Snapdragon 7s Gen 2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 01 Dec 2023 11:29:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-x6-with-snapdragon-7s-gen-2-chipset-appeared-on-geekbench/ Fri, 01 Dec 2023 11:29:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=9066 షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో X6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు డివైజెస్ రానున్నాయి. అవి: POCO X6 మరియు POCO X6 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. తాజాగా POCO X6 డివైజ్ గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చింది. POCO X6 డివైజ్ Redmi Note 13 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు గీక్ బెంచ్ ద్వారా తెలుస్తోంది. […]

The post Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6
  • Redmi Note 13 Pro పేరుతో రానున్న POCO X6
  • ఇంకా అనౌన్స్ కావాల్సిన POCO X6 సిరీస్

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో X6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు డివైజెస్ రానున్నాయి. అవి: POCO X6 మరియు POCO X6 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. తాజాగా POCO X6 డివైజ్ గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చింది. POCO X6 డివైజ్ Redmi Note 13 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు గీక్ బెంచ్ ద్వారా తెలుస్తోంది. అలాగే గీక్ బెంచ్ పై POCO X6 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ తో కనిపించింది. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO X6 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • POCO X6 బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై 23122PCD1G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇది POCO X6 కి సంబంధించి మోడల్ నంబర్.
  • POCO X6 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో గీక్ బెంచ్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ చిప్సెట్ అడ్రెనో టీఎమ్ 710 జీపీయూ తో జత చేయబడింది.
  • కోడ్ నేమ్ గార్నెట్ అని ఉంది. దీంతో POCO X6, Redmi Note 13 Pro కి రీబ్రాండెడ్ అని తెలుస్తోంది. ఎందుకంటే కోడ్ నేమ్స్ రెండింటికి ఒకే విధంగా ఉన్నాయి.
  • గీక్ బెంచ్ పై POCO X6 సింగిల్-కోర్ టెస్ట్ లో 1,013 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2,865 పాయింట్లు నమోదు చేసింది.
  • Redmi Note 13 Pro డివైజ్ POCO X6 గా గ్లోబల్ గా లాంచ్ కానుందని ఆమధ్య కొన్ని వార్తలు వచ్చాయి. మరోవైపు, POCO X6 Pro డివైజ్ Redmi K70e కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని అంచనా వేస్తున్నారు. Redmi, POCO ఫోన్లకు షావోమి ఈ తరహా స్ట్రేటజీని ఫాలో అవ్వడం ఇది కొత్తేమీ కాదు.

POCO X6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: POCO X6 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO X6 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: POCO X6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ3 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • ఓఎస్: POCO X6 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: POCO X6 లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>