Smartphones - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 05 Apr 2024 16:03:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s https://www.91mobiles.com/telugu/vivo-x100s-received-miit-certification/ Fri, 05 Apr 2024 16:03:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=10950 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్ […]

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X100s లాంచ్
  • MIIT సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డైమెన్సిటీ 9300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్

Vivo X100s డివైజ్ ఎంఐఐటీ వెబ్‌సైట్ పై V2359A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గతంలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. 3సీ ద్వారా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్స్ గమనిస్తే, త్వరలోనే చైనాలో లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo X100s స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X100s లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 జీపీయూ ఉంటాయి.
  • ఓఎస్: Vivo X100s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ర్యామ్: Vivo X100s డివైజ్ 16జిబి ర్యామ్ తో లాంచ్ అవుతుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo X100s డిజైన్, కలర్స్

త్వరలో లాంచ్ కాబోయే Vivo X100s డివైజ్ విభిన్నమైన డిజైన్ తో వచ్చే అవకాశం ఉంది. వివో ఎక్స్100 సిరీస్ కర్వ్డ్ డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంటుంది. కానీ, Vivo X100s డివైజ్ మాత్రం ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది.

Vivo X100s డివైజ్ వైట్, గ్రీన్, బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో రానుందని సమాచారం.

ఇటీవలె వివో ఎక్స్100ఎస్ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో కనిపించింది.

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు https://www.91mobiles.com/telugu/108mp-camera-phones-under-rs-20-thousand-rupees-budget/ Thu, 20 Jul 2023 14:16:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7264 ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనైనా ఫోన్లలోనే అయిపోతోంది. మరీ ముఖ్యంగా కెమెరా అవసరాలను స్మార్ట్ ఫోన్లు బాగా తీరుస్తున్నాయి. ప్రత్యేకంగా కెమెరా కొనాల్సిన అవసరం లేకుండా ఫోన్లలో ఉండే కెమెరాలు రకరకాల ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్నాయి. వైడ్ యాంగిల్, మ్యాక్రో, పొట్రెయిట్, డెప్త్, పెరిస్కోప్, టెలీఫోటో ఇలా అన్ని రకాల కెమెరా సెన్సర్స్ ఫోన్లలో అమరిపోతున్నాయి. మంచి కెమెరా ఉన్న ఫోన్ చేతిలో ఉంటే అలా క్లిక్ అనిపిస్తూ ముందుకెళ్తారు యూజర్లు. కెమెరా […]

The post రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనైనా ఫోన్లలోనే అయిపోతోంది. మరీ ముఖ్యంగా కెమెరా అవసరాలను స్మార్ట్ ఫోన్లు బాగా తీరుస్తున్నాయి. ప్రత్యేకంగా కెమెరా కొనాల్సిన అవసరం లేకుండా ఫోన్లలో ఉండే కెమెరాలు రకరకాల ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్నాయి. వైడ్ యాంగిల్, మ్యాక్రో, పొట్రెయిట్, డెప్త్, పెరిస్కోప్, టెలీఫోటో ఇలా అన్ని రకాల కెమెరా సెన్సర్స్ ఫోన్లలో అమరిపోతున్నాయి.

మంచి కెమెరా ఉన్న ఫోన్ చేతిలో ఉంటే అలా క్లిక్ అనిపిస్తూ ముందుకెళ్తారు యూజర్లు. కెమెరా నాణ్యమైన ఫోటోలను వీడియోలను తీయడం ఎంతో అవసరం. ఫోన్ కొనేటప్పుడు అందులో ఉన్న కెమెరా సామర్థ్యాన్ని ముందుగా తెలుసుకుంటే మంచిది. సరే, ఈ ఆర్టికల్ లో మనం రూ.20,000 లోపు ధరలో లభించే 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ల జాబితాను చూద్దాం.

