STV 298 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 23 Nov 2022 12:39:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 BSNL STV 298 రీచార్జ్ ప్లాన్ ప్రయోజనాలు https://www.91mobiles.com/telugu/bsnl-stv-298-plan-benefits/ Wed, 23 Nov 2022 12:39:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=3613 ప్రభుత్వరంగ టెలీకామ్ కంపెనీ అయిన BSNL తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్ అందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటోంది. అగ్రస్థానంలో దూసుకెళ్తోన్న ఎయిర్టెల్, జియో వంటి ప్రయివేటు సంస్థలకు తన ప్లాన్స్ తో గట్టి పోటీ ఇస్తోంది. ఎయిర్టెల్ మరియు జియో లలో ధరలు తాళలేక ఎంతోమంది యూజర్లు BSNL బాట పడుతున్నారు. ఇక BSNL కూడా ఎన్నో వాల్యూ ఫర్ మనీ రీచార్జ్ ప్లాన్స్ ని అందిస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. ఇక్కడ మీకోసం రూ.298 రీచార్జ్ ప్లాన్ […]

The post BSNL STV 298 రీచార్జ్ ప్లాన్ ప్రయోజనాలు first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రభుత్వరంగ టెలీకామ్ కంపెనీ అయిన BSNL తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్ అందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటోంది. అగ్రస్థానంలో దూసుకెళ్తోన్న ఎయిర్టెల్, జియో వంటి ప్రయివేటు సంస్థలకు తన ప్లాన్స్ తో గట్టి పోటీ ఇస్తోంది. ఎయిర్టెల్ మరియు జియో లలో ధరలు తాళలేక ఎంతోమంది యూజర్లు BSNL బాట పడుతున్నారు. ఇక BSNL కూడా ఎన్నో వాల్యూ ఫర్ మనీ రీచార్జ్ ప్లాన్స్ ని అందిస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. ఇక్కడ మీకోసం రూ.298 రీచార్జ్ ప్లాన్ వివరాలు అందిస్తున్నాం చెక్ చేయండి.

BSNL రూ.298 రీచార్జ్ ప్లాన్

BSNL అందిస్తోన్న రూ.298 రీచార్జ్ ప్లాన్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసే వినియోగదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత డేటా, ఎస్ఎంఎస్ లు, ఇరోజ్ నౌ ఎంటర్టెయిన్మెంట్ సేవలు లభిస్తాయి.

BSNL రూ.298 ప్లాన్ బెనిఫిట్స్

BSNL రూ.298 ప్లాన్ రీచార్జ్ చేసే కస్టమర్లకు 52 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 52 రోజుల వ్యాలిడిటీలో ఎప్పుడైనా ఏ నెట్వర్క్ కి అయినా కాల్స్ ఉచితం. అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ మరియు రోమింగ్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఎస్ఎంఎస్ లను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.298 ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లు అపరిమిత కాలింగ్, డెయిలీ ఎస్ఎంఎస్ లతో పాటు ప్రతి రోజూ 1జిబి డేటా పొందుతారు. ఈ డేటా 52 రోజుల వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు వస్తుంది. రోజువారీ 1జిబి డేటా లిమిట్ పూర్తయ్యాక డేటా స్పీడ్ 40 కేబీపీఎస్ కి పడిపతుంది. అంటే ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుందన్న మాట. కాకపోతే 1జిబి డేటా వినియోగం పూర్తయ్యాక, స్పీడ్ తగ్గిపోతుంది. అయితే నిదానంగానైనా ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్, ఈ ప్రయోజనాలతో పాటు ఇంకా EROS NOW ఎంటర్టెయిన్మెంట్ సేవలు కూడా లభించనున్నాయి.

BSNL 4G & 5G లాంచ్ ఎప్పుడు?

దేశంలో ఇటీవలె 5జీ సేవలు లాంచ్ అయ్యాయి. ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే 5జీ సేవలను అందిస్తున్నాయి. అయితే తొలిదశలో ఈ సేవలు కేవలం కొన్ని నగరాలకే పరిమితం అయ్యాయి. అన్ని ప్రాంతాలకు 5జీ కనెక్టివిటీని విస్తరింపజేసేందుకు ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి.

ఇక ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNL ఇంకా 4జీ సేవలను కూడా లాంచ్ చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం BSNL కి ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా 4జీ లైసెన్స్ ని BSNL పొందింది. దీంతో అతి త్వరలో BSNL 4జీ నెట్వర్క్ ని లాంచ్ చేయబోతోంది. ఇకపోతే ఆ వెనువెంటనే 5జీ సేవలను కూడా అందించాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం BSNL వరుసబెట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్స్ ని అందిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BSNL STV 298 రీచార్జ్ ప్లాన్ ప్రయోజనాలు first appeared on 91Mobiles Telugu.

]]>