Tecno Camon 30s Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 31 Jul 2024 06:00:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Camon 30s Pro: హీలియో జీ100 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన కేమాన్ 30ఎస్ ప్రో https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-pro-globally-launched-helio-g100-chip/ https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-pro-globally-launched-helio-g100-chip/#respond Wed, 31 Jul 2024 06:00:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=12753 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్ లో కేమాన్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Camon 30s Pro పేరుతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్, అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 8జిబి ర్యామ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్896 ఓఐఎస్ కెమెరాతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు […]

The post Tecno Camon 30s Pro: హీలియో జీ100 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన కేమాన్ 30ఎస్ ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Tecno Camon 30s Pro లాంచ్
  • అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 50ఎంపి సోని ఐఎంఎక్స్896 మెయిన్ సెన్సర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్ లో కేమాన్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Camon 30s Pro పేరుతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్, అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 8జిబి ర్యామ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్896 ఓఐఎస్ కెమెరాతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Camon 30s Pro ధర, కలర్ ఆప్షన్స్

Tecno Camon 30s Pro స్మార్ట్‌ఫోన్ టెక్నో యొక్క అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అయితే ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై అప్డేట్ రానుంది. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఇంటర్‌స్టెల్లార్ గ్రే, పెర్ల్ గోల్డ్ మరియు షిమ్మర్ సిల్వర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Camon 30s Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Camon 30s Pro లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, డ్యూయల్-కర్వ్డ్ ఇన్ఫినైట్ వ్యూ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్, 2160 హెర్ట్జ్ పీడ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Camon 30s Pro లో మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్ వాడారు.

సాఫ్ట్‌వేర్: Tecno Camon 30s Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లంచ్ అయ్యింది.

మెమొరీ: Tecno Camon 30s Pro డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Tecno Camon 30s Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్896 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ లో డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంది.

బ్యాటరీ: Tecno Camon 30s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ తో పాటు బాక్స్ లో మాగ్నెటిక్ చార్జింగ్ ఫోన్ కేస్, వైర్లెస్ చార్జర్ తో వస్తాయి. చార్జింగ్ కోసం హైపర్, స్మార్ట్ మరియు లో టెంప్ చార్జ్ మోడ్స్ అందించారు.

కనెక్టివిటీ: Tecno Camon 30s Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Camon 30s Pro లో డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐపీ53 ప్రొటెక్షన్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

The post Tecno Camon 30s Pro: హీలియో జీ100 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన కేమాన్ 30ఎస్ ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-pro-globally-launched-helio-g100-chip/feed/ 0