Tecno Camon 30 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 18 May 2024 18:40:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Camon 30 5G https://www.91mobiles.com/telugu/tecno-camon-30-5g-launched-india-50mp-selfie-camera/ Sat, 18 May 2024 18:27:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=11608 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో Camon 30 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. లైనప్ లో Camon 30 5G మరియు Camon 30 Premier 5G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ కెమెరాలు, స్టైలిష్ లుక్స్ తో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Camon 30 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకుందాం. Camon 30 […]

The post Tecno: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Camon 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Camon 30 5G సిరీస్ లాంచ్
  • Camon 30 5G, Camon 30 Premier 5G ఎంట్రీ
  • Camon 30 5G ప్రారంభ ధర రూ.22,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో Camon 30 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. లైనప్ లో Camon 30 5G మరియు Camon 30 Premier 5G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ కెమెరాలు, స్టైలిష్ లుక్స్ తో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Camon 30 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకుందాం.

Camon 30 5G ధర

Camon 30 5G డివైజ్ భారత్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Camon 30 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు.

Camon 30 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.26,999 గా పెట్టారు.

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రెండు వేరియంట్స్ వరుసగా రూ.19,999 మరియు రూ.23,999 ధరలకు లభిస్తాయి.

Camon 30 5G స్మార్ట్‌ఫోన్ సేల్ మే 23 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ కొనే కస్టమర్లకు కంపెనీ రూ.4,999 విలువగల స్మార్ట్‌వాచ్‌ని ఉచితంగా అందిస్తోంది.

Camon 30 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Camon 30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్టీపీఎస్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Camon 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8GHz. గ్రాఫిక్స్ కోసం మాలి జీ610 జీపీయూ వాడారు.

మెమొరీ: Camon 30 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

కెమెరా: Camon 30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Camon 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 70 వాట్ సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Tecno: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Camon 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/tecno-camon-30-series-india-launch-date-revealed/ Mon, 13 May 2024 15:02:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=11500 Tecno Camon 30 5G సిరీస్ త్వరలో భారత్ లో లాంచ్ కానుంది. Tecno Camon 30 5G సిరీస్ లైనప్ లో Camon 30, Camon 30 5G, Camon 30 Pro 5G, Camon 30 Premier 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా టెక్నో కంపెనీ కేమాన్ 30 సిరీస్ ఇండియా లాంచ్ తేదీన ఖరారు చేసింది. టెక్నో కేమాన్ 30 5జీ మరియు కేమాన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్లు కచ్చితంగా […]

The post రివీలైన Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో టెక్నో కేమాన్ 30 సిరీస్ ఎంట్రీ
  • Camon 30 5G, Premier 5G లాంచ్ కన్ఫర్మ్
  • మే 18న కేమాన్ 30 సిరీస్ లాంచ్ అయ్యే ఛాన్స్

Tecno Camon 30 5G సిరీస్ త్వరలో భారత్ లో లాంచ్ కానుంది. Tecno Camon 30 5G సిరీస్ లైనప్ లో Camon 30, Camon 30 5G, Camon 30 Pro 5G, Camon 30 Premier 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా టెక్నో కంపెనీ కేమాన్ 30 సిరీస్ ఇండియా లాంచ్ తేదీన ఖరారు చేసింది. టెక్నో కేమాన్ 30 5జీ మరియు కేమాన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్లు కచ్చితంగా భారత్ లో లాంచ్ కానున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది.

Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

Tecno Camon 30 సిరీస్ ఇండియాలో మే 18న లాంచ్ అవ్వనుంది. అయితే టెక్నో సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ GSMArena తన కథనంలో ఈ విషయాన్ని తెలిపింది. అలాగే ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో కనిపిస్తోన్న ప్రొడక్ట్ పేజీ ఇంకా “కమింగ్ సూన్” అని తెలియజేస్తోంది. కానీ, లాంచ్ తేదీ రివీల్ కాలేదు.

మరోవైపు, కేమాన్ 30 సిరీస్ టీజర్ ఇమేజ్ లో ఇండియా లాంచ్ తేదీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే గనుక నిజమైతే, టెక్నో కూడా త్వరలోనే అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించనుంది.

అమెజాన్ టీజర్ పేజీ కూడా Tecno Camon 30 5G, Camon 30 Premier 5G లాంచ్ వివరాలను కన్ఫర్మ్ చేస్తోంది. అంటే కేమాన్ 30 సిరీస్ లో ఈ రెండు ఫోన్లు అందుబాటులో ఉంటాయని అర్థమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి.

Tecno Camon 30 Premier 5G స్పెసిఫికేషన్స్

Tecno Camon 30 Premier 5G లో 6.77-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి.

Tecno Camon 30 Premier 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి పెరిస్కోప్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

Tecno Camon 30 Premier 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno Camon 30 5G స్పెసిఫికేషన్స్

Tecno Camon 30 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉంటాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ లో ఇంకా 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఆగ్జిలరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Tecno Camon 30 5G లో 100ఎంపి కెమెరా ఉంటుందని అమెజాన్ టీజర్‌లో పేర్కొనబడి ఉంది.

Tecno Camon 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post రివీలైన Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO https://www.91mobiles.com/telugu/tecno-camon-30-series-introduced-in-mwc-2024/ Wed, 28 Feb 2024 06:02:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10473 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO బార్సిలోనా నగరంలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Camon 30 సిరీస్‌ని పరిచయం చేసింది. ఈ లైనప్ లో Camon 30 Premier 5G, Camon 30 5G మరియు Camon 30 మార్కెట్ లోకి రానున్నాయి. కేమాన్ 30 మరియు కేమాన్ 30 5జీ గురించి మాట్లాడితే, వీటి డిజైన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను పోలి ఉంది. అలాగే 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి […]

The post MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎండబ్ల్యూసీ 2024 లో ఎంట్రీ ఇచ్చిన Camon 30 సిరీస్
  • లైనప్ లో రానున్న నాలుగు స్మార్ట్‌ఫోన్లు
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న కేమాన్ 30 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO బార్సిలోనా నగరంలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Camon 30 సిరీస్‌ని పరిచయం చేసింది. ఈ లైనప్ లో Camon 30 Premier 5G, Camon 30 5G మరియు Camon 30 మార్కెట్ లోకి రానున్నాయి. కేమాన్ 30 మరియు కేమాన్ 30 5జీ గురించి మాట్లాడితే, వీటి డిజైన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను పోలి ఉంది. అలాగే 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. సరే, ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Camon 30 సిరీస్ ధర, లభ్యత

Tecno Camon 30 సిరీస్ ఎండబ్ల్యూసీ 2024 ఈవెంట్ లో ప్రదర్శింపబడింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ Camon 30 Premier 5G కూడా లాంచ్ కానుంది. కేమాన్ 30 5జీ, కేమాన్ 30 ఫోన్లు వీగన్ లెదర్ బ్యాక్ మరియు గ్లాస్ బ్యాక్ ప్యానెల్స్ తో వస్తున్నాయి.

Tecno Camon 30 5G స్పెసిపికేషన్స్

  • డిస్ప్లే: Tecno Camon 30 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Camon 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Camon 30 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Camon 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Camon 30 5G లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంటాయి.

Tecno Camon 30 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Camon 30 4G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Camon 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Camon 30 4G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Camon 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Camon 30 4G లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంటాయి. ఈ మోడల్ లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉండటం విశేషం.

The post MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>