Siberia - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 30 Nov 2022 09:24:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 48,500 ఏళ్ళ నాటి జాంబీ వైరస్ (ZombieVirus) ని వెలికితీసిన శాస్త్రవేత్తలు; మానవాళి ముంగిట మరో మహమ్మారి? https://www.91mobiles.com/telugu/48500-years-old-zombie-virus-siberia-permafrost-another-possible-pandemic/ Wed, 30 Nov 2022 09:22:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3767 హైలైట్స్ రష్యాలోని సైబీరియన్ లేక్ లో 48,500 ఏళ్ళ నాటి వైరస్ గుర్తింపు ఇన్నేళ్ళ పాటు గడ్డ కట్టిన సరస్సులో కూరుకుపోయి ఉన్న Zombie వైరస్ సైబీరియాలోని పెర్మాఫ్రాస్ట్ నుంచి వైరస్ లను బయటకు తీసి పరీక్షించిన రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ లకు చెందిన శాస్త్రవేత్తల బృందం బయల్పడిన 13 రకాల జాంబీ వైరస్ లు. వీటిలో ఒకదాని పేరు: పండోరావైరస్ ఎడోమా మానవాళికి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. 48,500 ఏళ్ళ నాటి జాంబీ వైరస్ […]

The post 48,500 ఏళ్ళ నాటి జాంబీ వైరస్ (ZombieVirus) ని వెలికితీసిన శాస్త్రవేత్తలు; మానవాళి ముంగిట మరో మహమ్మారి? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రష్యాలోని సైబీరియన్ లేక్ లో 48,500 ఏళ్ళ నాటి వైరస్ గుర్తింపు
  • ఇన్నేళ్ళ పాటు గడ్డ కట్టిన సరస్సులో కూరుకుపోయి ఉన్న Zombie వైరస్
  • సైబీరియాలోని పెర్మాఫ్రాస్ట్ నుంచి వైరస్ లను బయటకు తీసి పరీక్షించిన రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ లకు చెందిన శాస్త్రవేత్తల బృందం
  • బయల్పడిన 13 రకాల జాంబీ వైరస్ లు. వీటిలో ఒకదాని పేరు: పండోరావైరస్ ఎడోమా

మానవాళికి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. 48,500 ఏళ్ళ నాటి జాంబీ వైరస్ లు బయటకు వచ్చాయి. సైబీరియాలోని ఒక గడ్డకట్టిన సరస్సు లోపలి పొరల్లో ఈ వైరస్ లను గుర్తించడం జరిగింది. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ వైరస్ లను వెలికితీసి, పరీక్షిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. మానవాళి ముంగిట మరొక మహమ్మారి దాపురించనుందా అని జనాలు చర్చిస్తున్నారు.

జాంబీ వైరస్ బయటపడటానికి భూమి వేడెక్కడమే కారణం?

గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) కారణంగా గ్లేసియర్లు కరుగుతుండటంతో ఎన్నో వేల ఏళ్ళుగా నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్ లు ఇప్పుడు మేల్కొంటున్నాయి. అంటే మన గోతిని మనమే తవ్వుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. భూతాపాన్ని తగ్గించగలిగితే మంచు కరగడాన్ని ఆపేయవచ్చు. అప్పుడు ఇలాంటి భయానక వైరస్ లు బయల్పడే అవకాశాలు చాలా తక్కువ.

తాజాగా కనుగొనబడిన 13 వైరస్ లు కూడా వేటికవే ఒక్కోరకం జన్యురూపాన్ని కలిగి ఉన్నాయి. పండోరావైరస్ ని యుకేచి అలాస్, యకూటియా, రష్యా ల్లో కనుగొనగా, మిగతా వాటిని మమ్మత్ (భారీ ప్రాచీన ఏనుగు) ఉన్ని, సైబీరియన్ తోడేలు ప్రేగులలో కనుగొన్నారు.

New York Post వెలువరించిన కథనం ప్రకారం, “ప్రాచీన కాలానికి చెందిన వైరస్ లు బయల్పడటం వల్లన వృక్ష, జంతు, మానవ జాతులకు వ్యాధులు సోకితే గనుక ఆ పరిస్థితులు ఊహించలేనంత భయానకంగా ఉంటాయి.”

జాంబీ వైరస్ లతో మరో మహమ్మారి పొంచి ఉందా?

జాంబీ వైరస్ లు మనుషులకు సోకే ప్రమాదం ఉందని, ఆ వైరస్ లకు అంత శక్తి ఉందని వీటిని వెలికి తీసిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇదేగనుక జరిగితే COVID-19 (కొవిడ్-19) లాంటి మహమ్మారులు రానున్న రోజుల్లో సాధారణమై పోతాయని వారన్నారు.

ఇంకా కనిపెట్టబడని ఎన్నో వైరస్ లు, సూక్ష్మజీవులు లక్షల ఏళ్ళుగా గ్లేసియర్లలో గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. మంచు కరుగుతున్న కొద్దీ ఈ వైరస్ లు, సూక్ష్మ క్రిములు భూమిపైకి చేరుతుంటాయి. ఇలా బయటకు వచ్చిన వైరస్ లపై ఒక్కసారిగా సూర్యకాంతి, గాలి తగిలితే మళ్ళీ ఇవి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అంతే తమ సంతతిని వేగంగా పెంచుకుంటూ వెళ్తాయి. ఇట్టి పరిస్థితుల్లో, ఈ పురాతన వైరస్ లు, సూక్ష్మజీవులు ప్రపంచం నలుమూలలకు అవలీలగా చేరిపోతాయరు. అప్పుడు మరొక మహమ్మారి రావడం ఖాయం. అందుకే ముందే జాగ్రత్త పడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 48,500 ఏళ్ళ నాటి జాంబీ వైరస్ (ZombieVirus) ని వెలికితీసిన శాస్త్రవేత్తలు; మానవాళి ముంగిట మరో మహమ్మారి? first appeared on 91Mobiles Telugu.

]]>