Flip 3 ఫోన్ ని కేవలం రూ.34,999 కే సొంతం చేసుకోవచ్చు. డీల్ అదిరిపోయింది కదూ.

బ్లాక్ ఫ్రైడే (Black Friday) అంటే ఏంటి?

అసలు ఈ బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది 1869 లో వచ్చిన కాన్సెప్ట్. ఆ సమయంలో ఉన్నట్లుండి ఒకేసారి బంగారం ధరలు అనూహ్యంగా పడిపోయాయి. దీంతో సెక్యూరిటీ మార్కెట్స్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిణామం యొక్క ప్రభావం అమెరికా (యూఎస్ఏ) పై తీవ్రంగా పడింది. అప్పుడు ఈ బ్లాక్ ఫ్రైడే అనే మాట వాడుకలోకి వచ్చింది. అయితే, ఆధునిక బ్లాక్ ఫ్రైడే సెలబ్రేషన్ అనేది దాదాపు 100 ఏళ్ళ క్రితం అమెరికా లోని ఫిలడెల్ఫియాలో మొదలైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Black Friday Sale: Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
సూపర్ డీల్: రూ.60,000 లోపు ధరలో Samsung Galaxy Z Flip 3 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-flip-3-price-drop-india-flipkart/ Sat, 08 Oct 2022 12:45:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=2805 హైలైట్స్: ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ లో రూ.60,000 కే లభిస్తోన్న Samsung Galaxy Z Flip 3 అక్టోబర్ 10 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త ధర స్నాప్ డ్రాగన్ 888 చిప్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన Samsung Galaxy Z Flip 3 పండుగ సీజన్లో శాంసంగ్ కంపెనీ, తన Samsung Galaxy Z సిరీస్ పై ఎగ్జైటింగ్ ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి […]

The post సూపర్ డీల్: రూ.60,000 లోపు ధరలో Samsung Galaxy Z Flip 3 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ లో రూ.60,000 కే లభిస్తోన్న Samsung Galaxy Z Flip 3
  • అక్టోబర్ 10 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త ధర
  • స్నాప్ డ్రాగన్ 888 చిప్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన Samsung Galaxy Z Flip 3

పండుగ సీజన్లో శాంసంగ్ కంపెనీ, తన Samsung Galaxy Z సిరీస్ పై ఎగ్జైటింగ్ ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ సందర్భంగా Samsung Galaxy Z Flip 3 ఎన్నడూ లేని విధంగా రూ.60,000 లోపు ధరలో లభించబోతుంది. ఇదే రీతిలో, Samsung Galaxy Z Fold 3 కూడా కూపన్ డిస్కౌంట్ తో కలిపి రూ.1,09,999 ధరకే  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అందుబాటులోకి వచ్చింది. ఇది సూపర్ డీల్ అని చెప్పవచ్చు. కనీవినీ ఎరుగని విధంగా ఈ ఫ్లాగ్షిప్స్ ధరలు ఈ స్థాయికి రావడం నిజంగా ఆశ్చర్యకరమే.

అక్టోబర్ 8 న అమెజాన్ లో ఫోల్డ్ 3 ధర ఎంతో రివీల్ అవుతుంది. అక్టోబర్ 10 న Samsung Galaxy Z Flip 3 ఫ్లిప్ కార్ట్ లో తగ్గిన ధరతో అందుబాటులోకి వస్తుంది. గతేడాది అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy Z Flip 3, Fold 3 ఫ్లాగ్షిప్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.

రూ.60,000 లోపు ధరలో Samsung Galaxy Z Flip 3

Flipkart Big Diwali Sale అక్టోబర్ 10 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ సేల్ సందర్భంగా Samsung Galaxy Z Flip 3 ఫోన్ రూ.60,000 లోపు ధరతో అందుబాటులోకి వస్తోంది. రూ.84,990 ధరతో ఈ ఫోన్ గతేడాది లాంచ్ అయ్యింది. క్లామ్‌షెల్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ సగానికి ఫోల్డ్ అవుతుంది. అలాగే ఇందులో డైనమిక్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది నిజంగా కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ అని చెప్పాలి.

Samsung Galaxy Z Flip 3 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే అమర్చారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 425 పీపీఐ, 2640*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1.9-ఇంచ్ సూపర్ అమోలెడ్ సెకండరీ డిస్ప్లే, 302 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో అమర్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 ఎల్ఈ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా డాల్బి అట్మాస్, యూఎస్బీ టైప్ సీ, ఐపీ68 రేటింగ్, 12ఎంపి ప్రైమరీ సెన్సర్, 12ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10ఎంపి కెమెరా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post సూపర్ డీల్: రూ.60,000 లోపు ధరలో Samsung Galaxy Z Flip 3 first appeared on 91Mobiles Telugu.

]]>