Special Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 29 May 2024 17:13:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nothing Phone (2a): భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ (2ఏ) స్పెషల్ ఎడిషన్ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-special-edition-launched-in-india/ Wed, 29 May 2024 17:13:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=11793 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. విభిన్నమైన రంగులతో ఈ ఫోన్‌ని తీసుకొచ్చింది. స్పెసిఫికేషన్స్ లో ఏ మార్పు లేదు. కానీ, లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఫోన్ కనిపించాలని భావించే వారికి ఈ కొత్త ఎడిషన్ మంచి ఆప్షన్ కావొచ్చు. ఓసారి […]

The post Nothing Phone (2a): భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ (2ఏ) స్పెషల్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • విభిన్న రంగుల్లో లాంచైన Nothing Phone (2a)
  • ఎరుపు, పసుపు, నీలం రంగులతో వచ్చిన డివైజ్
  • కొత్త ఎడిషన్ ధర రూ.27,999, సేల్ తేదీ జూన్ 5

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. విభిన్నమైన రంగులతో ఈ ఫోన్‌ని తీసుకొచ్చింది. స్పెసిఫికేషన్స్ లో ఏ మార్పు లేదు. కానీ, లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఫోన్ కనిపించాలని భావించే వారికి ఈ కొత్త ఎడిషన్ మంచి ఆప్షన్ కావొచ్చు. ఓసారి ఈ స్పెషల్ ఎడిషన్ ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ విశేషాలు

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ రెడ్, యెల్లో మరియు బ్లూ కలర్స్ లో వచ్చింది. నథింగ్ సంస్థ తన వివిధ ఉత్పత్తుల్లో ప్రధానంగా ఈ రంగులను వాడుతుంది. వాటన్నింటినీ ఇలా ఒకే ఫోన్ లో తీసుకొచ్చింది.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ బ్యాక్ ప్యానెల్ పై పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ చుట్టూ బ్లూ యాక్సెంట్ కనిపిస్తోంది. రియర్ ప్యానెల్ పైన రెడ్, యెల్లో కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ మార్పులు మినహా, మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ ధర

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. జూన్ 5 నుంచి Nothing Phone (2a) సేల్ మొదలవుతుంది.

ఆఫర్స్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డుల ట్రాన్సాక్షన్స్‌కు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు.

కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ + ఈఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

The post Nothing Phone (2a): భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ (2ఏ) స్పెషల్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>