Tata Nexon EV Jet Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Sep 2022 14:34:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన Tata Nexon EV Jet Edition, ధర రూ.17.5 లక్షల నుంచి ప్రారంభం https://www.91mobiles.com/telugu/tata-nexon-ev-jet-editon-launched-price-design-details/ Fri, 02 Sep 2022 14:34:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=2074 హైలైట్స్: టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క జెట్ ఎడిషన్ ని లాంచ్ చేసిన టాటా మోటార్స్ స్టార్ లైట్ ఎక్స్‌టీరియర్ షేడ్, జెట్ బ్లాక్ డైమండ్ కట్ అల్లాయ్స్ జెట్ ఎడిషన్ ప్రత్యేకతలు టాప్-ఎండ్ వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉండనున్న జెట్ ఎడిషన్ టాటా మోటార్స్ పండుగ సీజన్ కి ముందు టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ల యొక్క జెట్ […]

The post భారత్ లో లాంచ్ అయిన Tata Nexon EV Jet Edition, ధర రూ.17.5 లక్షల నుంచి ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క జెట్ ఎడిషన్ ని లాంచ్ చేసిన టాటా మోటార్స్
  • స్టార్ లైట్ ఎక్స్‌టీరియర్ షేడ్, జెట్ బ్లాక్ డైమండ్ కట్ అల్లాయ్స్ జెట్ ఎడిషన్ ప్రత్యేకతలు
  • టాప్-ఎండ్ వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉండనున్న జెట్ ఎడిషన్

టాటా మోటార్స్ పండుగ సీజన్ కి ముందు టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ల యొక్క జెట్ ఎడిషన్ మోడల్ ని లాంచ్ చేసింది. కొత్త జెట్ ఎడిషన్ మోడల్ కొన్ని కాస్మెటిక్, లగ్జరీ టచెస్ ని తీసుకురానుంది. దీంతో కార్లకు కొత్త లుక్, యూనిక్ నెస్ రానుంది. బిజినెస్ జెట్స్ స్పూర్తితో జెట్ ఎడిషన్ క్రియేట్ చేయబడిందని సమాచారం. ఈ ఎడిషన్ ఇప్పటికే ఉన్న డార్క్ ఎడిషన్ ఈవీ మోడల్స్ తో జత చేరనుంది.

టాటా హ్యారియర్, టాటా సఫారి, ఐసీఈ-పవర్డ్ టాటా నెక్సాన్ మోడల్స్ లో కూడా ఈ జెట్ ఎడిషన్ రానుంది. గతంలో టాటా మోటార్స్ డార్క్ ఎడిషన్, కజిరంగా ఎడిషన్ వంటి స్పెషల్ ఎడిషన్ మోడల్స్ ని పరిచయం చేసింది. ఇక టాటా సఫారి విషయానికి వస్తే, అడ్వెంచర్ పర్సోనా, గోల్డ్ ఎడిషన్ మోడల్స్ ని కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. స్పెషల్ ఎడిషన్స్ ద్వారా మొత్తంగా మోడల్స్ సేల్స్ 15 శాతం పెరిగేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.

 

Tata Nexon EV Prime, Nexon EV MAX Jet Edition ధర

ఇక తాజాగా లాంచ్ అయిన మోడల్స్ కార్లకు కొన్ని కాస్మెటిక్, లగ్జరియస్ టచెస్ ని తీసుకు వచ్చాయి. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ యొక్క ఎక్స్‌జెడ్+ లక్స్ ప్రైమ్ జెట్ వేరియంట్ ధర రూ.17.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక లాంగ్-రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎక్స్‌జెడ్+ లక్స్ మ్యాక్స్ జెట్, ఎక్స్‌జెడ్+ లక్స్ మ్యాక్స్ జెట్ ఏసీ ఎఫ్‌సీ డబ్ల్యూఎంయూ ధరలు వరుసగా రూ.19.54 లక్షలు, రూ.20.04 లక్షలు గా నిర్ణయించారు.

నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కార్లు స్టార్‌లైట్ అనే కొత్త పెయింట్ షేడ్ తో వచ్చాయి. ఎర్తీ బ్రాంజ్ రంగులో బాడీ ఫినిషింగ్ ఉంది. ఇక రూఫ్, పిల్లర్స్ ప్లాటినమ్ సిల్వర్ షేడ్ లో కనిపిస్తున్నాయి. ఇక బాడీ పైన హైలైట్స్ మాట్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. డైమండ్-కట్ జెట్ బ్లాక్ వీల్స్ డార్క్ గన్ మెటల్ ఫినిషింగ్ తో కనిపిస్తున్నాయి.

ఇక లోపల చూస్తే, డ్యాష్ బోర్డ్, డోర్ కార్డ్స్ కి బ్రాంజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే గ్లాస్ బ్లాక్, బ్లాక్ హైలైట్స్ ని మనం గమనించవచ్చు. సీట్స్ పైన లెదరెట్ ఆయిస్టర్ వైట్ కలర్ లో, బ్రాంజ్ స్టిచింగ్ తో కనిపిస్తోంది. ప్రీమియమ్నెస్ కొరకు హెడ్ రెస్ట్స్ పై బ్రాంజ్ కలర్ ఫినిష్ ఇచ్చారు.

టాప్ మోడల్ అయిన ఎక్స్‌జెడ్+ లక్స్ ట్రిమ్ లెవెల్ పై జెట్ ఎడిషన్ మోడల్స్ రూపొందాయి. అందుకని ఈ మోడల్స్ మల్టీ-మోడ్ రిజెన్, క్రూజ్ కంట్రోల్, సన్‌రూఫ్, డిజిటల్ గేజ్ క్లస్టర్, వైర్లెస్ చార్జర్ తదితర ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ కొత్త ఎడిషన్స్ ఎటువంటి మెకానికల్ చేంజెస్ ని కలిగి లేవు. ఇప్పటికే ఉన్న మోడల్ ఏవైతే స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్నాయో అవే లేటెస్ట్ ఎడిషన్ కి వర్తిస్తాయి.

The post భారత్ లో లాంచ్ అయిన Tata Nexon EV Jet Edition, ధర రూ.17.5 లక్షల నుంచి ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>