Samsung Galaxy Z Fold 6 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jul 2024 18:12:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung: భారత్‌లో లాంచైన Galaxy Z Fold 6, Galaxy Z Flip 6 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-fold-6-5g-z-flip-6-5g-launched-india/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-fold-6-5g-z-flip-6-5g-launched-india/#respond Wed, 10 Jul 2024 17:05:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=12450 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్ లో తన సరికొత్త ఫోల్డబుల్ సిరీస్ ను లాంచ్ చేసింది. లైనప్ లో Galaxy Z Fold 6 మరియు Galaxy Z Flip 6 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 రెండు మెమొరీ వేరియంట్స్ లో, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోల్డబుల్ ఫోన్ల యొక్క […]

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy Z Fold 6, Galaxy Z Flip 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్యారిస్ ఈవెంట్‌లో Z Fold 6, Z Flip 6 లాంచ్
  • భారత్‌లో Z Fold 6 ధర రూ.1,64,999
  • Samsung Galaxy Z Flip 6 ధర రూ.1,09,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్ లో తన సరికొత్త ఫోల్డబుల్ సిరీస్ ను లాంచ్ చేసింది. లైనప్ లో Galaxy Z Fold 6 మరియు Galaxy Z Flip 6 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 రెండు మెమొరీ వేరియంట్స్ లో, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోల్డబుల్ ఫోన్ల యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy Z Flip 6, Z Fold 6 ధరలు

Samsung Galaxy Z Flip 6 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.1,09,999 గా నిర్ణయించారు.

Samsung Galaxy Z Flip 6 12జిబి + 512జిబి వేరియంట్ ధరను రూ.1,21,999 గా పెట్టారు.

Samsung Galaxy Z Fold 6 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి బేస్ వేరియంట్ ధర రూ.1,64,999 గా ఉంది. 12జిబి+512జిబి మిడ్ వేరియంట్ ధర రూ.1,76,999 గా ఉంది. 12జిబి+1టిబి టాప్ మోడల్ ధరను రూ.2,00,999 గా నిర్ణయించారు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్ల యొక్క ప్రీ-ఆర్డర్స్ జులై 10వ తేదీ నుంచి శాంసంగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతాయి. ఈ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లకు గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ వాచ్ అల్ట్రా, మరియు గెలాక్సీ బడ్స్ 3 సిరీస్ పై 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాదు, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్ 6 ఫోన్లపై రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ లభిస్తుంది. మీరు ప్రస్తుతం వాడుతోన్న శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే అప్పుడు అప్‌గ్రేడ్ బోనస్ రూ.15,000 లభిస్తుంది.

జులై 24వ తేదీ నుంచి Samsung Galaxy Z Fold 6, Z Flip 6 ఫోన్లను శాంసంగ్.కామ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ పార్ట్నర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy Z Fold 6 స్పెసిఫికేషన్స్

ఇన్నర్ డిస్ప్లే: Samsung Galaxy Z Fold 6 లో 7.6-ఇంచ్ క్యూఎక్స్‌జీఏ+ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్యానెల్, 2160*1856 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

కవర్ స్క్రీన్: Samsung Galaxy Z Fold 6 లో 6.3-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్యానెల్, 2376*968 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy Z Fold 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy Z Fold 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Fold 6 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy Z Fold 6 లో 12ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి ఓఐఎస్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. 10ఎంపి కవర్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు. ఇంకా 4ఎంపి అండర్ డిస్ప్లే కెమెరా కూడా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy Z Fold 6 లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy Z Fold 6 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 6.3, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy Z Fold 6 లో ఐపీ48 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కార్ ఉన్నాయి.

Samsung Galaxy Flip 6 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy Flip 6 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్, ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 2640*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

కవర్ డిస్ప్లే: Samsung Galaxy Flip 6 లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 748*720 రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy Flip 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy Flip 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Flip 6 ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy Flip 6 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy Flip 6 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy Flip 6 డివైజ్ లో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ, జీపీఎస్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy Flip 6 లో ఐపీ48 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy Z Fold 6, Galaxy Z Flip 6 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-fold-6-5g-z-flip-6-5g-launched-india/feed/ 0
Galaxy Unpacked: వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-july-2024/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-july-2024/#respond Wed, 26 Jun 2024 10:46:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=12228 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన Galaxy Unpacked ఈవెంట్‌ని వచ్చే నెలలో నిర్వహించనుంది. ఈవెంట్ లో పలు ఉత్పత్తులను శాంసంగ్ లాంచ్ చేయనుంది. లాంచ్ అయ్యే వాటిలో Galaxy Z Fold 6, Galaxy Z Flip 6, Galaxy Ring, Galaxy Watch Ultra, Galaxy Watch 7 సిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈవెంట్ లో Galaxy AI కూడా ఆకర్షణగా నిలవనుంది. కొత్త ఏఐ ఫీచర్లను శాంసంగ్ సంస్థ ప్రవేశపెట్టనుందని సమాచారం. […]

The post Galaxy Unpacked: వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులైలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
  • లాంచ్ కానున్న ఫోల్డబుల్ ఫోన్స్
  • ఎంట్రీ ఇవ్వనున్న Z Fold 6, Flip 6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన Galaxy Unpacked ఈవెంట్‌ని వచ్చే నెలలో నిర్వహించనుంది. ఈవెంట్ లో పలు ఉత్పత్తులను శాంసంగ్ లాంచ్ చేయనుంది. లాంచ్ అయ్యే వాటిలో Galaxy Z Fold 6, Galaxy Z Flip 6, Galaxy Ring, Galaxy Watch Ultra, Galaxy Watch 7 సిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈవెంట్ లో Galaxy AI కూడా ఆకర్షణగా నిలవనుంది. కొత్త ఏఐ ఫీచర్లను శాంసంగ్ సంస్థ ప్రవేశపెట్టనుందని సమాచారం.

Samsung Galaxy Unpacked ఈవెంట్ వివరాలు

Samsung Galaxy Unpacked ఈవెంట్ జులై 10వ తేదీన ప్యారిస్ నగరంలో జరుగుతుంది. ఈవెంట్ లో గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. Galaxy Z Fold 6, Z Flip 6 డివైజెస్ జులై 10న లాంచ్ కానున్నాయని కంపెనీ వెల్లడించింది.

Samsung Galaxy Unpacked ఈవెంట్‌ ప్రత్యక్షప్రసారాన్ని చూడాలనుకునే వారు జులై 10 సాయంత్రం 6.30 గంటలకు శాంసంగ్.కామ్, శాంసంగ్ న్యూస్‌రూమ్ మరియు శాంసంగ్ యొక్క యూట్యూబ్ చానల్ ద్వారా చూడవచ్చు.

Samsung Galaxy Z Flip 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy Z Flip 6 డివైజ్ భారీ కవర్ డిస్ప్లే, ఇన్నర్ స్క్రీన్ తో రానున్నట్లు సమాచారం. కవర్ స్క్రీన్ సైజ్ 3.9-ఇంచెస్ గా ఉంటుందని అంచనా.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 6 డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 128జిబి/256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy Z Flip 6 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy Z Flip 6 లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

ఓఎస్: Samsung Galaxy Z Flip 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని కూడా అందించనున్నారు.

The post Galaxy Unpacked: వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-july-2024/feed/ 0