రూ.20,000 ధరలోపు అందుబాటులో ఉన్న 108ఎంపి కెమెరా ఫోన్లు

1. Redmi Note 11S

2. Infinix Note 12 Pro 5G

3. Realme 10 Pro 5G

4. Motorola G72

5. Infinix Zero 20

6. OnePlus Nord CE 3 Lite 5G

7. Realme 9 4G

Redmi Note 11S

Redmi Note 11S స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి ఏఐ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఫోన్ ధర రూ.12,999 గా ఉంది.

Infinix Note 12 Pro 5G

Infinix Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,999 కి లభిస్తోంది. ఈ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 2టిబి వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి.

Realme 10 Pro 5G

Realme 10 Pro 5G డివైజ్ రూ.19,999 ధరకి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.

Motorola G72

Motorola G72 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.16,999 గా ఉంది.

Infinix Zero 20

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరా, 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉన్నాయి.

OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G లో 108ఎంపి + 2ఎంపి +2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ధర అమెజాన్ లో రూ.19,999 గా ఉంది.

Realme 9

Realme 9 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 680 చిప్, 6జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.4-ఇంచ్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది.

The post రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
మొబైల్ ఫోన్‌ని చిటికెలో టీవీతో కనెక్ట్ చేయవచ్చు; ఎలాగో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/how-to-connect-smartphone-to-smart-tv-wirelessly-screen-mirroring-android-ios/ Tue, 04 Jul 2023 11:22:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=7055 స్మార్ట్‌ఫోన్‌లు సంవత్సరాలుగా పెద్దవిగా మరియు మెరుగ్గా మారాయి. ఇందులో, మీరు మెరుగైన ప్యానెల్‌లతో పాటు స్టీరియో స్పీకర్లు మొదలైనవాటిని పొందడం సాధరణమైన విషయమైపోయింది. అయితే ఇంట్లో కూర్చొని సినిమాలు లేదా వీడియోలు చూడటం విషయానికి వస్తే, టీవీ పెద్ద స్క్రీన్‌పై కంటెంట్‌ను చూడటం ఇప్పటికీ మానలేకపోయాం. అయితే, ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు టీవీకి కనెక్ట్ చేసుకుని కంటెంట్ ని వాడుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మీరు కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు మొదలైనవాటిని టీవీలో చూడాలనుకుంటే, దానిని […]

The post మొబైల్ ఫోన్‌ని చిటికెలో టీవీతో కనెక్ట్ చేయవచ్చు; ఎలాగో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్‌లు సంవత్సరాలుగా పెద్దవిగా మరియు మెరుగ్గా మారాయి. ఇందులో, మీరు మెరుగైన ప్యానెల్‌లతో పాటు స్టీరియో స్పీకర్లు మొదలైనవాటిని పొందడం సాధరణమైన విషయమైపోయింది. అయితే ఇంట్లో కూర్చొని సినిమాలు లేదా వీడియోలు చూడటం విషయానికి వస్తే, టీవీ పెద్ద స్క్రీన్‌పై కంటెంట్‌ను చూడటం ఇప్పటికీ మానలేకపోయాం. అయితే, ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు టీవీకి కనెక్ట్ చేసుకుని కంటెంట్ ని వాడుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మీరు కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు మొదలైనవాటిని టీవీలో చూడాలనుకుంటే, దానిని వైర్‌లెస్‌గా ఎలా కనెక్ట్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

ఆండ్రాయిడ్ ఫోన్ ని స్మార్ట్ టీవీ (2023) కి కనెక్ట్ చేయడం ఎలా?

