Suzuki - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 31 Jan 2023 14:39:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2025 లో Burgman e-scooter ని భారత్‌లో లాంచ్ చేయనున్న Suzuki https://www.91mobiles.com/telugu/suzuki-to-launch-burgman-electric-scooter-in-2025/ Tue, 31 Jan 2023 14:38:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4715 తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2025 కల్లా భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ Suzuki వెల్లడించింది. స్కూల్స్, ఆఫీసులు, మార్కెట్స్ కి తరచూ వాహనాలను వాడే వారిని దృష్టిలో పెట్టుకుని తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకురానున్నట్లు సుజుకీ సంస్థ వెల్లడించింది. 2030 కల్లా భారత్ లో 8 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని లాంచ్ చేయాలని సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలె భారత్ లో తమ ఈవీ ప్లాన్స్ […]

The post 2025 లో Burgman e-scooter ని భారత్‌లో లాంచ్ చేయనున్న Suzuki first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2025 లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్న సుజుకీ
  • 2023 కల్లా 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేయనున్న సుజుకీ
  • కమ్యూటర్స్ ని టార్గెట్ చేస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకురానున్న సుజుకీ

తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2025 కల్లా భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ Suzuki వెల్లడించింది. స్కూల్స్, ఆఫీసులు, మార్కెట్స్ కి తరచూ వాహనాలను వాడే వారిని దృష్టిలో పెట్టుకుని తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకురానున్నట్లు సుజుకీ సంస్థ వెల్లడించింది. 2030 కల్లా భారత్ లో 8 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని లాంచ్ చేయాలని సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవలె భారత్ లో తమ ఈవీ ప్లాన్స్ ని అనౌన్స్ Honda కంపెనీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు అదే ప్రణాళికతో వచ్చిన రెండో జపనీస్ కంపెనీగా సుజుకీ నిలిచింది. మరి రానున్న రోజుల్లో ఈ రెండు సంస్థల మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్ వార్ చోటుచేసుకుంటుందేమో చూడాలి. మరి ఇద్దరిలో ఎవరిది పై చేయి కానుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

2024 మార్చి కల్లా భారత్ లో Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయబోతున్నట్లు ఇటీవలె హోండా కంపెనీ ప్రకటించింది.

భారత్ లో Suzuki ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

2025 లో సుజుకీ మోటర్‌సైకిల్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ లో లాంచ్ చేయనుందని సుజుకీ సంస్థ తన గ్లోబల్ ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది. కొత్తగా లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ని కమ్యూటర్ టూ-వీలర్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది.

కొన్నాళ్ళుగా పరీక్షించబడుతోన్న Burgman Maxi ఎలక్ట్రిక్ స్కూటర్ నే సుజుకీ తన తొలి ఈ-స్కూటర్ గా లాంచ్ చేయనుందని సమాచారం. దీంతో పాటు బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ పైనే మరొక మిడ్-సైజ్ స్కూటర్ ని కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ళ నుంచి ఎలక్ట్రిక్ బర్గ్‌మ్యాన్ ప్లాట్ఫామ్ ని సుజుకీ టెస్ట్ చేస్తోంది. పబ్లిక్ రోడ్లపై Burgman Maxi ఈ-స్కూటర్ టెస్టింగ్ కి వచ్చి తారసపడింది.

2030 కల్లా భారత్ లో 8 కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ ని లాంచ్ చేయాలని సుజుకీ ప్లాన్ చేస్తోంది. 2023 వరకు సుజుకీ తాను రూపొందించబోవు వాహనాల్లో 25 శాతం వాటా ఈవీ లదే ఉంటుందని అంచనా వేస్తోంది. కార్బన్ న్యూట్రల్ ఫ్యూయల్స్ పై పని చేసే భారీ కెపాసిటీ గల బైక్స్ ని తీసుకొచ్చే దిశగా సుజుకీ పని చేస్తోంది.

జపనీస్ బ్రాండ్స్ అయిన హోండా, సుజుకీ కమ్యూటర్-స్పెసిఫిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి నగరాల్లో స్వల్ప దూరాలకు పనికివచ్చే బండ్లపై ఈ కంపెనీలు దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఇటు హోండా, అటు సుజుకీ సంస్థలు హై-పెర్ఫామెన్స్ స్పోర్టీ టూ-వీలర్స్ పై ఫోకస్ పెట్టడం లేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2025 లో Burgman e-scooter ని భారత్‌లో లాంచ్ చేయనున్న Suzuki first appeared on 91Mobiles Telugu.

]]>