Tata Harrier EV - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 27 Jan 2023 09:34:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2024 లో లాంచ్ కానున్న Tata Harrier EV https://www.91mobiles.com/telugu/tata-harrier-launch-timeline-first-look-auto-expo-2023/ Fri, 27 Jan 2023 09:34:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=4662 Tata Motors త్వరలోనే Tata Harrier EV ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2024 లో Tata Harrier EV భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. Tata Harrier EV ని Auto Expo 2023 ఈవెంట్ లో టాటా మోటర్స్ ప్రదర్శించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతోన్న Tata Nexon EV కంటే ఎక్కువ సామర్థ్యంతో Tata Harrier EV రాబోతోంది. Tata Harrier EV కంపెనీ యొక్క సరికొత్త Gen 2 […]

The post 2024 లో లాంచ్ కానున్న Tata Harrier EV first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో Tata Harrier EV ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న Tata Motors
  • Auto Expo-2023 లో Tata Harrier EV ని ప్రదర్శించిన టాటా మోటర్స్
  • Nexon EV కంటే ఎక్కువ పవర్, రేంజ్ ని అందించనున్న Tata Harrier EV

Tata Motors త్వరలోనే Tata Harrier EV ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2024 లో Tata Harrier EV భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. Tata Harrier EV ని Auto Expo 2023 ఈవెంట్ లో టాటా మోటర్స్ ప్రదర్శించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతోన్న Tata Nexon EV కంటే ఎక్కువ సామర్థ్యంతో Tata Harrier EV రాబోతోంది.

Tata Harrier EV కంపెనీ యొక్క సరికొత్త Gen 2 ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారుకానుంది. ఈ కొత్త ఆర్కిటెక్చర్ ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల కోసమే రూపొందించబడింది. కంపెనీ నుంచి భవిష్యత్తులో రాబోవు వాహనాల్లో కూడా ఇదే ప్లాట్ఫామ్ ని మనం చూడవచ్చు.

Tata Harrier EV లాంచ్

Tata Harrier EV టాటా యొక్క Gen 2 ప్లాట్ఫామ్ పై తయారు కానుంది. టాటా నెక్సాన్ తర్వాత మార్కెట్ లోకి వస్తోన్న టాటా ప్రీమియమ్ ఈవీ వెహికిల్ గా Tata Harrier EV నిలవనుంది. 2024 లో టాటా సంస్థ Tata Harrier EV ని లాంచ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం వివిధ అభివృద్ధి దశల్లో ఉన్న Tata Harrier EV కారు త్వరలోనే టెస్టింగ్ కి వెళ్ళనుంది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియోగో ఈవీ లతో పోల్చితే Tata Harrier EV విభిన్నంగా ఉండనుంది.

Tata Harrier EV యొక్క Gen 2 ప్లాట్ఫామ్ ఐసీఈ నుంచి తీసుకోబడిన చాసిస్. అయితే దీనిపై ఎంతగానో రీవర్క్ చేసి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కి సరిపోయే విధంగా మార్చారు. ఫ్యూయల్ ట్యాంక్ ఏరియా, సెంట్రల్ స్పైన్ వంటి వాటికి మార్పులు చేశారు. చాసిస్ కూడా తేలికగా ఉండి, తక్కువ శక్తిని వాడుకునే విధంగా ఉండనుంది.

Tata Harrier EV భారీ బ్యాటరీ ప్యాక్ తో రానుందని సమాచారం. నెక్సాన్ తో పోల్చితే ఇంకా శక్తివంతమైన మోటర్ హ్యారియర్ లో ఉండనుంది. దీంతో Tata Harrier EV మరింత మెరుగైన పెర్ఫామెన్స్, రేంజ్ ని ఇవ్వనుంది. డ్యూయల్ మోటర్ సెటప్ ని ఉపయోగించుకునే AWD సిస్టమ్ తో Tata Harrier EV వస్తున్నట్లు సమాచారం.

Tata Harrier EV రివైజ్ చేయబడిన స్టైలింగ్, రిడిజైన్ చేయబడిన ఎల్ఈడీ లైటింగ్, బ్లాక్డ్ ఔట్ ఫ్రంట్ గ్రిల్, ఆంగ్యులర్ బంపర్ డిజైన్, కొత్త మెష్ డిజైన్ (ఎయిర్ డ్యామ్ కోసం), భారీ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లతో రానుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, Tata Harrier EV 360-డిగ్రీ కెమెరా, 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్స్, ఏడీఏఎస్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్లతో వస్తోంది. Tata Harrier EV ధర, లాంచ్ టైమ్‌లైన్ తదితర వివరాలు ఇంకా తెలియలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2024 లో లాంచ్ కానున్న Tata Harrier EV first appeared on 91Mobiles Telugu.

]]>