Tecno Pova 5 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 14 Aug 2023 11:25:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/tecno-pova-5-pova-5-pro-launched-india-price-specs-availability/ Mon, 14 Aug 2023 10:08:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=7590 టెక్నో సంస్థ భారత్ లో Tecno POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Tecno POVA 5, Tecno POVA 5 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లలో Tecno POVA 5 Pro మోడల్ చూడటానికి Nothing Phone 2 మాదిరిగా కనిపిస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ అని పిలుస్తోంది. Tecno POVA 5 Pro మోడల్ […]

The post భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన పోవా సిరీస్
  • లైనప్ లో వచ్చిన Tecno POVA 5, Tecno POVA 5 Pro
  • భారత్ లో Tecno POVA 5 సిరీస్ ధర రూ.11,999 తో ప్రారంభం

టెక్నో సంస్థ భారత్ లో Tecno POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Tecno POVA 5, Tecno POVA 5 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లలో Tecno POVA 5 Pro మోడల్ చూడటానికి Nothing Phone 2 మాదిరిగా కనిపిస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ అని పిలుస్తోంది. Tecno POVA 5 Pro మోడల్ లో మాత్రమే ఈ డిజైన్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ లైట్స్ గ్లో అవుతాయి.

Tecno POVA 5, POVA 5 Pro ధరలు

  • భారతీయ మార్కెట్ లో Tecno POVA 5 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు. ఈ టెక్నో ఫోన్ ని ఆగస్టు 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. మెకా బ్లాక్, అంబర్ గోల్డ్ మరియు హరికేన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.
  • Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ ని 8జిబి ర్యామ్ తో భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసారు. బేస్ వేరియంట్ 128జిబి ని ఆఫర్ చేస్తుంది. టాప్ వేరియంట్ 256జిబి స్టోరేజీని అందిస్తుంది. Tecno POVA 5 Pro ధరను రూ.14,999 గా నిర్ణయించారు. ఆగస్టు 22 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ డార్క్ ఇల్యూషన్, ఫ్యాంటసీ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Tecno POVA 5 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno POVA 5 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ఓఎస్: Tecno POVA 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Tecno POVA 5 స్మార్ట్ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Tecno POVA 5 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Tecno POVA 5 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno POVA 5 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno POVA 5 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Tecno POVA 5 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno POVA 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno POVA 5 Pro లో ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మరియు ఇతర కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో Tecno POVA 5, POVA 5 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన టెక్నో సంస్థ https://www.91mobiles.com/telugu/tecno-pova-5-pova-5-pro-announced-india-price-specs-availability/ Fri, 11 Aug 2023 16:36:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=7574 నేడు భారత్ లో టెక్నో సంస్థ POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Tecno POVA 5, Tecno POVA 5 Pro మోడల్స్ లాంచ్ అయ్యాయి. టాప్ మోడల్ అయిన Tecno POVA 5 Pro ఎల్ఈడీ లైట్ రియర్ డిజైన్ తో వచ్చింది. టెక్నో కంపెనీ ఈ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ (Arc Interface) అని పిలుస్తోంది. అయితే ఇది చూసేందుకు Nothing Phone 2 మాదిరి […]

The post భారత్‌లో Tecno POVA 5, POVA 5 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన టెక్నో సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Tecno POVA 5 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Tecno POVA 5 Pro, Tecno POVA 5
  • బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ తో వచ్చిన POVA 5 Pro

నేడు భారత్ లో టెక్నో సంస్థ POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Tecno POVA 5, Tecno POVA 5 Pro మోడల్స్ లాంచ్ అయ్యాయి. టాప్ మోడల్ అయిన Tecno POVA 5 Pro ఎల్ఈడీ లైట్ రియర్ డిజైన్ తో వచ్చింది. టెక్నో కంపెనీ ఈ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ (Arc Interface) అని పిలుస్తోంది. అయితే ఇది చూసేందుకు Nothing Phone 2 మాదిరి కనిపిస్తోంది. అయితే ఈ రెండు ఫోన్లు కూడా ఇప్పటికే గ్లోబల్ లో లాంచ్ కాగా, నేడు భారత్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.

Tecno POVA 5, Tecno POVA 5 Pro సేల్ వివరాలు, కలర్స్

Tecno POVA 5, Tecno POVA 5 Pro ఫోన్ల ధరలు తర్వాత ప్రకటించబడతాయి. రెండు స్మార్ట్ ఫోన్లను కూడా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 14 న రెండు ఫోన్లు సేల్ కి అందుబాటులోకి వస్తాయని అమెజాన్ లో మైక్రో సైట్ ద్వారా తెలుస్తోంది.

Tecno POVA 5 డివైజ్ హరికేన్ బ్లూ, మెకా బ్లాక్ మరియు అంబర్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ మోడల్ లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ ఉండవు. అయితే ఇండస్ట్రీ-ఫస్ట్ 3డీ టర్బో మెకా ప్యానెల్ తో వస్తోంది.

Tecno POVA 5 Pro డివైజ్ సిల్వర్ ఫ్యాంటసీ, డార్క్ ఇల్యూషన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. గేమింగ్, ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, లో-బ్యాటరీ వార్నింగ్స్ సమయంలో ఈ ఎల్ఈడీ లైట్స్ వెలుగుతాయి.

Tecno POVA 5 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno POVA 5 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Tecno POVA 5 Pro లో 50ఎంపి ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno POVA 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno POVA 5 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno POVA 5 Pro డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Tecno POVA 5 Pro లో 50ఎంపి ఏఐ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno POVA 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post భారత్‌లో Tecno POVA 5, POVA 5 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన టెక్నో సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>