ఈ రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లలో స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ అనేది ఉంటోంది. మీ Android ఫోన్ స్క్రీన్‌ని స్మార్ట్ టీవీకి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి, ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

  • స్మార్ట్‌ఫోన్ యొక్క క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్‌కు వెళ్లడం దీనికి సులభమైన మార్గం. ఇక్కడ మీకు Cast ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీకు క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ లో ఈ ఆప్షన్ కనిపించకుంటే, ఎడిట్ బటన్‌ను నొక్కి, స్క్రీన్ కాస్ట్ టోగుల్ కోసం చూడండి.
  • Cast బటన్‌ను నొక్కి పట్టుకుని, దాన్ని క్విక్ సెట్టింగ్స్ ట్రే మీదకు లాగండి.
  • స్క్రీన్ కాస్ట్ బటన్‌ను ఆన్ చేసి, మీ స్మార్ట్ టీవీ ఆ జాబితాలో కనిపిస్తుందో లేదో చూడండి.
  • ఇప్పుడు మీ Android ఫోన్‌ను మిర్రర్ చేసేందుకై మీ టీవీ పేరుపై నొక్కండి.

మీరు Android స్క్రీన్ కాస్టింగ్‌ని నిలిపివేయాలనుకుంటే, క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ లో Cast టోగుల్‌ను నొక్కండి. ఆండ్రాయిడ్ స్క్రీన్ మిర్రరింగ్ ఆండ్రాయిడ్ 5.0 లేదా తర్వాతి వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ స్క్రీన్ కాస్ట్ ఆప్షన్ కనిపించకపోతే, ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీకి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసే ఆప్షన్ కి మీ డివైజ్ సెట్టింగ్స్ వేరే పేరును కలిగి ఉన్నాయో లేదో చూడండి. ఉదాహరణకు, Xiaomi డివైజెస్, స్క్రీన్ మిర్రరింగ్‌ని అందించే సెట్టింగ్స్ లో రెండు ఆప్షన్స్‌ని కలిగి ఉంటాయి – Cast మరియు Wireless Display. చాలా మంది వినియోగదారులు వైర్‌లెస్ డిస్‌ప్లే సహాయంతో తమ Xiaomi స్క్రీన్‌ను కాస్ట్ చేయవచ్చు. దీని కోసం, మీరు Xiaomi ఫోన్‌లో సెట్టింగ్‌లు > కనెక్షన్ & షేరింగ్ > వైర్‌లెస్ డిస్ప్లేకి వెళ్లాలి.

ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ ని గూగుల్ హోమ్ యాప్ తో మిర్రర్ చేయడం ఎలా?

ఫోన్ స్క్రీన్ కాస్ట్ ఫీచర్ సహాయంతో మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీకి కనెక్ట్ చేయలేకపోతే, మీరు Google హోమ్ యాప్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్క్రీన్‌ని మీ స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేయడానికి ఇది కూడా మంచి మార్గం. మీరు Chromecastని కలిగి ఉంటే లేదా Chromecast ఇన్‌బిల్ట్ Android TVని కలిగి ఉంటే ఈ పద్ధతి పని చేస్తుంది.

  • Google Play Store నుండి Google Home యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
  • మీరు ఇప్పటికే Google Chromecastని సెటప్ చేయకుంటే, ముందుగా దాన్ని సెటప్ చేయండి. మీ స్మార్ట్ టీవీలో Chromecast ఇన్‌బిల్ట్ గా ఉంటే, అది ఆటోమేటిక్‌గా యాప్‌లో చూపబడుతుంది.
  • డివైజ్ పై నొక్కండి, ఆపై దిగువన మీరు Cast my screen ఆప్షన్‌ని చూస్తారు. దానిపై నొక్కండి.
  • Cast స్క్రీన్‌పై నొక్కిన తర్వాత, ఇప్పుడు ప్రారంభించుపై క్లిక్ చేయండి. దీని తరువాత, స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ టీవీలో కనిపిస్తుంది.
  • మీరు స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ ఫోన్‌ మిర్రరింగ్ ని ఆపివేయాలనుకుంటే, స్టాప్ మిర్రరింగ్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.

ఐఫోన్స్, స్మార్ట్ టీవీలను కనెక్ట్ చేయడం ఎలా (2023)?

