Tecno Pova 4 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 10 Oct 2022 11:24:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 13GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లాంచ్ అయిన Tecno Pova 4 Pro https://www.91mobiles.com/telugu/tecno-pova-4-pro-launched-price-specs/ Mon, 10 Oct 2022 11:24:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=2825 హైలైట్స్: Tecno Pova 4 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన టెక్నో కంపెనీ మీడియాటెక్ జీ99 చిప్సెట్, 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా తో లాంచ్ అయిన Tecno Pova 4 Pro ప్రస్తుతానికి కేవలం బంగ్లాదేశ్ లో మాత్రమే లాంచ్ అయిన Tecno Pova 4 Pro Tecno కంపెనీ ఇటీవలె Tecno Pova Neo 5G అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.15,499. 6000 […]

The post 13GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లాంచ్ అయిన Tecno Pova 4 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Tecno Pova 4 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన టెక్నో కంపెనీ
  • మీడియాటెక్ జీ99 చిప్సెట్, 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా తో లాంచ్ అయిన Tecno Pova 4 Pro
  • ప్రస్తుతానికి కేవలం బంగ్లాదేశ్ లో మాత్రమే లాంచ్ అయిన Tecno Pova 4 Pro

Tecno కంపెనీ ఇటీవలె Tecno Pova Neo 5G అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.15,499. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉన్నాయి. తాజాగా టెక్నో సంస్థ Tecno Pova 4 Pro అనే ఫోన్ ని లాంచ్ చేసింది. 50 మెగా పిక్సెల్ కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 వంటి స్పెసిఫికేషన్స్ ని టెక్నో పోవా 4ప్రో కలిగి ఉంది. Tecno Pova 4 Pro కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

Tecno Pova 4 Pro స్పెసిఫికేషన్స్

Tecno Pova 4 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. Tecno Pova 4 Pro లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూడ్రాప్ నాచ్ ఉన్నాయి. Tecno Pova 4 Pro ఫోన్ 164.79 మిల్లీ మీటర్ల పొడవు, 77 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.19 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

Tecno Pova 4 Pro ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉపయోగించారు. Tecno Pova 4 Pro లో 8జిబి ర్యామ్, 5జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. అలాగే ఇందులో 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

ఇప్పుడు Tecno Pova 4 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Tecno Pova 4 Pro లో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Tecno Pova 4 Pro లో ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

Tecno Pova 4 Pro డ్యూయల్ సిమ్ 4జీ ఫోన్. ఎన్‌ఎఫ్‌సీ తో పాటు ఇటర బేసిక్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం Tecno Pova 4 Pro లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. అలాగే Tecno Pova 4 Pro లో 10 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Tecno Pova 4 Pro ధర

Tecno Pova 4 Pro సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 8ఇబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతానికి Tecno Pova 4 Pro కేవలం బంగ్లాదేశ్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. అక్కడ ఈ ఫోన్ ధర BDT 26,990. మన కరెన్సీలోకి మారిస్తే దాని ధర రూ.21,500. ఇతర మార్కెట్స్ లో Tecno Pova 4 Pro స్మార్ట్ ఫోన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియదు. త్వరలోనే కంపెనీ నుంచి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 13GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లాంచ్ అయిన Tecno Pova 4 Pro first appeared on 91Mobiles Telugu.

]]>