TECNO POP 9 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 09:05:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-launched-india-48mp-ai-camera/ https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-launched-india-48mp-ai-camera/#respond Tue, 24 Sep 2024 09:05:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13709 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్ లో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Pop 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ మెయిన్ కెమెరా, 8జిబి వరకు ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Tecno Pop 9 5G విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్
  • 48ఎంపి ఏఐ మెయన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్ లో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Pop 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ మెయిన్ కెమెరా, 8జిబి వరకు ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Tecno Pop 9 5G ధర, సేల్ వివరాలు

Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,499 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా పెట్టారు. ఈ ఫోన్ మిడ్నైట్ షాడో, అజూర్ స్కై మరియు అరోరా క్లౌడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు.

Tecno Pop 9 5G డిజైన్

Tecno Pop 9 5G బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. ఫ్రంట్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు.

Tecno Pop 9 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Pop 9 5G లో 6.67-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Pop 9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ అందించారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ని ఆఫర్ చేస్తుంది. 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Pop 9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Pop 9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Pop 9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Pop 9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 4 ఏళ్ళు ల్యాగ్-ఫ్రీ పెర్ఫామెన్స్ ను కంపెనీ హామీ ఇస్తోంది.

The post Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-launched-india-48mp-ai-camera/feed/ 0
TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-india-launch-date-confirmed/#respond Fri, 20 Sep 2024 11:11:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=13658 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO POP 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ లో ఈ ఫోన్ మైక్రోసైట్ కూడా ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి లాంచ్ తేదీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. TECNO POP […]

The post TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో TECNO POP 9 5G లాంచ్
  • లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ
  • సెప్టెంబర్ 24న విడుదల

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO POP 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ లో ఈ ఫోన్ మైక్రోసైట్ కూడా ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి లాంచ్ తేదీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

TECNO POP 9 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ 24 వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం, ఈ డివైజ్ ధర రూ.10,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.

ఈ డివైజ్‌ను ప్రత్యేకించి యువత కోసం తీసుకొస్తున్నట్లు టెక్నో సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ లో పవర్ఫుల్ ఫీచర్లను అందించినట్లు సమాచారం.

TECNO POP 9 5G డిజైన్

TECNO POP 9 5G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉంటాయి. ఫ్రంట్ ప్యానెల్‌ను గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఫోన్ కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. డివైజ్ తో పాటు రెండు స్కిన్స్ కూడా ఇవ్వనున్నట్లు మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. దీంతో బ్యాక్ ప్యానెల్ లుక్ ను నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

TECNO POP 9 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

డిస్ప్లే: అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం, TECNO POP 9 5G హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది.

చిప్సెట్: TECNO POP 9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: TECNO POP 9 5G డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: TECNO POP 9 5G డివైజ్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ఏఐ ప్రైమరీ కెమెరా ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ సెగ్మెంట్ లో ఒక ఫోన్ సోని కెమెరాతో వస్తుండటం ఇదే తొలిసారి అని కంపెనీ చెబుతోంది.

ఇతర ఫీచర్లు: TECNO POP 9 5G లో ఐపీ54 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై వంటి ఎన్నో ఫీచర్లు ఉంటాయి. ఫోన్‌తో పాటు 4 ఏళ్ళ ల్యాగ్-ఫ్రీ పెర్ఫామెన్స్‌ను అందిస్తున్నట్లు టెక్నో ప్రకటించింది.

The post TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-india-launch-date-confirmed/feed/ 0