మీరు మీ ఐఫోన్‌లు మరియు ఐప్యాడ్‌లను మీ టీవీకి సులభంగా మిర్రరింగ్ చేయవచ్చు. కానీ మీకు AirPlay 2కి సపోర్ట్ చేసే Apple TV లేదా Smart TV అవసరం. మీ టీవీకి iPhoneని వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

  • ముందుగా మీ iPhone/iPad మరియు Smart TVని ఒకే WiFi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి.
  • కంట్రోల్ సెంటర్ కి వెళ్లడానికి టాప్ రైట్ కార్నర్ నుంచి క్రిందికి స్వైప్ చేయండి.
  • స్క్రీన్ మిర్రరింగ్‌పై నొక్కండి మరియు జాబితా నుండి స్మార్ట్ టీవీ ఆప్షన్ ని ఎంచుకోండి.

మీకు Apple TV లేదా AirPlay 2 సపోర్ట్ ఉన్న స్మార్ట్ టీవీ లేకుంటే, మీరు ఇప్పటికీ మీ iOS డివైజ్ లో Chromecast ప్రారంభించబడిన యాప్‌ల నుండి కంటెంట్‌ను ప్రసారం చేయవచ్చు. యాప్‌ని తెరవండి (ఉదా. YouTube), Cast బటన్‌ను నొక్కండి మరియు జాబితా నుండి మీ టీవీని ఎంచుకోండి. ఈ ఫీచర్ iOS 13 మరియు ఆపైన వచ్చిన ఓఎస్‌లు ఉన్న డివైజెస్ లో మాత్రమే పని చేస్తుంది.

తరచూ అడగబడే ప్రశ్నలు (FAQ)

స్క్రీన్ మిర్రరింగ్ అంటే ఏంటి?

ఈ రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు స్క్రీన్ మిర్రరింగ్ (కాస్టింగ్) ఫీచర్‌తో వస్తున్నాయి. దీని సహాయంతో మీరు స్మార్ట్ టీవీలో స్మార్ట్‌ఫోన్ కంటెంట్ ని వైర్‌లెస్‌గా చూడవచ్చు. మీరు పెద్ద స్క్రీన్‌పై చిత్రాలను చూడాలనుకునే, గేమ్‌లు ఆడాలనుకునే మరియు సినిమాలను చూడాలనుకునే సందర్భాల్లో ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్ టీవీలు స్క్రీన్ మిర్రరింగ్ ఫంక్షనాలిటీని ఇన్‌బిల్ట్ గా కలిగి ఉంటాయి. అయితే పాత టీవీలకు మీడియా స్టిక్ లేదా మీడియా ప్లేయర్ అవసరం. ఉదాహరణకు Google Chromecast, Amazon Fire Stick, Roku మొదలైనవి. అయినప్పటికీ, స్మార్ట్ టీవీకి స్మార్ట్‌ఫోన్‌ కంటెంట్ ని ప్రసారం చేయడం చాలా ముఖ్యం. మీ స్మార్ట్‌ఫోన్ మరియు టీవీ రెండూ ఒకే వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయబడాలి. అలాగే, మీ స్మార్ట్ టీవీలో తప్పనిసరిగా Chromecast ఇన్‌బిల్ట్ గా ఉండాలి. లేదా మీరు స్క్రీన్ మిర్రరింగ్‌కు సపోర్ట్ చేసే స్ట్రీమింగ్ డివైజ్ ని కలిగి ఉండాలి.

మీ పాత టీవీకి ఆండ్రాయిడ్ ఫోన్‌ని కనెక్ట్ చేయడం ఎలా?

సాధారణంగా, సాంప్రదాయ టీవీలు స్క్రీన్ మిర్రరింగ్ లేదా స్క్రీన్‌కాస్టింగ్ ఫీచర్‌తో రావు. ఎందుకంటే వాటిలో Wi-Fi ఇంటిగ్రేషన్ ఉండదు. అయితే, Google Chromecast, Apple Fire TV Stick లేదా ఏదైనా ఇతర ఆండ్రాయిడ్ ఆధారిత డాంగిల్‌ని స్మార్ట్‌ఫోన్‌ను సంప్రదాయ టీవీలో మిర్రరింగ్ చేసేందుకై ఉపయోగించవచ్చు. నాన్-స్మార్ట్ టీవీలలో డాంగిల్‌ని HDMI పోర్ట్‌కి కనెక్ట్ చేయాలి. ఆపై పైన తెలిపిన స్టెప్స్ ని ఫాలో అయ్యి ప్రసారం చేయండి.

స్మార్ట్ టీవీకి స్మార్ట్ ఫోన్ ని కనెక్ట్ చేయడం ఎలా?

మీరు మీ టీవీలో మీ స్మార్ట్‌ఫోన్‌ను మిర్రరింగ్ చేయలేకపోతే, ముందుగా మీ టీవీ మరియు స్మార్ట్‌ఫోన్ రెండింటినీ రిస్టార్ట్ చేయండి. మీ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యాయని కన్ఫర్మ్ చేసుకోండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇప్పటికీ ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీ Wi-Fi రూటర్‌ని రీబూట్ చేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి.

The post మొబైల్ ఫోన్‌ని చిటికెలో టీవీతో కనెక్ట్ చేయవచ్చు; ఎలాగో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
జులైలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (2023) https://www.91mobiles.com/telugu/smartphones-to-be-launched-in-july-2023/ Wed, 21 Jun 2023 15:57:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=6882 స్మార్ట్ ఫోన్ లాంచెస్ ఉన్నాయంటే ఆ నెల మొత్తం సందడిగా మారిపోతుంది. మొబైల్ లవర్స్ కి కొత్త ఫోన్ల లాంచ్ అనేది ఒక పండుగను తీసుకొచ్చినట్లేనని చెప్పాలి. కొత్త ఫోన్లకు సంబంధించిన లీక్స్ సమాచారం తెలుసుకుంటూ, రూమర్లను విని ఆసక్తిగా ఎదురు చూసే వారికి లాంచ్ సమయం ఎంతో కీలకం. ఇక తమకు నచ్చిన బ్రాండ్ల ఫోన్లు వస్తున్నాయంటే యూజర్లు మరింత ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు. కొత్త ఫోన్ కొనాలని భావించే వారు మార్కెట్ లోకి బ్రాండ్ […]

The post జులైలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై లో లాంచ్ కానున్న పలు బ్రాండ్ల స్మార్ట్ ఫోన్స్
  • ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్న శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో
  • రియల్మీ నుంచి రానున్న బడ్జెట్ ఫోన్లు

స్మార్ట్ ఫోన్ లాంచెస్ ఉన్నాయంటే ఆ నెల మొత్తం సందడిగా మారిపోతుంది. మొబైల్ లవర్స్ కి కొత్త ఫోన్ల లాంచ్ అనేది ఒక పండుగను తీసుకొచ్చినట్లేనని చెప్పాలి. కొత్త ఫోన్లకు సంబంధించిన లీక్స్ సమాచారం తెలుసుకుంటూ, రూమర్లను విని ఆసక్తిగా ఎదురు చూసే వారికి లాంచ్ సమయం ఎంతో కీలకం. ఇక తమకు నచ్చిన బ్రాండ్ల ఫోన్లు వస్తున్నాయంటే యూజర్లు మరింత ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు.

కొత్త ఫోన్ కొనాలని భావించే వారు మార్కెట్ లోకి బ్రాండ్ న్యూ ఫోన్లు ఎప్పుడు అడుగుపెడతాయా అని వెయిట్ చేస్తుంటారు. ప్రతినెలా ఏదో ఒక కంపెనీ ఫోన్ లాంచ్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మూకుమ్మడిగా ఫోన్లు మార్కెట్ లోకి విడుదలవుతుంటాయి. అప్పుడు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. రాబోయే జులై నెలలో కూడా పదుల సంఖ్యలో ఫోన్లు లాంచ్ కానున్నాయి. ప్రముఖ బ్రాండ్లైన శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ లకు చెందిన ఫోన్లు జులై నెలలో మార్కెట్ లోకి రానున్నాయి. ఇక్కడ మీకోసం ఆ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం.

జులై లో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు

  • Motorola Razr 40 – జులై 3
  • iQOO 7 Pro – జులై 4
  • OnePlus Nord 3 – జులై 5
  • OPPO Reno 10 – జులై 7
  • Samsung Galaxy M34 – జులై మూడో వారం
  • Vivo V29 – జులై చివరి వారం
  • Samsung Galaxy Z Fold 5, Flip 5 – జులై చివరి వారం

Motorola Razr 40

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా Motorola Razr 40 డివైజ్ ని జులై నెలలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ని జులై 3 వ తేదీన మార్కెట్ లోకి విడుదల చేయాలని సదరు సంస్థ భావిస్తోంది.

iQOO 7 Pro

వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూ త్వరలోనే iQOO 7 Pro ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ జులై 4 వ తేదీన మార్కెట్ లోకి రానుంది.

OnePlus Nord 3

వన్‌ప్లస్ అభిమానులు OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ డివైజ్ జులై 5 న మార్కెట్ లో లాంచ్ అవుతోంది.

OPPO Reno 10 సిరీస్

OPPO Reno 10 స్మార్ట్ ఫోన్ జులై 7 వ తేదీన మార్కెట్ లో లాంచ్ కానుంది. రెనో సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రెనో సిరీస్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయంటే అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.

Samsung Galaxy M34

Samsung Galaxy M34 స్మార్ట్ ఫోన్ 2023 జులై మూడో వారంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Vivo V29

Vivo V29 స్మార్ట్ ఫోన్ జులై చివరి వారంలో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ డివైజ్ కోసం వివో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీ-సిరీస్ కి ప్రత్యేకించి భారతీయుల్లో ఎంతగానో ఆదరణ ఉంది.

Samsung Galaxy Z Fold 5, Flip 5

Samsung Galaxy Z Fold 5, Flip 5 స్మార్ట్ ఫోన్లు జులై చివరి వారంలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

The post జులైలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
స్మార్ట్‌ఫోన్ రేడియేషన్‌ని విస్మరించడం ప్రమాదకరం, ఫోన్ SAR వాల్యూని ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/how-to-check-smartphones-sar-value-radiation-info/ Mon, 05 Jun 2023 06:12:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=6615 భారతీయులమైన మనం ఎప్పుడైతే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నామో, ముందుగా మనం చేసేది బడ్జెట్‌ను సెట్ చేయడం. ఆ బడ్జెట్‌లో, అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, బలమైన బ్యాటరీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ వంటి వాటిని చూసి కొనుగోలు చేస్తారు. కానీ వీటన్నింటి మధ్యలో, ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మేము విస్మరిస్తాము. మరియు అది ఫోన్ యొక్క SAR విలువ. మొబైల్ యొక్క సారాంశం విలువ ఎంత ముఖ్యమైనది మరియు […]

The post స్మార్ట్‌ఫోన్ రేడియేషన్‌ని విస్మరించడం ప్రమాదకరం, ఫోన్ SAR వాల్యూని ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

భారతీయులమైన మనం ఎప్పుడైతే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నామో, ముందుగా మనం చేసేది బడ్జెట్‌ను సెట్ చేయడం. ఆ బడ్జెట్‌లో, అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, బలమైన బ్యాటరీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ వంటి వాటిని చూసి కొనుగోలు చేస్తారు. కానీ వీటన్నింటి మధ్యలో, ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మేము విస్మరిస్తాము. మరియు అది ఫోన్ యొక్క SAR విలువ. మొబైల్ యొక్క సారాంశం విలువ ఎంత ముఖ్యమైనది మరియు దానిని విస్మరించడం వినియోగదారులకు ప్రాణాంతకమైన హానిని కలిగిస్తుంది.

ఈ కథనంలో, మీరు మీ ఫోన్ యొక్క SAR విలువను ఏ విధంగా తనిఖీ చేయవచ్చు మరియు భద్రత పరంగా ఎంత SAR విలువను సరైనదిగా పిలవవచ్చు అని మేము ఇక్కడే చెప్పాము.

SAR విలువ అంటే ఏమిటి

SAR (Specific Absorption Rate) అంటే నిర్దిష్ట శోషణ రేటు. నైరూప్య విలువ అనేది ఫోన్ ద్వారా విడుదలయ్యే తరంగాలను మరియు మానవ శరీరం గ్రహించిన తరంగాలను కొలిచే రేటు. ఈ తరంగాలు శరీరంలోని రక్తంలో ఉండే కణజాలాల ద్వారా శోషించబడతాయి. మొబైల్ నుంచి వచ్చే తరంగాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఫోన్‌లో ఏకకాలంలో అనేక పనులు జరుగుతున్నప్పుడు, అది పెరుగుతుంది మరియు ఫోన్‌ను తక్కువగా ఉపయోగించే సమయంలో, ఈ తరంగాలు తగ్గుతాయి. స్మార్ట్‌ఫోన్ నుండి వచ్చే ఈ తరంగాలను ‘SAR విలువ’ ద్వారా కొలుస్తారు. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు దాని స్వంత రేడియేషన్ మరియు ఫ్రీక్వెన్సీ ఉంటుందని దయచేసి చెప్పండి.

మొబైల్ ఫోన్ అనేది నెట్‌వర్క్ తరంగాలను పంపే మరియు స్వీకరించే రేడియో ట్రాన్స్‌మిటర్. ఈ తరంగాలను రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలు అంటారు. ఈ తరంగాలు మొబైల్ యాంటెన్నా ద్వారా బదిలీ చేయబడతాయి, ఇది ఫోన్ నుండి మొబైల్ టవర్‌కు వెళ్లి మొబైల్ టవర్ నుండి ఫోన్‌కు వస్తుంది. ఈ తరంగాలు బదిలీ చేయబడినప్పుడల్లా, వాటిలో కొంత శాతం దారిలో పోతాయి మరియు ఏ పరికరానికి కనెక్ట్ చేయకుండా వాతావరణంలో తిరుగుతూ ఉంటాయి. మరియు ఇది మీకు, మాకు మరియు పర్యావరణానికి ముప్పు కలిగించే భాగం.

భారతదేశంలో నిర్దేశించబడిన SAR విలువ

ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు భిన్నమైన నైరూప్య విలువ ఉంటుంది. ఈ SAR విలువను ప్రతి దేశ ప్రభుత్వం నిర్ణయిస్తుంది మరియు స్థిర విలువ కంటే ఎక్కువ SAR విలువ ఉన్న ఫోన్‌లు ఆ దేశంలో నిషేధించబడ్డాయి. భారతదేశం మరియు అమెరికా ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రధాన విలువ ఒకటే అని మీకు తెలియజేద్దాం. భారతదేశంలో మొబైల్ ఫోన్‌ల గరిష్ట శోషణ విలువ 1.6W/kg. ఇక్కడ వాట్/కిలోగ్రామ్ అంటే 1 కిలోగ్రాము కణజాలం గరిష్టంగా 1.6 వాట్ల తరంగ శక్తిని గ్రహించగలదు.

మీ ఫోన్ SAR విలువను ఇలా తెలుసుకోండి

మీరు మీ ఫోన్ యొక్క వియుక్త విలువను కూడా తెలుసుకోవాలనుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్ నుండి *#07# డయల్ చేయండి. ఈ నంబర్‌ను డయల్ చేసిన తర్వాత, ఫోన్ యొక్క SAR విలువ ఫోన్ డిస్‌ప్లేపై కనిపిస్తుంది. ఒకవేళ, నైరూప్య విలువ రెండు భాగాలుగా విభజించబడిందని కూడా మీకు తెలియజేస్తాము. ఫస్ట్ హెడ్ SAR అంటే తల మరియు బాడీ SAR అంటే శరీరం. మనం ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినా తల మొబైల్‌కి దగ్గరగా ఉంటుంది. అందుకే తలలోని సారాంశం వేరుగా ఉంచబడింది. అదేవిధంగా, ఫోన్ జేబులో లేదా చేతిలో ఉన్నప్పుడు, నైరూప్య విలువ ఆ స్థానానికి విడిగా కొలుస్తారు.

The post స్మార్ట్‌ఫోన్ రేడియేషన్‌ని విస్మరించడం ప్రమాదకరం, ఫోన్ SAR వాల్యూని ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.8,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/smartphones-under-8-thousand-rupees-budget/ Wed, 17 May 2023 16:05:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6359 ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనులైనా దాదాపుగా ఫోన్ల ద్వారా జరిగిపోతున్నాయి. కీప్యాడ్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారుతున్న వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వారికి మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూజర్లకు కావాల్సిన ధరల్లో కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి, ఫోన్లను తమకు నచ్చిన బడ్జెట్ లో కొనుగోలు చేయడం ఇప్పుడు తేలికైన విషయం. ఎంట్రీ లెవెల్ ఫోన్లు కొనాలని భావించే వారి కోసం […]

The post రూ.8,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకైన మన్నికైన ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్
  • అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల బడ్జెట్ శ్రేణి ఫోన్లు
  • రూ.8 వేల లోపు బడ్జెట్ లో లభించే ఫోన్ల జాబితా మీకోసం

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనులైనా దాదాపుగా ఫోన్ల ద్వారా జరిగిపోతున్నాయి. కీప్యాడ్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారుతున్న వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వారికి మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూజర్లకు కావాల్సిన ధరల్లో కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి, ఫోన్లను తమకు నచ్చిన బడ్జెట్ లో కొనుగోలు చేయడం ఇప్పుడు తేలికైన విషయం.

ఎంట్రీ లెవెల్ ఫోన్లు కొనాలని భావించే వారి కోసం రూ.8,000 లోపు ధరలో లభిస్తోన్న ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు నచ్చిన డివైజ్ ని ఎంచుకునే ప్రయత్నం చేయండి.

రూ.8 వేల లోపు ధరలో లభిస్తోన్న స్మార్ట్‌ఫోన్లు

  • POCO C51
  • Realme Narzo 50i Prime
  • Tecno Spark Go 2023
  • Motorola e13
  • Nokia C12 Pro
  • Samsung M04

POCO C51

ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7249 గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 8ఎంపి మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme Narzo 50i Prime

రియల్మీ నార్జో 50ఐ ప్రైమ్ ఫోన్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7,664 గా ఉంది. ఈ ఫోన్ లో యూనిసాక్ చిప్సెట్, 8ఎంపి మెయిన్ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Tecno Spark Go 2023

టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7046 గా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ చిప్, 13ఎంపి మెయిన్ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Motorola e13

మోటోరోలా ఈ13 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.6,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ చిప్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Nokia C12 Pro

నోకియా సీ12 ప్రో స్మార్ట్ ఫోన్ లో 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7,698 గా ఉంది. ఈ ఫోన్ లో ఇంటెల్ చిప్, 8ఎంపి ప్రైమరీ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Samsung Galaxy M04

శాంసంగ్ గెలాక్సీ ఎమ్04 స్మార్ట్ ఫోన్ ధర 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,069 గా ఉంది. 8 వేలకు కేవలం రూ.69 మాత్రమే ఎక్కువ ఉన్నందున ఈ ఫోన్ ని కూడా ప్రయత్నించవచ్చు. తక్కువ ధరలో శాంసంగ్ బ్రాండ్ ఫోన్ కావాలని భావించే వారికి ఈ ఫోన్ మంచి ఎంపిక.

The post రూ.8,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>